Display Topic


Early use of

ఆదికాండము 14:23 – నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.

Called sandals

మార్కు 6:9 – చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను.

అపోస్తలులకార్యములు 12:8 – అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైనవేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.

Soles of, sometimes plated with brass or iron

ద్వితియోపదేశాకాండము 33:25 – నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.

Bound round the feet with latchets or strings

యోహాను 1:27 – మీరాయననెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 12:8 – అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైనవేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.

Of ladies of distinction

– Often made of badgers’ skins

యెహెజ్కేలు 16:10 – విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.

-Often Highly ornamental

పరమగీతము 7:1 – రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.

-probably Often Adorned with tinkling ornaments

యెషయా 3:18 – ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

Loosing of, for another a degrading office

మార్కు 1:17 – యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.

యోహాను 1:27 – మీరాయననెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.

Bearing, for another a degrading office, only performed by slaves

మత్తయి 3:11 – మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.

The Jews

-put on, before beginning A journey

నిర్గమకాండము 12:11 – మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలుచేత పట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.

-Never Wore, in Mourning

2సమూయేలు 15:30 – అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలు లేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.

యెషయా 20:2 – ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను నీవు పోయి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచుచుండగా

యెషయా 20:3 – యెహోవానా సేవకుడైన యెషయా ఐగుప్తునుగూర్చియు కూషునుగూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము

యెహెజ్కేలు 24:17 – మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు

యెహెజ్కేలు 24:23 – మీ శిరోభూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాదరక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించిపోవుదురు.

-put off, when they entered Sacred places

నిర్గమకాండము 3:5 – అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.

యెహోషువ 5:15 – అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.

Worn out by a long journey

యెహోషువ 9:5 – పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చు కొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.

యెహోషువ 9:13 – ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెనని అతనితో చెప్పిరి.

Of Israel preserved for forty years, while journeying in the wilderness

ద్వితియోపదేశాకాండము 29:5 – నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు.

Often given as bribes

ఆమోసు 2:6 – యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మివేయుదురు.

ఆమోసు 8:6 – దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదినమెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.

Customs connected with

– A man who refused to marry a deceased brother’s wife disgraced by pulling off his shoes

ద్వితియోపదేశాకాండము 25:9 – ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను.

ద్వితియోపదేశాకాండము 25:10 – అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.

– The right of redemption resigned by a man’s giving one of his shoes to the next of kin

రూతు 4:7 – ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చిగాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.

రూతు 4:8 – ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా

The Apostles prohibited from taking for their journey more, than the pair they had on

మత్తయి 10:10 – పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?

మార్కు 6:9 – చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను.

లూకా 10:4 – మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు;

Illustrative

-of the preparation of the gospel

ఎఫెసీయులకు 6:15 – పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి.

-of the beauty Conferred on Saints

పరమగీతము 7:1 – రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.

లూకా 15:22 – అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;

– (Having blood on,) of being engaged in war and slaughter

1రాజులు 2:5 – అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీవెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షల మీదను పడజేసెను.

– (Taken off,) of an ignominious and servile condition

యెషయా 47:2 – తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్టతీసి నదులు దాటుము.

యిర్మియా 2:25 – జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.

– (Thrown over a place,) of subjection

కీర్తనలు 60:8 – మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయుము.

కీర్తనలు 108:9 – మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.