Defined
1కొరిందీయులకు 6:20 – విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
1కొరిందీయులకు 7:23 – మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.
Is of God
యెషయా 44:21 – యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.
యెషయా 44:22 – మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.
యెషయా 44:23 – యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
యెషయా 43:1 – అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.
లూకా 1:68 – ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక
Is by Christ
మత్తయి 20:28 – ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
గలతీయులకు 3:13 – ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;
Is by the blood of Christ
అపోస్తలులకార్యములు 20:28 – దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
హెబ్రీయులకు 9:12 – మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
1పేతురు 1:19 – అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
ప్రకటన 5:9 – ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని,
Christ sent to effect
గలతీయులకు 4:4 – అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
గలతీయులకు 4:5 – మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
Christ is made, to us
1కొరిందీయులకు 1:30 – అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు.
Is from
-the bondage of the law
గలతీయులకు 4:5 – మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
-the Curse of the law
గలతీయులకు 3:13 – ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;
-the Power of Sin
రోమీయులకు 6:18 – పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.
రోమీయులకు 6:22 – అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
-the Power of the grave
కీర్తనలు 49:15 – దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును.(సెలా.)
-all troubles
కీర్తనలు 25:22 – దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.
-all iniquity
కీర్తనలు 130:8 – ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.
తీతుకు 2:14 – ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
-all evil
ఆదికాండము 48:16 – అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించును గాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను
-the present evil world
గలతీయులకు 1:4 – మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
-vain conversation
1పేతురు 1:18 – పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదు గాని
-Enemies
కీర్తనలు 106:10 – వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.
కీర్తనలు 106:11 – నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
యిర్మియా 15:21 – దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను.
-death
హోషేయ 13:14 – అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.
-Destruction
కీర్తనలు 103:4 – సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు
Man cannot effect
కీర్తనలు 49:7 – ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు
Corruptible things cannot purchase
1పేతురు 1:18 – పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదు గాని
Procures for us
-Justification
రోమీయులకు 3:24 – కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
-forgiveness of Sin
ఎఫెసీయులకు 1:7 – దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
కొలొస్సయులకు 1:14 – ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
-adoption
గలతీయులకు 4:4 – అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
గలతీయులకు 4:5 – మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
-purification
తీతుకు 2:14 – ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
The present life, the only season for
యోబు 36:18 – నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
యోబు 36:19 – నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధనొందకుండ నిన్ను తప్పించునా?
Described as
-Precious
కీర్తనలు 49:8 – వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
-Plenteous
కీర్తనలు 130:7 – ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశపెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
-Eternal
హెబ్రీయులకు 9:12 – మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
Subjects of
-the soul
కీర్తనలు 49:8 – వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
-the body
రోమీయులకు 8:23 – అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలములనొందిన మనముకూడ దత్తపుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
-the life
కీర్తనలు 103:4 – సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు
విలాపవాక్యములు 3:58 – ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెములను వాదించితివి నా జీవమును విమోచించితివి.
-the inheritance
ఎఫెసీయులకు 1:14 – దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
Manifests the
-Power of God
యెషయా 50:2 – నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా? విడిపించుటకు నాకు శక్తిలేదా? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.
-grace of God
యెషయా 52:3 – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.
-love and pity of God
యెషయా 63:9 – వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
యోహాను 3:16 – దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
రోమీయులకు 6:8 – మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,
1యోహాను 4:10 – మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
A subject for praise
యెషయా 44:22 – మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.
యెషయా 44:23 – యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
యెషయా 51:11 – యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగివచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.
Old Testament saints partakers of
హెబ్రీయులకు 9:15 – ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందునిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు.
They who partake of
-Are the property of God
యెషయా 43:1 – అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.
1కొరిందీయులకు 6:20 – విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
-Are First-fruits to God
ప్రకటన 14:4 – వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.
-Are A peculiar people
2సమూయేలు 7:23 – నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.
తీతుకు 2:14 – ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
1పేతురు 2:9 – అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ద జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు
-Are assured of
యోబు 19:25 – అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
కీర్తనలు 31:5 – నా ఆత్మను నీచేతి కప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
-Are sealed to the day of
ఎఫెసీయులకు 4:30 – దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
-Are zealous of good works
ఎఫెసీయులకు 2:10 – మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియై యున్నాము.
తీతుకు 2:14 – ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
1పేతురు 2:9 – అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ద జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు
-Walk safely in holiness
యెషయా 35:8 – అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు
యెషయా 35:9 – అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు
-Shall return to Zion with Joy
యెషయా 35:10 – వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.
-Alone can learn the songs of heaven
ప్రకటన 14:3 – వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
ప్రకటన 14:4 – వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.
-commit Themselves to God
కీర్తనలు 31:5 – నా ఆత్మను నీచేతి కప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
-Have An earnest of the completion of
ఎఫెసీయులకు 1:14 – దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
2కొరిందీయులకు 1:22 – ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.
-wait for the completion of
రోమీయులకు 8:23 – అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలములనొందిన మనముకూడ దత్తపుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
ఫిలిప్పీయులకు 3:20 – మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
ఫిలిప్పీయులకు 3:21 – సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.
తీతుకు 2:11 – ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై
తీతుకు 2:12 – మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,
తీతుకు 2:13 – అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది
-Pray for the completion of
కీర్తనలు 26:11 – నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము.
కీర్తనలు 44:26 – మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.
-praise God for
కీర్తనలు 71:23 – నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
కీర్తనలు 103:4 – సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు
ప్రకటన 5:9 – ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని,
-Should glorify God for
1కొరిందీయులకు 6:20 – విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
-Should be without fear
యెషయా 43:1 – అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.
Typified
-Israel
నిర్గమకాండము 6:6 – కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,
-First-born
నిర్గమకాండము 13:11 – యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత
నిర్గమకాండము 13:12 – ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును.
నిర్గమకాండము 13:13 – ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను.
నిర్గమకాండము 13:14 – ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.
నిర్గమకాండము 13:15 – ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.
సంఖ్యాకాండము 18:15 – మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.
-atonement-money
నిర్గమకాండము 30:12 – వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
నిర్గమకాండము 30:13 – వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.
నిర్గమకాండము 30:14 – ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.
నిర్గమకాండము 30:15 – అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.
-Bond-servant
లేవీయకాండము 25:47 – పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపాదనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనినయెడల
లేవీయకాండము 25:48 – తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును.
లేవీయకాండము 25:49 – వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికినయెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.
లేవీయకాండము 25:50 – అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.
లేవీయకాండము 25:51 – ఇంక అనేక సంవత్సరములు మిగిలియుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను.
లేవీయకాండము 25:52 – సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైనయెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను.
లేవీయకాండము 25:53 – ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.
లేవీయకాండము 25:54 – అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.