Display Topic
Descended from Jacob’s second son by Leah
ఆదికాండము 29:33 – ఆమె మరల గర్భవతియై కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.
Predictions respecting
ఆదికాండము 49:5 – షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.
ఆదికాండము 49:6 – నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.
ఆదికాండము 49:7 – వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
Persons selected from
-to number the people
సంఖ్యాకాండము 1:6 – షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు
-to spy out the land
సంఖ్యాకాండము 13:5 – జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
-to divide the land
సంఖ్యాకాండము 34:20 – షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,
Formed part of the second division of Israel in their journeys
సంఖ్యాకాండము 10:18 – రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
సంఖ్యాకాండము 10:19 – షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి.
Encamped under the standard of Reuben south of the tabernacle
సంఖ్యాకాండము 2:12 – అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.
Strength of, on leaving Egypt
సంఖ్యాకాండము 1:22 – మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
సంఖ్యాకాండము 1:23 – షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
సంఖ్యాకాండము 2:13 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడువందలమంది.
Offering of, at the dedication
సంఖ్యాకాండము 7:36 – అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీషదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు.
సంఖ్యాకాండము 7:37 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
సంఖ్యాకాండము 7:38 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను
సంఖ్యాకాండము 7:39 – ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను
సంఖ్యాకాండము 7:40 – పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
సంఖ్యాకాండము 7:41 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.
Families of
సంఖ్యాకాండము 26:12 – షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;
సంఖ్యాకాండము 26:13 – జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు.
Strength of, on entering Canaan
సంఖ్యాకాండము 26:14 – ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువది రెండువేల రెండువందలమంది.
Plagued for following the idolatry, of Midian, which accounts for Their decrease
సంఖ్యాకాండము 25:9 – ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.
సంఖ్యాకాండము 25:14 – చంపబడిన వాని పేరు జిమీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.
సంఖ్యాకాండము 26:14 – ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువది రెండువేల రెండువందలమంది.
సంఖ్యాకాండము 1:23 – షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
On Mount Gerizim said amen to the blessings
ద్వితియోపదేశాకాండము 27:12 – బెన్యామీను గోత్రములవారు ప్రజలనుగూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.
Inheritance of, within Judah
యెహోషువ 19:1 – రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.
యెహోషువ 19:2 – వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
యెహోషువ 19:3 – హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
యెహోషువ 19:4 – సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
యెహోషువ 19:5 – బేత్లెబాయోతు షారూ హెను అనునవి,
యెహోషువ 19:6 – వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణ ములు.
యెహోషువ 19:7 – అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.
యెహోషువ 19:8 – దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
Bounds of their inheritance with cities and villages
యెహోషువ 19:2 – వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
యెహోషువ 19:3 – హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
యెహోషువ 19:4 – సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
యెహోషువ 19:5 – బేత్లెబాయోతు షారూ హెను అనునవి,
యెహోషువ 19:6 – వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణ ములు.
యెహోషువ 19:7 – అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.
యెహోషువ 19:8 – దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
1దినవృత్తాంతములు 4:28 – వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను
1దినవృత్తాంతములు 4:29 – బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను
1దినవృత్తాంతములు 4:30 – హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
1దినవృత్తాంతములు 4:31 – దావీదు ఏలుబడివరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.
1దినవృత్తాంతములు 4:32 – ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.
1దినవృత్తాంతములు 4:33 – బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.
United with Judah in expelling the Canaanites from their inheritance
న్యాయాధిపతులు 1:3 – అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోమనము కనా నీయులతో యుద్ధము చేయుటకుమా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడ పోయిరి.
న్యాయాధిపతులు 1:17 – యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫ తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.
Many of, at the coronation of David
1దినవృత్తాంతములు 12:25 – షిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు ఏడువేల నూరుమంది.
Officer appointed over, by David
1దినవృత్తాంతములు 27:16 – మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీద నున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,
Part of, united with Judah under Asa
2దినవృత్తాంతములు 15:9 – యూదా వారినందరిని బెన్యామీనీయులనందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి.
Josiah purged their land of idols
2దినవృత్తాంతములు 34:6 – ఆ ప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును, చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను.
Part of, destroyed the remnant of the Amalekites, and dwelt in their land
1దినవృత్తాంతములు 4:39 – వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి
1దినవృత్తాంతములు 4:40 – మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వమందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి.
1దినవృత్తాంతములు 4:41 – పేళ్ల వరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొనియున్నారు.
1దినవృత్తాంతములు 4:42 – షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధిపతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి
1దినవృత్తాంతములు 4:43 – అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.