Display Topic
A sect of the Jews
అపోస్తలులకార్యములు 5:17 – ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని
Denied the resurrection and a future stated
మత్తయి 22:23 – పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి
లూకా 20:27 – పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి.
The resurrection a cause of dispute between them and the Pharisees
అపోస్తలులకార్యములు 23:6 – అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.
అపోస్తలులకార్యములు 23:7 – సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.
అపోస్తలులకార్యములు 23:8 – అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగవులాడిరి
అపోస్తలులకార్యములు 23:9 – కలహమెక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొనిరండని సైనికులకు ఆజ్ఞాపించెను.
Were refused baptism by John
మత్తయి 3:7 – అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలము ఫలించుడి
Christ
-Tempted by
మత్తయి 16:1 – అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను
-Cautioned His disciples against their principles
మత్తయి 16:6 – అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడని వారితో చెప్పెను.
మత్తయి 16:11 – నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను.
మత్తయి 16:12 – అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
-Vindicated the resurrection against
మత్తయి 22:24 – బోధకుడా, ఒకడు పిల్లలులేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పెను;
మత్తయి 22:25 – మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.
మత్తయి 22:26 – రెండవవాడును మూడవవాడును ఏడవవానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.
మత్తయి 22:27 – అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
మత్తయి 22:28 – పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెనుగదా అని ఆయనను అడిగిరి.
మత్తయి 22:29 – అందుకు యేసు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
మత్తయి 22:30 – పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.
మత్తయి 22:31 – మృతుల పునరుత్థానమునుగూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?
మత్తయి 22:32 – ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.
మార్కు 12:19 – బోధకుడా, తన భార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
మార్కు 12:20 – ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను
మార్కు 12:21 – గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.
మార్కు 12:22 – ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
మార్కు 12:23 – పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.
మార్కు 12:24 – అందుకు యేసు మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగకపోవుట వలననే పొరబడుచున్నారు.
మార్కు 12:25 – వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
మార్కు 12:26 – వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.
మార్కు 12:27 – ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను.
-Silenced
మత్తయి 22:34 – ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడివచ్చిరి.
Persecuted the Christians
అపోస్తలులకార్యములు 4:1 – వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
అపోస్తలులకార్యములు 5:17 – ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని
అపోస్తలులకార్యములు 5:18 – అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.
అపోస్తలులకార్యములు 5:40 – వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.