Display Topic


Is part of his character

కీర్తనలు 7:9 – హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,

కీర్తనలు 116:5 – యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు.

కీర్తనలు 119:137 – (సాదె) యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు

Described as

-very High

కీర్తనలు 71:19 – దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైనవాడెవడు?

-Abundant

కీర్తనలు 48:10 – దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది.

-Beyond computation

కీర్తనలు 71:15 – నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.

-Everlasting

కీర్తనలు 119:142 – నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.

-Enduring for ever

కీర్తనలు 111:3 – ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.

-the habitation of His throne

కీర్తనలు 97:2 – మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.

Christ acknowledged

యోహాను 17:25 – నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు.

Christ committed his cause to

1పేతురు 2:23 – ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.

Angels acknowledge

ప్రకటన 16:5 – అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;

Exhibited in

-His testimonies

కీర్తనలు 119:138 – నీతినిబట్టియు పూర్ణవిశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.

కీర్తనలు 119:144 – నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

-His commandments

ద్వితియోపదేశాకాండము 4:8 – మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులును గల గొప్ప జనమేది?

కీర్తనలు 119:172 – నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును.

-His judgments

కీర్తనలు 19:9 – యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.

కీర్తనలు 119:7 – నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

కీర్తనలు 119:62 – న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.

-His word

కీర్తనలు 119:123 – నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి.

-His ways

కీర్తనలు 145:17 – యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు

-His Acts

న్యాయాధిపతులు 5:11 – విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.

1సమూయేలు 12:7 – కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి

-His government

కీర్తనలు 96:13 – భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.

కీర్తనలు 98:9 – భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

-the gospel

కీర్తనలు 85:10 – కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.

రోమీయులకు 3:25 – పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

రోమీయులకు 3:26 – క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

-the final judgment

అపోస్తలులకార్యములు 17:31 – ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

-the Punishment of the Wicked

రోమీయులకు 2:5 – నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

2దెస్సలోనీకయులకు 1:6 – ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

ప్రకటన 16:7 – అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.

ప్రకటన 19:2 – ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి.

Shown to the posterity of saints

కీర్తనలు 103:17 – ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

Shown openly before the heathen

కీర్తనలు 98:2 – యెహోవా తన రక్షణను వెల్లడిచేసియున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.

God delights in the exercise of

యిర్మియా 9:24 – అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

The heavens shall declare

కీర్తనలు 50:6 – దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.)

కీర్తనలు 97:6 – ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది

Saints

-Ascribe, to him

యోబు 36:3 – దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.

దానియేలు 9:7 – ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.

-Acknowledge, in His dealings

ఎజ్రా 9:15 – యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటిదినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిని.

-Acknowledge, Though the Wicked Prosper

యిర్మియా 12:1 – యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?

కీర్తనలు 73:12 – ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.

కీర్తనలు 73:13 – నా హృదయమును నేను శుద్ధిచేసికొనియుండుట వ్యర్థమే నాచేతులు కడుగుకొని నిర్మలుడనైయుండుట వ్యర్థమే

కీర్తనలు 73:14 – దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.

కీర్తనలు 73:15 – ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.

కీర్తనలు 73:16 – అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు

కీర్తనలు 73:17 – నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.

-Recognise, in the fulfilment of His promises

నెహెమ్యా 9:8 – అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే.

-confident of Beholding

మీకా 7:9 – నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.

-Upheld by

యెషయా 41:10 – నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

-Do Not conceal

కీర్తనలు 40:10 – నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.

-mention, Only

కీర్తనలు 71:16 – ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములనుబట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.

-Talk of

కీర్తనలు 35:28 – నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

కీర్తనలు 71:15 – నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.

కీర్తనలు 71:24 – వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.

-Declare to others

కీర్తనలు 22:31 – వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరతురు.

-Magnify

కీర్తనలు 7:17 – యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

కీర్తనలు 51:14 – దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.

కీర్తనలు 145:7 – నీ మహా దయాళుత్వమునుగూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు

-plead in prayer

కీర్తనలు 143:11 – యెహోవా, నీ నామమునుబట్టి నన్ను బ్రదికింపుము నీ నీతినిబట్టి నా ప్రాణమును శ్రమలోనుండి తప్పింపుము.

దానియేలు 9:16 – ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, యెరూషలేము నీ జనులచుట్టు నున్న సకల ప్రజల యెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.

Leads God to love righteousness

కీర్తనలు 11:7 – యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

We should pray

-to be Led in

కీర్తనలు 5:8 – యెహోవా, నాకొఱకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.

-to be Quickened in

కీర్తనలు 119:40 – నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.

-to be delivered in

కీర్తనలు 31:1 – యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.

కీర్తనలు 71:2 – నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము.

-to be answered in

కీర్తనలు 143:1 – యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము.

-to be judged According to

కీర్తనలు 35:24 – యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్నుబట్టి వారు సంతోషింపకుందురు గాక.

-for its continued manifestation

కీర్తనలు 36:10 – నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలుపుము.

His care and defence of his people designed to teach

మీకా 6:4 – ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.

మీకా 6:5 – నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగినవాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.

The wicked have no interest in

కీర్తనలు 69:27 – దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము.

Illustrated

కీర్తనలు 36:6 – నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే