Display Topic


God gives reproof to his own children

2సమూయేలు 7:14 – నేనతనికి తండ్రినైయుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపము చేసినయెడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని

యోబు 5:17 – దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

కీర్తనలు 94:12 – యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమునుబట్టి నీవు బోధించువాడు ధన్యుడు.

కీర్తనలు 119:67 – శ్రమ కలుగకమునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.

కీర్తనలు 119:71 – నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.

కీర్తనలు 119:75 – యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.

హెబ్రీయులకు 12:6 – ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.

హెబ్రీయులకు 12:7 – శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?

God gives, to the wicked

కీర్తనలు 50:21 – ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను

యెషయా 51:20 – యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.

Christ sent to give

యెషయా 2:4 – ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

యెషయా 11:3 – యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

The Holy Spirit gives

యోహాను 16:7 – అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును

యోహాను 16:8 – ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.

Christ gives, in love

ప్రకటన 3:19 – నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.

On account of

-Impenitence

మత్తయి 11:20 – పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను.

మత్తయి 11:21 – అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు

మత్తయి 11:22 – విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.

మత్తయి 11:23 – కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును.

మత్తయి 11:24 – విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

-Not understanding

మత్తయి 16:9 – మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను

మత్తయి 16:11 – నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను.

మార్కు 7:18 – ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?

లూకా 24:25 – అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

యోహాను 8:43 – మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననేగదా?

యోహాను 13:7 – అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా

యోహాను 13:8 – పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.

-Hardness of heart

మార్కు 8:17 – యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా?

మార్కు 16:14 – పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.

-Fearfulness

మార్కు 4:40 – అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను.

లూకా 24:37 – అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

లూకా 24:38 – అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?

-Unbelief

మత్తయి 17:17 – అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.

మత్తయి 17:20 – అందుకాయన మీ అల్పవిశ్వాసముచేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;

మార్కు 16:14 – పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.

-vain boasting

లూకా 22:34 – ఆయన పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పువరకు, నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాననెను.

-Hypocrisy

మత్తయి 15:7 – వేషధారులారా

మత్తయి 23:13 – అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

-Reviling Christ

లూకా 23:40 – అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?

-Unruly conduct

1దెస్సలోనీకయులకు 5:14 – సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి.

-Oppressing out brethren

నెహెమ్యా 5:7 – అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

-Sinful practices

మత్తయి 21:13 – నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.

లూకా 3:19 – అయితే చతుర్థాధిపతియైన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు

యోహాను 2:16 – పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.

The Scriptures are profitable for

కీర్తనలు 19:7 – యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

కీర్తనలు 19:8 – యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.

కీర్తనలు 19:9 – యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.

కీర్తనలు 19:10 – అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనవి.

కీర్తనలు 19:11 – వాటివలన నీ సేవకుడు హెచ్చరికనొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.

2తిమోతి 3:16 – దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును,

When from God

-is for correction

కీర్తనలు 39:11 – దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మటకొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)

-is Despised by the Wicked

సామెతలు 1:30 – నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

-Should Not discourage Saints

హెబ్రీయులకు 12:5 – మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

-Pray That it be Not be in Anger

కీర్తనలు 6:1 – యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.

-Should be Accompanied by exhortation to repentance

1సమూయేలు 12:20 – అంతట సమూయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి, మీరు ఈ కీడు చేసినమాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.

1సమూయేలు 12:21 – ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే.

1సమూయేలు 12:22 – యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.

1సమూయేలు 12:23 – నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగును గాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

1సమూయేలు 12:24 – ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.

1సమూయేలు 12:25 – మీరు కీడుచేయు వారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు.

Declared to be

-Better than secret love

సామెతలు 27:5 – లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు

-Better than the praise of fools

ప్రసంగి 7:5 – బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు.

-An Excellent oil

కీర్తనలు 141:5 – నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.

-more profitable to Saints, than stripes to A fool

సామెతలు 17:10 – బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.

A proof of faithful friendship

సామెతలు 27:6 – మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.

Leads to

-understanding

సామెతలు 15:32 – శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును.

-knowledge

సామెతలు 19:25 – అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.

-Wisdom

సామెతలు 15:31 – జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.

సామెతలు 29:15 – బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.

-Honour

సామెతలు 13:18 – శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

-happiness

సామెతలు 6:23 – ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

Eventually brings more respect than flattery

సామెతలు 28:23 – నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.

Of those who offend, a warning to others

లేవీయకాండము 19:17 – నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీమీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.

అపోస్తలులకార్యములు 5:3 – అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?

అపోస్తలులకార్యములు 5:4 – అది నీయొద్ద నున్నపుడు నీదేగదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను

అపోస్తలులకార్యములు 5:9 – అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొనిపోవుదురని ఆమెతో చెప్పెను

1తిమోతి 5:20 – ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.

తీతుకు 1:10 – అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.

తీతుకు 1:13 – ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యమునుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,

Hypocrites not qualified to give

మత్తయి 7:5 – వేషధారీ, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

Ministers are sent to give

యిర్మియా 44:4 – మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచు వచ్చితిని గాని

యెహెజ్కేలు 3:17 – నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.

Ministers are empowered to give

మీకా 3:8 – నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనై యున్నాను.

Ministers should give

-Openly

1తిమోతి 5:20 – ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.

-Fearlessly

యెహెజ్కేలు 2:3 – ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నామీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయులయొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు.

యెహెజ్కేలు 2:4 – వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారియొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు

యెహెజ్కేలు 2:5 – గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను.

యెహెజ్కేలు 2:6 – నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు;

యెహెజ్కేలు 2:7 – అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము.

-with all authority

తీతుకు 2:15 – వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింప నీయకుము.

– With longsuffering &c

2తిమోతి 4:2 – వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.

-Unreservedly

యెషయా 58:1 – తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము

-Sharply, If Necessary

తీతుకు 1:13 – ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యమునుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,

-with Christian love

2దెస్సలోనీకయులకు 3:15 – అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి.

They who give, are hated by scorners

సామెతలు 9:8 – అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.

సామెతలు 15:12 – అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.

Hatred of, a proof of brutishness

సామెతలు 12:1 – శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు

Hatred of, leads to destruction

సామెతలు 15:10 – మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.

సామెతలు 29:1 – ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

Contempt of, leads to remorse

సామెతలు 5:12 – అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?

Rejection of, leads to error

సామెతలు 10:17 – ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.

Saints should

-give

లేవీయకాండము 19:17 – నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీమీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.

ఎఫెసీయులకు 5:11 – నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి.

-give No occasion for

ఫిలిప్పీయులకు 2:15 – సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

-receive Kindly

కీర్తనలు 141:5 – నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.

-love Those who give

సామెతలు 9:8 – అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.

-Delight in Those who give

సామెతలు 24:25 – న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

Attention to a proof of prudence

సామెతలు 15:5 – మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.

Exemplified

-Samuel

1సమూయేలు 13:13 – అందుకు సమూయేలు ఇట్లనెను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను; అయితే నీ రాజ్యము నిలువదు.

-Nathan

2సమూయేలు 12:7 – నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలుచేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి

2సమూయేలు 12:8 – నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.

2సమూయేలు 12:9 – నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొనియున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

-Ahijah

1రాజులు 14:7 – నీవు వెళ్లి యరొబాముతో చెప్పవలసినదేమనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలోనుండి తీసి హెచ్చింపజేసి, ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా నియమించి

1రాజులు 14:8 – దావీదు సంతతివారి యొద్దనుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక

1రాజులు 14:9 – నీకంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడు చేసియున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు.

1రాజులు 14:10 – కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులుగాని ఘనులుగాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి, పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.

1రాజులు 14:11 – పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చియున్నాడు.

-Elijah

1రాజులు 21:20 – అంతట అహాబు ఏలీయాను చూచి నా పగవాడా, నీచేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను యెహోవా దృష్టికి కీడుచేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నాచేతిలో నీవు చిక్కితివి.

-Elisha

2రాజులు 5:26 – అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?

-Joab

1దినవృత్తాంతములు 21:3 – అందుకు యోవాబు రాజా నా యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక; వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను.

-Shemaiah

2దినవృత్తాంతములు 12:5 – ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతులయొద్దకును వచ్చి మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకుచేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

-Hanani

2దినవృత్తాంతములు 16:7 – ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశమునుండి తప్పించుకొనిపోయెను.

-Zechariah

2దినవృత్తాంతములు 24:20 – అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.

-Daniel

దానియేలు 5:22 – బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి యంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.

దానియేలు 5:23 – ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైననుచేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.

-John the Baptist

మత్తయి 3:7 – అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలము ఫలించుడి

లూకా 3:19 – అయితే చతుర్థాధిపతియైన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు

-Stephen

అపోస్తలులకార్యములు 7:51 – ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

-Peter

అపోస్తలులకార్యములు 8:20 – అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.

-Paul

1కొరిందీయులకు 1:10 – సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

1కొరిందీయులకు 1:11 – నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను.

1కొరిందీయులకు 1:12 – మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

1కొరిందీయులకు 1:13 – క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

1కొరిందీయులకు 5:1 – మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.

1కొరిందీయులకు 5:2 – ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసినవానిని మీలోనుండి వెలివేసినవారు కారు.

1కొరిందీయులకు 5:3 – నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండినట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.

1కొరిందీయులకు 5:4 – ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును,

1కొరిందీయులకు 5:5 – నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.

1కొరిందీయులకు 6:1 – మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?

1కొరిందీయులకు 6:2 – పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?

1కొరిందీయులకు 6:3 – మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?

1కొరిందీయులకు 6:4 – కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?

1కొరిందీయులకు 6:5 – మీకు సిగ్గు రావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?

1కొరిందీయులకు 6:6 – అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడుచున్నాడు.

1కొరిందీయులకు 6:7 – ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?

1కొరిందీయులకు 6:8 – అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు.

1కొరిందీయులకు 11:17 – మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడివచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు.

1కొరిందీయులకు 11:18 – మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.

1కొరిందీయులకు 11:19 – మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు.

1కొరిందీయులకు 11:20 – మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు.

1కొరిందీయులకు 11:21 – ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును.

1కొరిందీయులకు 11:22 – ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లులేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను.

గలతీయులకు 2:11 – అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;