Display Topic
Infinite in number
ఆదికాండము 15:5 – మరియు ఆయన వెలుపలికి అతని తీసికొనివచ్చి నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
యిర్మియా 33:2 – మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు
God
-created
ఆదికాండము 1:16 – దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
కీర్తనలు 8:3 – నీచేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
కీర్తనలు 148:5 – యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
-Set, in the firmament of heaven
ఆదికాండము 1:17 – భూమిమీద వెలుగిచ్చుటకును
-appointed to give light by night
ఆదికాండము 1:16 – దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
ఆదికాండము 1:14 – దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు,
కీర్తనలు 136:9 – రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును.
యిర్మియా 31:35 – పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
-Numbers and names
కీర్తనలు 147:4 – నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
-Established, for ever
కీర్తనలు 148:3 – సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 148:6 – ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.
యిర్మియా 31:36 – ఆ నియమములు నా సన్నిధినుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.
-Obscures
యోబు 9:7 – ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును.
Revolve in fixed orbits
న్యాయాధిపతులు 5:20 – వెండి లాభము వారు తీసికొనలేదు నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను.
Shine in the firmament of heaven
దానియేలు 12:3 – బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
Appear of different magnitudes
1కొరిందీయులకు 15:41 – నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదుగదా
Appear after sunset
నెహెమ్యా 4:21 – ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.
యోబు 3:9 – అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక
Called
-the host of heaven
ద్వితియోపదేశాకాండము 17:3 – అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీయులలో జరిగియుండుట వాస్తవమైనయెడల
యిర్మియా 33:22 – ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును.
-stars of light
కీర్తనలు 148:3 – సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
-stars of heaven
యెషయా 13:10 – ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటికమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
When grouped together called constellations
2రాజులు 23:5 – మరియు యూదా పట్టణములయందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపివేసెను.
యెషయా 13:10 – ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటికమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
Exhibit the greatness of God’s power
కీర్తనలు 8:3 – నీచేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
యెషయా 40:26 – మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయముచేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.
Made to praise God
కీర్తనలు 148:3 – సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
Impure in the sight of God
యోబు 25:5 – ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు.
Mentioned in scripture
-morning Star
ప్రకటన 2:28 – మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
-Arcturus
యోబు 9:9 – ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు.
యోబు 38:32 – వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
-Pleiades
యోబు 9:9 – ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు.
యోబు 38:31 – కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
ఆమోసు 5:8 – ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.
-Orion
యోబు 9:9 – ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు.
యోబు 38:31 – కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
ఆమోసు 5:8 – ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.
-Mazzaroth
యోబు 38:32 – వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
One of extraordinary brightness appeared at Christ’s birth
మత్తయి 2:2 – యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
మత్తయి 2:9 – వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.
Idolaters worshipped
యిర్మియా 8:2 – వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంటవలె పడియుండును.
యిర్మియా 19:13 – యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులును ఆ తోఫెతు స్థలమువలెనే అపవిత్రములగును; ఏ యిండ్లమీద జనులు ఆకాశ సమూహమను దేవతలకు ధూపము వేయుదురో, లేక అన్యదేవతలకు పానార్పణముల నర్పించుదురో ఆ యిండ్లన్నిటికి ఆలాగే జరుగును.
The Israelites forbidden to worship
ద్వితియోపదేశాకాండము 4:19 – సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.
ద్వితియోపదేశాకాండము 17:2 – నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశనక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు
ద్వితియోపదేశాకాండము 17:3 – అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీయులలో జరిగియుండుట వాస్తవమైనయెడల
ద్వితియోపదేశాకాండము 17:4 – ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునిగాని స్త్రీనిగాని నీ గ్రామముల వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టవలెను.
Punishment for worshipping
ద్వితియోపదేశాకాండము 17:5 – ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను.
ద్వితియోపదేశాకాండము 17:6 – ఒక్క సాక్షి మాటమీద వానికి విధింపకూడదు.
ద్వితియోపదేశాకాండము 17:7 – వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
False gods frequently worshipped under the representation of
ఆమోసు 5:26 – మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.
అపోస్తలులకార్యములు 7:43 – మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసికొనిపోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
Astrology and star-gazing practised by the Babylonians
యెషయా 47:13 – నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.
Use of, in navigation, alluded to
అపోస్తలులకార్యములు 27:20 – కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగ పోయెను.
Illustrative
-of Christ
సంఖ్యాకాండము 24:17 – ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
-of angels
యోబు 38:7 – ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
-of Ministers
ప్రకటన 1:16 – ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
ప్రకటన 1:20 – అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములనుగూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు
ప్రకటన 2:1 – ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా
-of princes and subordinate governors
దానియేలు 8:10 – ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను
ప్రకటన 8:12 – నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
– (Bright and morning star,) of Christ
ప్రకటన 22:16 – సంఘముల కోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
– (Morning star,) of glory to be given to faithful saints
ప్రకటన 2:28 – మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
– (Shining of,) of the reward of faithful ministers
దానియేలు 12:3 – బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
– (Withdrawing their light,) of severe judgments
యెషయా 13:10 – ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటికమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
యెహెజ్కేలు 32:7 – నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగుచేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.
యోవేలు 2:10 – వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
యోవేలు 3:15 – సూర్యచంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను.
– (Setting the nest amongst,) of pride and carnal security
ఓబధ్యా 1:4 – పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రిందపడవేతును; ఇదే యెహోవా వాక్కు.
– (Wandering,) of false teachers
యూదా 1:13 – తమ అవమానమను నురుగు వెళ్లగ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.