Display Topic


Contrary to the law of God

లేవీయకాండము 19:18 – కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.

మత్తయి 22:39 – నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

యాకోబు 2:8 – మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.

The example of Christ condemns

యోహాను 4:34 – యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.

రోమీయులకు 15:3 – క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

2కొరిందీయులకు 8:9 – మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

God hates

మలాకీ 1:10 – మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Exhibited in

-Being lovers of ourselves

2తిమోతి 3:2 – ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు

-pleasing ourselves

రోమీయులకు 15:1 – కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమైయున్నాము.

-Seeking Our own

1కొరిందీయులకు 10:33 – ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను.

ఫిలిప్పీయులకు 2:21 – అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.

-Seeking after gain

యెషయా 56:11 – కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.

-Seeking undue Precedence

మత్తయి 20:21 – నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.

-living to ourselves

2కొరిందీయులకు 5:15 – జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము.

-neglect of the Poor

1యోహాను 3:17 – ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

-Serving God for reward

మలాకీ 1:10 – మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

-Performing duty for reward

మీకా 3:11 – జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.

Inconsistent with Christian love

1కొరిందీయులకు 13:5 – అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

Inconsistent with communion of saints

రోమీయులకు 12:4 – ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,

రోమీయులకు 12:5 – ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

1కొరిందీయులకు 12:12 – ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

1కొరిందీయులకు 12:13 – ఏలాగనగా, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.

1కొరిందీయులకు 12:14 – శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

1కొరిందీయులకు 12:15 – నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

1కొరిందీయులకు 12:16 – మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

1కొరిందీయులకు 12:17 – శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

1కొరిందీయులకు 12:18 – అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.

1కొరిందీయులకు 12:19 – అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

1కొరిందీయులకు 12:20 – అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

1కొరిందీయులకు 12:21 – గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

1కొరిందీయులకు 12:22 – అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.

1కొరిందీయులకు 12:23 – శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.

1కొరిందీయులకు 12:24 – సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

1కొరిందీయులకు 12:25 – అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

1కొరిందీయులకు 12:26 – కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.

1కొరిందీయులకు 12:27 – అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు

Especially forbidden to saints

1కొరిందీయులకు 10:24 – ఎవడును తనకొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలుచేయ చూచుకొనవలెను.

ఫిలిప్పీయులకు 2:4 – మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

The love of Christ should constrain us to avoid

2కొరిందీయులకు 5:14 – క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

2కొరిందీయులకు 5:15 – జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము.

Ministers should be devoid of

1కొరిందీయులకు 9:19 – నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.

1కొరిందీయులకు 9:20 – యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.

1కొరిందీయులకు 9:21 – దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలెఉంటిని.

1కొరిందీయులకు 9:22 – బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

1కొరిందీయులకు 9:23 – మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

1కొరిందీయులకు 10:33 – ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను.

All men addicted to

ఎఫెసీయులకు 2:3 – వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

ఫిలిప్పీయులకు 2:21 – అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.

Saints falsely accused of

యోబు 1:9 – అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?

యోబు 1:10 – నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

యోబు 1:11 – అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

Characteristic of the last days

2తిమోతి 3:1 – అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

2తిమోతి 3:2 – ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు

Exemplified

-Cain

ఆదికాండము 4:9 – యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.

-Nabal

1సమూయేలు 25:3 – అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియై యుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతివాడు.

1సమూయేలు 25:11 – నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొఱ్ఱలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగనివారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా

-Haman

ఎస్తేరు 6:6 – రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను

-Priests

యెషయా 56:11 – కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.

-Jews

జెకర్యా 7:6 – మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి; మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి.

-James and John

మార్కు 10:37 – వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి.

-multitude

యోహాను 6:26 – యేసు మీరు సూచనలను చూచుటవలన కాదుగాని రొట్టెలు భుజించి తృప్తిపొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.