Display Topic

A doctrine of the Old Testament

యోబు 19:26 – ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

కీర్తనలు 16:10 – ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు

కీర్తనలు 49:15 – దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును.(సెలా.)

యెషయా 26:19 – మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

దానియేలు 12:2 – మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

హోషేయ 13:14 – అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.

A first principle of the gospel

1కొరిందీయులకు 15:13 – మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.

1కొరిందీయులకు 15:14 – మరియు క్రీస్తు లేపబడి యుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

హెబ్రీయులకు 6:1 – కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు,

హెబ్రీయులకు 6:2 – దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములనుగూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.

Expected by the Jews

యోహాను 11:24 – మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.

హెబ్రీయులకు 11:35 – స్త్రీలు మృతులైన తమవారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.

Denied by the Sadducees

మత్తయి 22:23 – పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి

లూకా 20:27 – పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి.

అపోస్తలులకార్యములు 23:8 – అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగవులాడిరి

Explained away by false teachers

2తిమోతి 2:18 – వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.

Called in question by some in the church

1కొరిందీయులకు 15:12 – క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

Is not incredible

మార్కు 12:24 – అందుకు యేసు మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగకపోవుట వలననే పొరబడుచున్నారు.

అపోస్తలులకార్యములు 26:8 – దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?

Is not contrary to reason

యోహాను 12:24 – గోధుమగింజ భూమిలోపడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును.

1కొరిందీయులకు 15:35 – అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.

1కొరిందీయులకు 15:36 – ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.

1కొరిందీయులకు 15:37 – నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు.

1కొరిందీయులకు 15:38 – అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.

1కొరిందీయులకు 15:39 – మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు.

1కొరిందీయులకు 15:40 – మరియు ఆకాశ వస్తురూపములు కలవు, భూ వస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూ వస్తురూపముల మహిమ వేరు.

1కొరిందీయులకు 15:41 – నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదుగదా

1కొరిందీయులకు 15:42 – మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;

1కొరిందీయులకు 15:43 – ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

1కొరిందీయులకు 15:44 – ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరముకూడ ఉన్నది.

1కొరిందీయులకు 15:45 – ఇందువిషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడి యున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.

1కొరిందీయులకు 15:46 – ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మ సంబంధమైనది.

1కొరిందీయులకు 15:47 – మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.

1కొరిందీయులకు 15:48 – మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి యెట్టివాడో పరలోక సంబంధులును అట్టివారే.

1కొరిందీయులకు 15:49 – మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము.

Assumed and proved by our Lord

మత్తయి 22:29 – అందుకు యేసు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.

మత్తయి 22:30 – పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.

మత్తయి 22:31 – మృతుల పునరుత్థానమునుగూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?

మత్తయి 22:32 – ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.

లూకా 14:14 – నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

యోహాను 5:28 – దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

యోహాను 5:29 – మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

Preached by the Apostles

అపోస్తలులకార్యములు 4:2 – వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి

అపోస్తలులకార్యములు 17:18 – ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 24:15 – నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.

Credibility of, shown by the resurrection of individuals

మత్తయి 9:25 – జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.

మత్తయి 27:53 – వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.

లూకా 7:14 – ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా

యోహాను 11:44 – చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.

హెబ్రీయులకు 11:35 – స్త్రీలు మృతులైన తమవారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.

Certainty of, proved by the resurrection of Christ

1కొరిందీయులకు 15:12 – క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

1కొరిందీయులకు 15:13 – మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.

1కొరిందీయులకు 15:14 – మరియు క్రీస్తు లేపబడి యుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

1కొరిందీయులకు 15:15 – దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.

1కొరిందీయులకు 15:16 – మృతులు లేపబడనియెడల క్రీస్తుకూడ లేపబడలేదు.

1కొరిందీయులకు 15:17 – క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.

1కొరిందీయులకు 15:18 – అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.

1కొరిందీయులకు 15:19 – ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము.

1కొరిందీయులకు 15:20 – ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.

Effected by the power of

-God

మత్తయి 22:29 – అందుకు యేసు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.

-Christ

యోహాను 5:28 – దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

యోహాను 5:29 – మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

యోహాను 6:39 – నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.

యోహాను 6:40 – ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

యోహాను 6:44 – అందుకు యేసు మీలో మీరు సణుగుకొనకుడి;

-the holy spirit

రోమీయులకు 8:11 – మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.

Shall be of all the dead

యోహాను 5:28 – దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

అపోస్తలులకార్యములు 24:15 – నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.

ప్రకటన 20:13 – సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను.

Saints in, shall

-rise through Christ

యోహాను 11:25 – అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

అపోస్తలులకార్యములు 4:2 – వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి

1కొరిందీయులకు 15:21 – మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

1కొరిందీయులకు 15:22 – ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

-rise First

1కొరిందీయులకు 15:23 – ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.

1దెస్సలోనీకయులకు 4:16 – ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

-rise to Eternal life

దానియేలు 12:2 – మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

యోహాను 5:29 – మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

-be glorified with Christ

కొలొస్సయులకు 3:4 – మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

-be as the angels

మత్తయి 22:30 – పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.

-Have Incorruptible bodies

1కొరిందీయులకు 15:42 – మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;

-Have glorious bodies

1కొరిందీయులకు 15:43 – ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

-Have Powerful bodies

1కొరిందీయులకు 15:43 – ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

-Have spiritual bodies

1కొరిందీయులకు 15:44 – ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరముకూడ ఉన్నది.

– Have bodies like Christ’s

ఫిలిప్పీయులకు 3:21 – సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.

1యోహాను 3:2 – ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

-be recompensed

లూకా 14:14 – నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

Saints should look forward to

దానియేలు 12:13 – నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.

ఫిలిప్పీయులకు 3:11 – ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

Of saints shall be followed by the change of those then alive

1కొరిందీయులకు 15:51 – ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.

1దెస్సలోనీకయులకు 4:17 – ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

The preaching of, caused

-Mocking

అపోస్తలులకార్యములు 17:32 – మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి; మరికొందరు దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.

-Persecution

అపోస్తలులకార్యములు 23:6 – అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.

అపోస్తలులకార్యములు 24:11 – యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొనవచ్చును.

అపోస్తలులకార్యములు 24:12 – దేవాలయములో నేమి, సమాజమందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.

అపోస్తలులకార్యములు 24:13 – మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.

అపోస్తలులకార్యములు 24:14 – ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,

అపోస్తలులకార్యములు 24:15 – నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.

Blessedness of those who have part in the first

ప్రకటన 20:6 – ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారము లేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

Of the wicked, shall be to

-shame and Everlasting Contempt

దానియేలు 12:2 – మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

-damnation

యోహాను 5:29 – మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

Illustrative of the new birth

యోహాను 5:25 – మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

Illustrated

యెహెజ్కేలు 37:1 – యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా

యెహెజ్కేలు 37:2 – యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.

యెహెజ్కేలు 37:3 – ఆయన నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుకగలవా? అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.

యెహెజ్కేలు 37:4 – అందుకాయన ప్రవచనమెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండిపోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి.

యెహెజ్కేలు 37:5 – ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;

యెహెజ్కేలు 37:6 – చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీమీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 37:7 – ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను.

యెహెజ్కేలు 37:8 – నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను.

యెహెజ్కేలు 37:9 – అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.

యెహెజ్కేలు 37:10 – ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.