Display Topic


Is from God

రోమీయులకు 2:7 – సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

కొలొస్సయులకు 3:24 – మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.

హెబ్రీయులకు 11:6 – విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

Is of grace, through faith alone

రోమీయులకు 4:4 – పనిచేయువానికి జీతము ఋణమే గాని దానమని యెంచబడదు.

రోమీయులకు 4:5 – పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

రోమీయులకు 4:16 – ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసము గలవారికికూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

రోమీయులకు 11:6 – అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

Is of God’s good pleasure

మత్తయి 20:14 – నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;

మత్తయి 20:15 – నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.

లూకా 12:32 – చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది

Prepared by God

హెబ్రీయులకు 11:16 – అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్దపరచియున్నాడు

Prepared by Christ

యోహాను 14:2 – నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

As servants of Christ

కొలొస్సయులకు 3:24 – మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.

Not on account of their merits

రోమీయులకు 4:4 – పనిచేయువానికి జీతము ఋణమే గాని దానమని యెంచబడదు.

రోమీయులకు 4:5 – పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

Described as

-Being with Christ

యోహాను 12:26 – ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

యోహాను 14:3 – నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.

ఫిలిప్పీయులకు 1:23 – ఈ రెంటి మధ్యను ఇరుకున బడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు.

1దెస్సలోనీకయులకు 4:17 – ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

-Beholding the face of God

కీర్తనలు 17:15 – నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును.

మత్తయి 5:8 – హృదయశుద్ధి గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

ప్రకటన 22:4 – ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.

-Beholding the glory of Christ

యోహాను 17:24 – తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.

-Being glorified with Christ

రోమీయులకు 8:17 – మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.

రోమీయులకు 8:18 – మనయెడల ప్రత్యక్షముకాబోవు మహిమయెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

కొలొస్సయులకు 3:4 – మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

ఫిలిప్పీయులకు 3:21 – సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.

1యోహాను 3:2 – ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

-sitting in judgment with Christ

దానియేలు 7:22 – ఆ మహా వృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమునేలుదురను సంగతి నేను గ్రహించితిని.

మత్తయి 19:28 – యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.

లూకా 22:30 – సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.

1కొరిందీయులకు 6:2 – పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?

-Reigning with Christ

2తిమోతి 2:12 – సహించినవారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.

ప్రకటన 3:21 – నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

ప్రకటన 5:10 – మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

ప్రకటన 20:4 – అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నోసల్లయందుగానిచేతులయందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్చేదనము చేయబడినవారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి

-Reigning for ever and ever

ప్రకటన 22:5 – రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతి యైనను సూర్యకాంతి యైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

-A crown of righteousness

2తిమోతి 4:8 – ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించువారికందరికిని అనుగ్రహించును.

-A crown of glory

1పేతురు 5:4 – ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.

-A crown of life

యాకోబు 1:12 – శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

ప్రకటన 2:10 – ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.

-An Incorruptible crown

1కొరిందీయులకు 9:25 – మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.

-Joint heirship with Christ

రోమీయులకు 8:17 – మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.

-inheritance of all things

ప్రకటన 21:7 – జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడై యుండును.

-inheritance with Saints in light

అపోస్తలులకార్యములు 20:32 – ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు.

అపోస్తలులకార్యములు 26:18 – వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

కొలొస్సయులకు 1:12 – తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.

-inheritance Eternal

హెబ్రీయులకు 9:15 – ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందునిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు.

-inheritance Incorruptible

1పేతురు 1:4 – మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

-A kingdom

మత్తయి 25:34 – అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

లూకా 22:29 – గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,

-A kingdom immovable

హెబ్రీయులకు 12:28 – అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

-shining as the stars

దానియేలు 12:3 – బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

-Everlasting light

యెషయా 60:19 – ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

-Everlasting life

లూకా 18:30 – ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

యోహాను 6:40 – ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

యోహాను 17:2 – నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.

యోహాను 17:3 – అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.

రోమీయులకు 2:7 – సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

రోమీయులకు 6:23 – ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.

1యోహాను 5:11 – దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే.

-An Enduring substance

హెబ్రీయులకు 10:34 – ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.

-A house Eternal in the heavens

2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

-A city which had foundation

హెబ్రీయులకు 11:10 – ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

-entering into the Joy of the Lord

మత్తయి 25:21 – అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను

హెబ్రీయులకు 12:2 – మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

-rest

హెబ్రీయులకు 4:9 – కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.

ప్రకటన 14:13 – అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారివెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు

-Fulness of Joy

కీర్తనలు 16:11 – జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.

-the prize of the High calling of God in Christ

ఫిలిప్పీయులకు 3:14 – క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను.

-Treasure in heaven

మత్తయి 19:21 – అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను

లూకా 12:33 – మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు

-An Eternal weight of glory

2కొరిందీయులకు 4:17 – మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

Is great

మత్తయి 5:12 – సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

లూకా 6:35 – మీరైతే ఎట్టి వారినిగూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.

హెబ్రీయులకు 10:35 – కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.

Is full

2యోహాను 1:8 – అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

Is sure

సామెతలు 11:18 – భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

Is satisfying

కీర్తనలు 17:15 – నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును.

Is inestimable

యెషయా 64:4 – తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.

1కొరిందీయులకు 2:9 – ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.

Saints may feel confident of

కీర్తనలు 73:24 – నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు

యెషయా 25:8 – మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనుల నిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

యెషయా 25:9 – ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

2తిమోతి 4:8 – ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించువారికందరికిని అనుగ్రహించును.

Hope of, a cause of rejoicing

రోమీయులకు 5:2 – మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.

Be careful not to lose

2యోహాను 1:8 – అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

The prospect of, should lead to

-Diligence

2యోహాను 1:8 – అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

-Pressing forward

ఫిలిప్పీయులకు 3:14 – క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను.

-Enduring Suffering for Christ

2కొరిందీయులకు 4:16 – కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.

2కొరిందీయులకు 4:17 – మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

2కొరిందీయులకు 4:18 – ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.

హెబ్రీయులకు 11:26 – ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.

-Faithfulness to death

ప్రకటన 2:10 – ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.

Present afflictions not to be compared with

రోమీయులకు 8:18 – మనయెడల ప్రత్యక్షముకాబోవు మహిమయెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

2కొరిందీయులకు 5:17 – కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

Shall be given at the second coming of Christ

మత్తయి 16:27 – మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

ప్రకటన 22:12 – ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియ చొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.