Display Topic

Antiquity of

ఆదికాండము 32:13 – అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను

ఆదికాండము 43:15 – ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని,చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.

Were given

-to Judges to Secure A favourable hearing

సామెతలు 17:23 – న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.

ఆమోసు 2:6 – యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మివేయుదురు.

-to Kings to engage their aid

1రాజులు 15:18 – కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్పగించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా

-by Kings to each other in token of inferiority

1రాజులు 10:25 – ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.

2దినవృత్తాంతములు 9:23 – దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.

2దినవృత్తాంతములు 9:24 – మరియు ప్రతివాడును ఏటేట వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను.

కీర్తనలు 72:10 – తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబ రాజులును సెబా రాజులును కానుకలు తీసికొనివచ్చెదరు.

-to appease the Angry feelings of others

ఆదికాండము 32:20 – మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.

1సమూయేలు 25:27 – అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

1సమూయేలు 25:28 – నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును.

1సమూయేలు 25:35 – తనయొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసికొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను.

-to confirm covenants

ఆదికాండము 21:28 – తరువాత అబ్రాహాము తన గొఱ్ఱల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగానుంచెను గనుక

ఆదికాండము 21:29 – అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు

ఆదికాండము 21:30 – నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱ పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.

-to reward service

2సమూయేలు 18:12 – అందుకు వాడు యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండ జాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యి తులముల వెండి నాచేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.

దానియేలు 2:6 – కలను దాని భావమును తెలియజేసినయెడల దానములును బహుమానములును మహా ఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు

దానియేలు 2:48 – అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబులోను సంస్థానమంతటిమీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను.

-to Show respect

న్యాయాధిపతులు 6:18 – నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయననీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను.

-in token of friendship

1సమూయేలు 18:3 – దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసికొనెను.

1సమూయేలు 18:4 – మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.

-as tribute

న్యాయాధిపతులు 3:15 – ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా

2సమూయేలు 8:2 – మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

2దినవృత్తాంతములు 17:5 – కాబట్టి యెహోవా అతనిచేత రాజ్యమును స్థిరపరచెను, యూదావారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను.

-on occasions of visits

2రాజులు 8:8 – హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవా యొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చి పంపెను.

-on all occasions of public rejoicing

నెహెమ్యా 8:12 – ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.

ఎస్తేరు 9:19 – కాబట్టి ప్రాకారములు లేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.

-at marriages

ఆదికాండము 24:53 – తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.

కీర్తనలు 45:12 – తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

-on recovering from sickness

2రాజులు 20:12 – ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను హిజ్కియా రోగియైయుండిన సంగతి విని, పత్రికలను కానుకను అతనియొద్దకు పంపగా

-on Restoration to Prosperity

యోబు 42:10 – మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

యోబు 42:11 – అప్పుడు అతని సహోదరులందరును అతని అక్కచెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్త బాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.

-on Sending away friends

ఆదికాండము 45:22 – అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

యిర్మియా 40:5 – ఇంకను అతడు తిరిగివెళ్లక తడవుచేయగా రాజదేహసంరక్షకుల కధిపతి అతనితో ఈలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణములమీద నియమించియున్నాడు, అతనియొద్దకు వెళ్లుము; అతనియొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా

Considered essential on all visits of business

1సమూయేలు 9:7 – అందుకు సౌలు మనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవుదుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరిపోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసికొనిపోవుటకు మనకేమియు లేదు అని తన పనివానితో చెప్పి మనయొద్ద ఏమి యున్నదని అడుగగా

Not bringing, considered a mark of disrespect and disaffection

యెషయా 10:27 – ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.

2రాజులు 17:24 – అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులను రప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వంతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి.

Generally procured a favourable reception

సామెతలు 18:16 – ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును

సామెతలు 19:6 – అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.

When small or defective, refused

మలాకీ 1:8 – గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించినయెడల అది దోషము కాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

Of persons of rank, of great value and variety

2రాజులు 5:2 – సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయియుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.

2దినవృత్తాంతములు 9:1 – షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.

Receiving of, a token of good will

ఆదికాండము 33:10 – అప్పుడు యాకోబు అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా

ఆదికాండము 33:11 – నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని

Things given as

-cattle

ఆదికాండము 32:14 – అనగా రెండువందల మేకలను ఇరువది మేకపోతులను రెండువందల గొఱ్ఱలను ఇరువది పొట్టేళ్లను

ఆదికాండము 32:15 – ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా

ఆదికాండము 32:18 – నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.

-Horses and mules

1రాజులు 10:25 – ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.

-money

ఆదికాండము 45:22 – అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

1సమూయేలు 9:8 – వాడు సౌలుతో చిత్తగించుము, నాయొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.

యోబు 42:11 – అప్పుడు అతని సహోదరులందరును అతని అక్కచెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్త బాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.

-Food

ఆదికాండము 43:11 – వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీరీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొనిపోవుడి.

1సమూయేలు 25:18 – అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్దభములమీద వేయించి

1రాజులు 14:3 – కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డ యేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా

-garments

ఆదికాండము 45:22 – అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

1సమూయేలు 18:4 – మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.

-weapons of war

1సమూయేలు 18:4 – మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.

-ornaments

ఆదికాండము 24:22 – ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమెచేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి

ఆదికాండము 24:47 – అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేనామె ముక్కుకు కమ్మియును ఆమెచేతులకు కడియములను పెట్టి

యోబు 42:11 – అప్పుడు అతని సహోదరులందరును అతని అక్కచెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్త బాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.

-gold and Silver vessels

1రాజులు 10:25 – ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.

-Precious stones

1రాజులు 10:2 – ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదాని నంతటినిబట్టి అతనితో మాటలాడగా

-servants

ఆదికాండము 20:14 – అబీమెలెకు గొఱ్ఱలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.

ఆదికాండము 29:24 – మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.

ఆదికాండము 29:29 – మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.

Often borne by servants

న్యాయాధిపతులు 3:18 – ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి

Often conveyed on camels

1సమూయేలు 25:18 – అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్దభములమీద వేయించి

2రాజులు 8:9 – కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను.

2దినవృత్తాంతములు 9:1 – షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.

Sometimes sent before the giver

ఆదికాండము 32:21 – అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.

Generally presented in person

ఆదికాండము 43:15 – ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని,చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.

ఆదికాండము 43:26 – యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమచేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.

న్యాయాధిపతులు 3:17 – దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లో నుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.

1సమూయేలు 25:27 – అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

Laid out and presented with great ceremony

ఆదికాండము 43:25 – అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.

న్యాయాధిపతులు 3:18 – ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి

మత్తయి 2:11 – తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.