Display Topic
Architecture
ద్వితియోపదేశాకాండము 8:12 – మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,
1దినవృత్తాంతములు 29:19 – నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము.
Arithmetic
ఆదికాండము 15:5 – మరియు ఆయన వెలుపలికి అతని తీసికొనివచ్చి నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
లేవీయకాండము 26:8 – మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.
యోబు 29:18 – అప్పుడు నేనిట్లనుకొంటిని నా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.
Astronomy
యోబు 38:31 – కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
యోబు 38:32 – వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
యెషయా 13:10 – ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటికమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
Astrology
యెషయా 47:13 – నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.
Botany
1రాజులు 4:33 – మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటినిగూర్చియు అతడు వ్రాసెను.
Geography
ఆదికాండము 10:1 – ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
ఆదికాండము 10:2 – యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
ఆదికాండము 10:3 – గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
ఆదికాండము 10:4 – యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.
ఆదికాండము 10:5 – వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.
ఆదికాండము 10:6 – హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
ఆదికాండము 10:7 – కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
ఆదికాండము 10:8 – కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
ఆదికాండము 10:9 – అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.
ఆదికాండము 10:10 – షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
ఆదికాండము 10:11 – ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
ఆదికాండము 10:12 – నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.
ఆదికాండము 10:13 – మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
ఆదికాండము 10:14 – పత్రుసీయులను కస్లూహీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు.
ఆదికాండము 10:15 – కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
ఆదికాండము 10:16 – హివ్వీయులను అర్కీయులను సినీయులను
ఆదికాండము 10:17 – అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను.
ఆదికాండము 10:18 – తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
ఆదికాండము 10:19 – కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.
ఆదికాండము 10:20 – వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములనుబట్టియు జాతులనుబట్టియు హాము కుమారులు.
ఆదికాండము 10:21 – మరియు ఏబెరు యొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
ఆదికాండము 10:22 – షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామనువారు.
ఆదికాండము 10:23 – అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.
ఆదికాండము 10:24 – అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
ఆదికాండము 10:25 – ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
ఆదికాండము 10:26 – యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
ఆదికాండము 10:27 – హదోరమును ఊజాలును దిక్లాను
ఆదికాండము 10:28 – ఓబాలును అబీమాయెలును షేబను
ఆదికాండము 10:29 – ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
ఆదికాండము 10:30 – మేషా నుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పుకొండలు వారి నివాసస్థలము.
యెషయా 11:11 – ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
History and Chronology
1రాజులు 22:39 – అహాబు చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
2రాజులు 1:18 – అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
1దినవృత్తాంతములు 9:1 – ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడిన మీదట వారి పేళ్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొనిపోబడిరి.
1దినవృత్తాంతములు 29:29 – రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరికమంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,
Mechanics
ఆదికాండము 6:14 – చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను.
ఆదికాండము 6:15 – నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను.
ఆదికాండము 6:16 – ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.
ఆదికాండము 11:4 – మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
నిర్గమకాండము 14:6 – అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొనిపోయెను.
నిర్గమకాండము 14:7 – మరియు అతడు శ్రేష్ఠమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను.
Medicine
యిర్మియా 8:22 – గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది?
మార్కు 5:26 – తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను.
Music
1దినవృత్తాంతములు 16:4 – మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.
1దినవృత్తాంతములు 16:5 – వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
1దినవృత్తాంతములు 16:6 – బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.
1దినవృత్తాంతములు 16:7 – ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
1దినవృత్తాంతములు 25:6 – వీరందరు ఆసాపునకును యెదూతూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి.
Navigation
1రాజులు 9:27 – సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.
కీర్తనలు 107:23 – ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహా జలములమీద సంచరించుచు వ్యాపారము చేయువారు
Surveying
యెహోషువ 18:4 – ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించినయెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆ యా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నాయొద్దకు తీసికొనివచ్చెదరు.
యెహోషువ 18:5 – వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను.
యెహోషువ 18:6 – మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నాయొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.
యెహోషువ 18:7 – లేవీయు లకు మీ మధ్య ఏ వంతును కలుగదు, యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయు లును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పుదిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు.
యెహోషువ 18:8 – ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితోమీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా
యెహోషువ 18:9 – ఆ మనుష్యులు వెళ్లి దేశసంచారము చేయుచు ఏడువంతులుగా, గ్రామములచొప్పున, దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువయొద్దకు వచ్చిరి.
నెహెమ్యా 2:12 – రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు.
నెహెమ్యా 2:13 – నేను రాత్రికాలమందు లోయద్వారము గుండ భుజంగపు బావి యెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.
నెహెమ్యా 2:14 – తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.
నెహెమ్యా 2:15 – నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.
నెహెమ్యా 2:16 – అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైనవారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు.
యెహెజ్కేలు 40:5 – నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకారముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.
యెహెజ్కేలు 40:6 – అతడు తూర్పుతట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.
జెకర్యా 2:2 – నీవెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవుచున్నాననెను.
Zoology
1రాజులు 4:33 – మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటినిగూర్చియు అతడు వ్రాసెను.