Display Topic


A characteristic of the wicked

2పేతురు 2:10 – శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.

A characteristic of Antichrist

2దెస్సలోనీకయులకు 2:4 – ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.

Exhibited in

-Opposing God

యోబు 15:25 – వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.

యోబు 15:26 – మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.

-Wilful commission of Sin

రోమీయులకు 1:32 – ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

-self-righteousness

హోషేయ 12:8 – నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనినిబట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.

ప్రకటన 3:17 – నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.

-spiritual Pride

యెషయా 65:5 – వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.

లూకా 18:11 – పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలె నైనను, ఈ సుంకరివలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

-Esteeming Our own ways right

సామెతలు 12:15 – మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు ఆలోచన నంగీకరించును.

-Seeking Precedence

లూకా 14:7 – పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

లూకా 14:8 – నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా

లూకా 14:9 – నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.

లూకా 14:10 – అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటిచోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండు వారందరియెదుట నీకు ఘనత కలుగును

లూకా 14:11 – తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

-Planning for the future

లూకా 12:18 – నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని

యాకోబు 4:13 – నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,

-pretending to prophecy

ద్వితియోపదేశాకాండము 18:22 – ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయినయెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు.

Pray to be kept from sins of

కీర్తనలు 19:13 – దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండ నిందారహితుడనగుదును.

Saints avoid

కీర్తనలు 131:1 – యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసికొనుటలేదు.

Punishment for

సంఖ్యాకాండము 15:30 – అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల

ప్రకటన 18:7 – అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి

ప్రకటన 18:8 – అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడెను

Exemplified

-Builders of Babel

ఆదికాండము 11:4 – మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

-Israelites

సంఖ్యాకాండము 14:44 – అయితే వారు మూర్ఖించి ఆ కొండకొనకెక్కి పోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలువెళ్లలేదు.

– Korah &c

సంఖ్యాకాండము 16:3 – మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారిమధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,

సంఖ్యాకాండము 16:7 – అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.

-Men of Bethshemesh

1సమూయేలు 6:19 – బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి.

-Uzzah

2సమూయేలు 6:6 – వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయిచాపి దేవుని మందసమును పట్టుకొనగా

-Jeroboam

1రాజులు 13:4 – బేతేలునందున్న బలిపీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండిపోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తి లేకపోయెను.

-Benhadad

1రాజులు 20:19 – రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి

-Uzziah

2దినవృత్తాంతములు 26:16 – అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా

-Sennacherib

2దినవృత్తాంతములు 32:13 – నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నాచేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?

2దినవృత్తాంతములు 32:14 – మీ దేవుడు మిమ్మును నాచేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నాచేతిలోనుండి విడిపింప గలిగిన దేవుడొకడైన యుండెనా?

-Theudas

అపోస్తలులకార్యములు 5:36 – ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసికొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.

-Sons of Sceva

అపోస్తలులకార్యములు 19:13 – అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి

అపోస్తలులకార్యములు 19:14 – యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.

-Diotrephes

3యోహాను 1:9 – నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.