Display Topic


Made by sacrifice

లేవీయకాండము 1:4 – అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.

లేవీయకాండము 1:5 – అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

By priests alone

1దినవృత్తాంతములు 6:49 – అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను.

2దినవృత్తాంతములు 29:24 – ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించియుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.

Necessary for

-Propitiating God

నిర్గమకాండము 32:30 – మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండయెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.

లేవీయకాండము 23:27 – ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.

లేవీయకాండము 23:28 – ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము.

2సమూయేలు 21:3 – రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా

-Ransoming

నిర్గమకాండము 30:15 – అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.

నిర్గమకాండము 30:16 – నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును.

యోబు 33:24 – దేవుడు వానియందు కరుణజూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.

-Purifying

నిర్గమకాండము 29:36 – ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలినర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.

Offered for

-the congregation

సంఖ్యాకాండము 15:25 – యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

2దినవృత్తాంతములు 29:24 – ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించియుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.

-the Priests

నిర్గమకాండము 29:31 – మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.

నిర్గమకాండము 29:32 – అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.

నిర్గమకాండము 29:33 – వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు.

లేవీయకాండము 8:34 – మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.

-Persons sinning ignorantly

లేవీయకాండము 4:20 – అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును.

లేవీయకాండము 4:21 – ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి.

లేవీయకాండము 4:22 – అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల

లేవీయకాండము 4:23 – అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

లేవీయకాండము 4:24 – ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.

లేవీయకాండము 4:25 – ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.

లేవీయకాండము 4:26 – సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

లేవీయకాండము 4:27 – మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల

లేవీయకాండము 4:28 – తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

లేవీయకాండము 4:29 – పాపపరిహారార్థ బలిపశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను.

లేవీయకాండము 4:30 – యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.

లేవీయకాండము 4:31 – మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

లేవీయకాండము 4:32 – ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి

లేవీయకాండము 4:33 – పాపపరిహారార్థబలియగు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థబలియగు దానిని వధింపవలెను.

లేవీయకాండము 4:34 – యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.

లేవీయకాండము 4:35 – మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

-Persons sinning wilfully

లేవీయకాండము 6:7 – ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధియగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.

-Persons swearing rashly

లేవీయకాండము 5:4 – మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టుపెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టుపెట్టుకొనినయెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును.

లేవీయకాండము 5:6 – తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.

-Persons withholding evidence

లేవీయకాండము 5:1 – ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదానిగూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియైయుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.

లేవీయకాండము 5:6 – తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.

-Persons unclean

లేవీయకాండము 5:2 – మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్ర మృగ కళేబరమేగాని అపవిత్ర పశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును.

లేవీయకాండము 5:3 – మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును.

లేవీయకాండము 5:6 – తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.

-Women after childbirth

లేవీయకాండము 12:8 – ఆమె గొఱ్ఱపిల్లను తేజాలనియెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొనిరావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును.

-the altar

నిర్గమకాండము 29:36 – ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలినర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.

నిర్గమకాండము 29:37 – ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.

లేవీయకాండము 16:18 – మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి

లేవీయకాండము 16:19 – యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.

-the holy place

లేవీయకాండము 16:16 – అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టియు, అనగా వారి అపవిత్రతనుబట్టియు, వారి అతిక్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుటవలన వారి అపవిత్రతనుబట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.

లేవీయకాండము 16:17 – పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.

-the healed leper

లేవీయకాండము 14:18 – అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువనూనెను పవిత్రత పొందగోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.

-the leprous house healed

లేవీయకాండము 14:53 – అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.

Extraordinary cases of

నిర్గమకాండము 32:30 – మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండయెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.

నిర్గమకాండము 32:31 – అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగివెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.

నిర్గమకాండము 32:32 – అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.

నిర్గమకాండము 32:33 – అందుకు యెహోవా యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచివేయుదును.

నిర్గమకాండము 32:34 – కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.

సంఖ్యాకాండము 16:47 – మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

సంఖ్యాకాండము 25:10 – అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

సంఖ్యాకాండము 25:11 – వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయులమీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

సంఖ్యాకాండము 25:12 – కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

సంఖ్యాకాండము 25:13 – అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

Typical of Christ’s atonement

రోమీయులకు 5:6 – ఏలయనగా మనమింక బలహీనులమైయుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.

రోమీయులకు 5:7 – నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును.

రోమీయులకు 5:8 – అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

రోమీయులకు 5:9 – కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయనద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

రోమీయులకు 5:10 – ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

రోమీయులకు 5:11 – అంతేకాదు; మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము.