Display Topic
An abomination to God
సామెతలు 6:16 – యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు
సామెతలు 6:19 – లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
Forbidden
నిర్గమకాండము 23:1 – లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
ఎఫెసీయులకు 4:31 – సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
యాకోబు 4:11 – సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి.
Includes
-Whispering
రోమీయులకు 1:29 – అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
2కొరిందీయులకు 12:20 – ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండునేమో అనియు,
-Backbiting
రోమీయులకు 1:30 – కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును
2కొరిందీయులకు 12:20 – ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండునేమో అనియు,
-evil surmising
1తిమోతి 6:4 – వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములనుగూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
-tale-bearing
లేవీయకాండము 19:16 – నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను.
-Babbling
ప్రసంగి 10:11 – మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.
-Tattling
1తిమోతి 5:13 – మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు.
-evil speaking
కీర్తనలు 41:5 – అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.
కీర్తనలు 109:20 – నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడువారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతికారము.
-Defaming
యిర్మియా 20:10 – నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు.
1కొరిందీయులకు 4:13 – దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
– Bearing false witness
నిర్గమకాండము 20:16 – నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
ద్వితియోపదేశాకాండము 5:20 – నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
లూకా 3:14 – సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొంది యుండుడని వారితో చెప్పెను.
-Judging charitably
యాకోబు 4:11 – సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి.
యాకోబు 4:12 – ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైయున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
– Raising false reports
నిర్గమకాండము 23:1 – లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
-Repeating matters
సామెతలు 17:9 – ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.
Is a deceitful work
కీర్తనలు 52:2 – మోసము చేయువాడా, వాడిగల మంగలకత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది
Comes from the evil heart
మత్తయి 15:19 – దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును
లూకా 6:45 – సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.
Often arises from hatred
కీర్తనలు 41:7 – నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలోచించుచున్నారు.
కీర్తనలు 109:3 – నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
Idleness leads to
1తిమోతి 5:13 – మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు.
The wicked addicted to
కీర్తనలు 50:20 – నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.
యిర్మియా 6:28 – వారందరు బహు ద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.
యిర్మియా 9:4 – మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
Hypocrites addicted to
సామెతలు 11:9 – భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.
A characteristic of the devil
ప్రకటన 12:10 – మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
The wicked love
కీర్తనలు 52:4 – కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.
They who indulge in, are fools
సామెతలు 10:18 – అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
They who indulge in, not to be trusted
యిర్మియా 9:4 – మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
Women warned against
తీతుకు 2:3 – ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులు గలవారై యుండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు,
Minister’s wives should avoid
1తిమోతి 3:11 – అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.
Christ was exposed to
కీర్తనలు 35:11 – కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.
మత్తయి 26:60 – అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
Rulers exposed to
2పేతురు 2:10 – శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.
యూదా 1:8 – అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.
Ministers exposed to
రోమీయులకు 3:8 – మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.
2కొరిందీయులకు 6:8 – ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.
The nearest relations exposed to
కీర్తనలు 50:20 – నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.
Saints exposed to
కీర్తనలు 38:12 – నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.
కీర్తనలు 109:2 – నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
1పేతురు 4:4 – అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.
Saints
-Should keep their tongue from
కీర్తనలు 34:13 – చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.
1పేతురు 3:10 – జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
-Should lay aside
ఎఫెసీయులకు 4:31 – సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
1పేతురు 2:1 – ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్నయెడల
-Should be warned against
తీతుకు 3:1 – అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,
తీతుకు 3:2 – ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి యుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.
-Should give No occasion for
1పేతురు 2:12 – అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను
1పేతురు 3:16 – అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.
-Should return good for
1కొరిందీయులకు 4:13 – దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
-blessed in Enduring
మత్తయి 5:11 – నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
-Characterised as Avoiding
కీర్తనలు 15:1 – యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
కీర్తనలు 15:3 – అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువానిమీద నింద మోపడు
Should not be listened to
1సమూయేలు 24:9 – సౌలుతో ఇట్లనెను దావీదు నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు?
Should be discountenanced with anger
సామెతలు 25:23 – ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.
Effects of
-Separating friends
సామెతలు 16:28 – మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
సామెతలు 17:9 – ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.
-deadly wounds
సామెతలు 18:8 – కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
సామెతలు 26:22 – కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.
-Strife
సామెతలు 26:20 – కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
-Discord among brethren
సామెతలు 6:19 – లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
-Murder
కీర్తనలు 31:13 – అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.
యెహెజ్కేలు 22:9 – కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.
The tongue of, is a scourge
యోబు 5:21 – నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.
Is venomous
కీర్తనలు 140:3 – పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)
ప్రసంగి 10:11 – మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.
Is destructive
సామెతలు 11:9 – భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.
End of, is mischievous madness
ప్రసంగి 10:13 – వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెఱ్ఱితనము.
Men shall give account for
మత్తయి 12:36 – నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
యాకోబు 1:26 – ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.
Punishment for
ద్వితియోపదేశాకాండము 19:16 – అన్యాయపు సాక్ష్యము ఒకనిమీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల
ద్వితియోపదేశాకాండము 19:17 – ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను.
ద్వితియోపదేశాకాండము 19:18 – ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడియైనయెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.
ద్వితియోపదేశాకాండము 19:19 – అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరించుదురు.
ద్వితియోపదేశాకాండము 19:20 – మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
ద్వితియోపదేశాకాండము 19:21 – నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
కీర్తనలు 101:5 – తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
Illustrated
సామెతలు 12:18 – కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
సామెతలు 25:18 – తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.
Exemplified
– Laban’s Sons
ఆదికాండము 31:1 – లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
-Doeg
1సమూయేలు 22:9 – అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని.
1సమూయేలు 22:10 – అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా
1సమూయేలు 22:11 – రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా
-princes of Ammon
2సమూయేలు 10:3 – అమ్మోనీయుల ఘనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవిచేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీయొద్దకు ఓదార్చువారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచలేదా?
-Ziba
2సమూయేలు 16:3 – రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి యిప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను.
-Children of Belial
1రాజులు 21:13 – అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతనియెదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టిరి.
-Enemies of the Jews
ఎజ్రా 4:7 – అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది.
ఎజ్రా 4:8 – మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.
ఎజ్రా 4:9 – అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్సత్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును
ఎజ్రా 4:10 – ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి.
ఎజ్రా 4:11 – వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా
ఎజ్రా 4:12 – తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.
ఎజ్రా 4:13 – కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యక యుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.
ఎజ్రా 4:14 – మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితివిు.
ఎజ్రా 4:15 – మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియవచ్చును.
ఎజ్రా 4:16 – కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంతమాత్రము ఉండదు.
-Gashmu
నెహెమ్యా 6:6 – అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువుచేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు,
-Haman
ఎస్తేరు 3:8 – అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.
– David’s enemies
కీర్తనలు 31:13 – అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.
– Jeremiah’s enemies
యిర్మియా 38:4 – ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.
-Jews
మత్తయి 11:18 – యోహాను తినకయు త్రాగకయు వచ్చెను. గనుక వీడు దయ్యముపట్టినవాడని వారనుచున్నారు.
మత్తయి 11:19 – మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.
-witnesses against Christ
మత్తయి 26:59 – ప్రధానయాజకులును, మహా సభ వారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
మత్తయి 26:60 – అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
మత్తయి 26:61 – తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి.
-Priests
మార్కు 15:3 – ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
-Enemies of Stephen
అపోస్తలులకార్యములు 6:11 – అప్పుడు వారు వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని
-Enemies of Paul
అపోస్తలులకార్యములు 17:7 – వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.
-Tertullus
అపోస్తలులకార్యములు 24:2 – పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరముమోప నారంభించి యిట్లనెను
అపోస్తలులకార్యములు 24:5 – ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,