Display Topic


Probable origin of

ఆదికాండము 4:4 – హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను;

ఆదికాండము 4:7 – నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీయెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.

Was offered

-for sins of Ignorance

లేవీయకాండము 4:2 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైనయెడల, ఎట్లనగా

లేవీయకాండము 4:13 – ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల

లేవీయకాండము 4:22 – అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల

లేవీయకాండము 4:27 – మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల

-at the consecration of Priests

నిర్గమకాండము 29:10 – మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమచేతులనుంచగా

నిర్గమకాండము 29:14 – ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.

లేవీయకాండము 8:14 – ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి.

-at the consecration of Levites

సంఖ్యాకాండము 8:8 – తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొనిరావలెను.

– At the expiration of a Nazarite’s vow

సంఖ్యాకాండము 6:14 – అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధానబలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,

-on the day of atonement

లేవీయకాండము 16:3 – అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.

లేవీయకాండము 16:9 – ఏ మేకమీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొనివచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

Was a most holy sacrifice

లేవీయకాండము 6:25 – నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 6:29 – యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.

Consisted of

-A young Bullock for Priests

లేవీయకాండము 4:3 – ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

లేవీయకాండము 9:2 – అహరోనుతో ఇట్లనెను నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొనిరమ్ము.

లేవీయకాండము 9:8 – కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థబలిగా ఒక దూడను వధించెను.

లేవీయకాండము 16:3 – అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.

లేవీయకాండము 16:6 – అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి

-A young Bullock or He-Goat for the congregation

లేవీయకాండము 4:14 – వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు, సంఘము పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 16:9 – ఏ మేకమీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొనివచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

2దినవృత్తాంతములు 29:23 – పాపపరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమచేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి

-A male kid for A Ruler

లేవీయకాండము 4:23 – అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

-A Female kid or Female lamb for A Private person

లేవీయకాండము 4:28 – తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

లేవీయకాండము 4:32 – ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి

Sins of the offerer transferred to, by imposition of hands

లేవీయకాండము 4:4 – అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను

లేవీయకాండము 4:15 – సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.

లేవీయకాండము 4:24 – ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.

లేవీయకాండము 4:29 – పాపపరిహారార్థ బలిపశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను.

2దినవృత్తాంతములు 29:23 – పాపపరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమచేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి

Was killed in the same place as the burnt-offering

లేవీయకాండము 4:24 – ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.

లేవీయకాండము 6:25 – నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతిపరిశుద్ధము.

The blood of

-for A Priest or for the congregation, Brought by the Priest into the Tabernacle

లేవీయకాండము 4:5 – అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను.

లేవీయకాండము 4:16 – అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెయొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొనిరావలెను.

-for A Priest or for the congregation, Sprinkled seven times before the Lord, outside the Vail, by the Priest with His Finger

లేవీయకాండము 4:6 – ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 4:17 – ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెరవైపున యెహోవా సన్నిధిని ఏడు మారులు దాని ప్రోక్షింపవలెను.

-for A Priest of for the congregation, put Upon the horns of the altar of burnt offering by the Priest with His Finger

లేవీయకాండము 4:25 – ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.

లేవీయకాండము 4:30 – యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.

-in Every case poured at the foot of the altar of burnt offering

లేవీయకాండము 4:7 – అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను.

లేవీయకాండము 18:25 – ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కివేయుచున్నది.

లేవీయకాండము 18:30 – కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

లేవీయకాండము 9:9 – అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.

Fat of the inside, kidneys, burned on the altar of burnt offering

లేవీయకాండము 4:8 – మరియు అతడు పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని

లేవీయకాండము 4:9 – మూత్రగ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల పైనున్న కాలేజముమీది వపను

లేవీయకాండము 4:10 – సమాధానబలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను.

లేవీయకాండము 4:19 – మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను.

లేవీయకాండము 4:26 – సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

లేవీయకాండము 4:31 – మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

లేవీయకాండము 9:10 – దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలిపీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

When for a priest or the congregation, the skin, carcass, burned without the camp

లేవీయకాండము 4:11 – ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ

లేవీయకాండము 4:12 – పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.

లేవీయకాండము 4:21 – ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి.

లేవీయకాండము 6:30 – మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.

లేవీయకాండము 9:11 – దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను.

Was eaten by the priests in a holy place, when its blood had not been brought into the tabernacle

లేవీయకాండము 6:26 – పాపపరిహారార్థబలిగా దానినర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.

లేవీయకాండము 6:29 – యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 6:30 – మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.

Aaron, &c rebuked for burning and not eating that of the congregation, its blood not having been brought into the> tabernacle

లేవీయకాండము 10:16 – అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయియుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి

లేవీయకాండము 10:17 – మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలి పశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధము గదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.

లేవీయకాండము 10:18 – ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.

లేవీయకాండము 9:9 – అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.

లేవీయకాండము 9:15 – అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాపపరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటిదానివలె దీనిని పాపపరిహారార్థబలిగా అర్పించెను.

Whatever touched the flesh of, was rendered holy

లేవీయకాండము 6:27 – దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.

Garments sprinkled with the blood of, to be washed

లేవీయకాండము 6:27 – దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.

Laws respecting the vessels used for boiling the flesh of

లేవీయకాండము 6:28 – దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను.

Was typical of Christ’s sacrifice

2కొరిందీయులకు 5:21 – ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.

హెబ్రీయులకు 13:11 – వేటి రక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.

హెబ్రీయులకు 13:12 – కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.

హెబ్రీయులకు 13:13 – కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.