Display Topic
Exhibited in the manifestation of God’s grace
ఎఫెసీయులకు 1:8 – కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
Exemplified by Christ
యెషయా 52:13 – ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.
మత్తయి 21:24 – యేసు నేనును మిమ్మునొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
మత్తయి 21:25 – యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు మనము పరలోకమునుండి అని చెప్పితిమా, ఆయన ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును;
మత్తయి 21:26 – మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి
మత్తయి 21:27 – అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.
మత్తయి 22:15 – అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు
మత్తయి 22:16 – బోధకుడా, నీవు సత్యవంతుడవైయుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.
మత్తయి 22:17 – నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి.
మత్తయి 22:18 – యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు?
మత్తయి 22:19 – పన్ను రూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి.
మత్తయి 22:20 – అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు కైసరువనిరి.
మత్తయి 22:21 – అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
Intimately connected with wisdom
సామెతలు 8:12 – జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.
The wise celebrated for
సామెతలు 16:21 – జ్ఞాన హృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్య యెక్కువగును.
They who have
-Get knowledge
సామెతలు 18:15 – జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.
-Deal with knowledge
సామెతలు 13:16 – వివేకులందరు తెలివిగలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.
-look Well to their goings
సామెతలు 14:15 – జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.
-Understand the ways of God
హోషేయ 14:9 – జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.
-Understand their own ways
సామెతలు 14:8 – తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.
-Crowned with knowledge
సామెతలు 14:18 – జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.
-Not Ostentatious of knowledge
సామెతలు 12:23 – వివేకియైనవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
-Foresee and Avoid evil
సామెతలు 22:3 – బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
-Are Preserved by it
సామెతలు 2:11 – బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
-Suppress Angry feelings
సామెతలు 12:16 – మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
సామెతలు 19:11 – ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
-regard reproof
సామెతలు 15:5 – మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
-keep silence in the evil Time
ఆమోసు 5:13 – ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.
Saints act with
కీర్తనలు 112:5 – దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
Saints should especially exercise, in their intercourse with unbelievers
మత్తయి 10:16 – ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
ఎఫెసీయులకు 5:15 – దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
కొలొస్సయులకు 4:5 – సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.
Virtuous wives act with
సామెతలు 31:16 – ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.
సామెతలు 31:26 – జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.
The young should cultivate
సామెతలు 3:21 – నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
Of the wicked
-Fails in times of perplexity
యిర్మియా 49:7 – సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?
-keeps them from the knowledge of the gospel
మత్తయి 11:25 – ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
-Denounced by God
యెషయా 5:21 – తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొనువారికి శ్రమ.
యెషయా 29:15 – తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.
-defeated by God
యెషయా 29:14 – కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.
1కొరిందీయులకు 1:19 – ఇందువిషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
Necessity for-Illustrated.
మత్తయి 25:3 – బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.
మత్తయి 25:9 – అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
లూకా 14:28 – మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తనయొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?
లూకా 14:29 – చూచుకొననియెడల అతడు దాని పునాది వేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున
లూకా 14:30 – చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయసాగుదురు.
లూకా 14:31 – మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?
లూకా 14:32 – శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.
Exemplified
-Jacob
ఆదికాండము 32:3 – యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి
ఆదికాండము 32:4 – మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;
ఆదికాండము 32:5 – నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.
ఆదికాండము 32:6 – ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగివచ్చి మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్లితివిు; అతడు నాలుగువందల మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా
ఆదికాండము 32:7 – యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి
ఆదికాండము 32:8 – ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను
ఆదికాండము 32:9 – అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,
ఆదికాండము 32:10 – నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నాచేతికఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.
ఆదికాండము 32:11 – నా సహోదరుడైన ఏశావుచేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
ఆదికాండము 32:12 – నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.
ఆదికాండము 32:13 – అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను
ఆదికాండము 32:14 – అనగా రెండువందల మేకలను ఇరువది మేకపోతులను రెండువందల గొఱ్ఱలను ఇరువది పొట్టేళ్లను
ఆదికాండము 32:15 – ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా
ఆదికాండము 32:16 – తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.
ఆదికాండము 32:17 – మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల
ఆదికాండము 32:18 – నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.
ఆదికాండము 32:19 – అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు
ఆదికాండము 32:20 – మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.
ఆదికాండము 32:21 – అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.
ఆదికాండము 32:22 – ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.
ఆదికాండము 32:23 – యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను.
-Joseph
ఆదికాండము 41:39 – మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములు గలవారెవరును లేరు.
-Jethro
నిర్గమకాండము 18:19 – కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.
నిర్గమకాండము 18:20 – నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.
నిర్గమకాండము 18:21 – మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను.
నిర్గమకాండము 18:22 – వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును.
నిర్గమకాండము 18:23 – దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.
-Gideon
న్యాయాధిపతులు 8:1 – అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మాయెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.
న్యాయాధిపతులు 8:2 – అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.
న్యాయాధిపతులు 8:3 – అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.
-David
1సమూయేలు 16:18 – చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా
-Abigail
1సమూయేలు 25:23 – అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
1సమూయేలు 25:24 – నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము;
1సమూయేలు 25:25 – నా యేలినవాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.
1సమూయేలు 25:26 – నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయ నుద్దేశించువారును నాబాలువలె ఉందురు గాక.
1సమూయేలు 25:27 – అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి
1సమూయేలు 25:28 – నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును.
1సమూయేలు 25:29 – నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.
1సమూయేలు 25:30 – యెహోవా నా యేలినవాడవగు నిన్నుగూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత
1సమూయేలు 25:31 – నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చు కొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.
2సమూయేలు 15:32 – దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.
2సమూయేలు 15:33 – రాజు నీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;
2సమూయేలు 15:34 – నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టగలవు.
2సమూయేలు 17:6 – అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాటచొప్పున మనము చేయుదమా చేయకుందుమా? నీ యాలోచన యేమైనది చెప్పుమని అతని నడుగగా
2సమూయేలు 17:7 – హూషై అబ్షాలోముతో ఇట్లనెను. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిదికాదు.
2సమూయేలు 17:8 – నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడ బసచేయడు.
2సమూయేలు 17:9 – అతడేదో యొక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు.
2సమూయేలు 17:10 – నీ తండ్రి మహా బలాఢ్యుడనియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు గనుక సింహపుగుండెవంటి గుండెగలవారు సయితము దిగులొందుదురు.
2సమూయేలు 17:11 – కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులనందరిని నలుదిశలనుండి నీయొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.
2సమూయేలు 17:12 – అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో ఒకడును తప్పించుకొనజాలడు.
2సమూయేలు 17:13 – అతడు ఒక పట్టణములో చొచ్చినయెడల ఇశ్రాయేలీయులందరును ఆ పట్టణమునకు త్రాళ్లు తీసికొనివచ్చి యొక చిన్న రాయి అచ్చట కనబడకుండ దానిని నదిలోనికి లాగుదురు.
2సమూయేలు 17:14 – అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పుకొనిరి; ఏలయనగా యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించియుండెను.
-aged counsellors of Rehoboam
1రాజులు 12:7 – వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.
-Solomon
2దినవృత్తాంతములు 2:12 – యెహోవా ఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతినొందునుగాక.
-Nehemiah
నెహెమ్యా 2:12 – రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు.
నెహెమ్యా 2:13 – నేను రాత్రికాలమందు లోయద్వారము గుండ భుజంగపు బావి యెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.
నెహెమ్యా 2:14 – తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.
నెహెమ్యా 2:15 – నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.
నెహెమ్యా 2:16 – అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైనవారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు.
నెహెమ్యా 4:13 – అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని.
నెహెమ్యా 4:14 – అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.
నెహెమ్యా 4:15 – వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను.
నెహెమ్యా 4:16 – అయితే అప్పటినుండి నా పని వారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆ యా యింటివారి వెనుక నిలిచిరి.
నెహెమ్యా 4:17 – గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒకచేతితో పనిచేసి ఒకచేతితో ఆయుధము పట్టుకొనియుండిరి.
నెహెమ్యా 4:18 – మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.
-the Poor wise Man
ప్రసంగి 9:15 – అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.
-the Scribe
మార్కు 12:32 – ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
మార్కు 12:33 – పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగహోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.
మార్కు 12:34 – అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
-Gamaliel
అపోస్తలులకార్యములు 5:34 – సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను
అపోస్తలులకార్యములు 5:35 – ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి.
అపోస్తలులకార్యములు 5:36 – ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసికొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.
అపోస్తలులకార్యములు 5:37 – వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరిపోయిరి.
అపోస్తలులకార్యములు 5:38 – కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యులజోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.
అపోస్తలులకార్యములు 5:39 – దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.
-Sergius Paulus
అపోస్తలులకార్యములు 13:7 – ఇతడు వివేకము గలవాడైన సెర్గిపౌలు అను అధిపతియొద్ద నుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
-Paul
అపోస్తలులకార్యములు 23:6 – అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.