Display Topic


Is one of his attributes

కీర్తనలు 62:11 – బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

Expressed by the

-voice of God

కీర్తనలు 29:3 – యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.

కీర్తనలు 29:5 – యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.

కీర్తనలు 68:33 – అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము.

-Finger of God

నిర్గమకాండము 8:19 – శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.

కీర్తనలు 8:3 – నీచేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా

-Hand of God

నిర్గమకాండము 9:3 – ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.

నిర్గమకాండము 9:15 – భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.

యెషయా 48:13 – నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.

-Arm of God

యోబు 40:9 – దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింపగలవా?

యెషయా 52:10 – సమస్త జనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.

-Thunder of His Power

యోబు 26:14 – ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?

Described as

-great

కీర్తనలు 79:11 – చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము.

నహూము 1:3 – యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

-Strong

కీర్తనలు 89:13 – పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.

కీర్తనలు 136:12 – చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును.

-glorious

నిర్గమకాండము 15:6 – యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టును.

యెషయా 63:12 – తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?

-mighty

యోబు 9:4 – ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

కీర్తనలు 89:13 – పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.

-Everlasting

యెషయా 26:4 – యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

రోమీయులకు 1:20 – ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

-Sovereign

రోమీయులకు 9:21 – ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?

-Effectual

యెషయా 43:13 – ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నాచేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?

ఎఫెసీయులకు 3:7 – దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

-Irresistible

ద్వితియోపదేశాకాండము 32:39 – ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నాచేతిలోనుండి విడిపించువాడెవడును లేడు

దానియేలు 4:35 – భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు.

-Incomparable

నిర్గమకాండము 15:11 – యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు

నిర్గమకాండము 15:12 – నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను.

ద్వితియోపదేశాకాండము 3:24 – ఆకాశమందేగాని భూమియందేగాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు?

యోబు 40:9 – దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింపగలవా?

కీర్తనలు 89:8 – యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

-Unsearchable

యోబు 5:9 – ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను చేయువాడు.

యోబు 9:10 – ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.

-Incomprehensible

యోబు 26:14 – ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?

ప్రసంగి 3:11 – దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.

All things possible to

మత్తయి 19:26 – యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.

Nothing too hard for

ఆదికాండము 18:14 – యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీయొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

యిర్మియా 32:27 – నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?

Can save by many or by few

1సమూయేలు 14:6 – యోనాతాను ఈ సున్నతిలేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా

Is the source of all strength

1దినవృత్తాంతములు 29:12 – ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.

కీర్తనలు 68:35 – తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక.

Exhibited in

-creation

కీర్తనలు 102:25 – ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీచేతిపనులే.

యిర్మియా 10:12 – ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

-Establishing and governing all things

కీర్తనలు 65:6 – బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనె

కీర్తనలు 66:7 – ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనులమీద ఆయన తన దృష్టి యుంచియున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు.(సెలా.)

-the miracles of Christ

లూకా 11:20 – అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.

-the resurrection of Christ

2కొరిందీయులకు 13:4 – బలహీనతనుబట్టి ఆయన సిలువ వేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమైయున్నాము గాని, మీయెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవము గలవారము.

కొలొస్సయులకు 2:12 – మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.

-the resurrection of Saints

1కొరిందీయులకు 6:14 – దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.

-Making the gospel Effectual

రోమీయులకు 1:16 – సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.

1కొరిందీయులకు 1:18 – సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

1కొరిందీయులకు 1:24 – ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

-Delivering His people

కీర్తనలు 106:8 – అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.

-the Destruction of the Wicked

నిర్గమకాండము 9:16 – నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.

రోమీయులకు 9:22 – ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిననేమి?

Saints

-Long for exhibitions

కీర్తనలు 63:1 – దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును

కీర్తనలు 63:2 – నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

-Have confidence in

యిర్మియా 20:11 – అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.

-receive Increase of grace by

2కొరిందీయులకు 9:8 – మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

-Strengthened by

ఎఫెసీయులకు 6:10 – తుదకు ప్రభువు యొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.

కొలొస్సయులకు 1:11 – ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

-Upheld by

కీర్తనలు 37:17 – భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు

యెషయా 41:10 – నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

-supported in Affliction by

2కొరిందీయులకు 6:7 – సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,

2తిమోతి 1:8 – కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమునుగూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చి యైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.

-delivered by

నెహెమ్యా 1:10 – చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.

దానియేలు 3:17 – మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

-Exalted by

యోబు 36:22 – ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడెవడు?

-kept by, to salvation

1పేతురు 1:5 – కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

Exerted in behalf of saints

2దినవృత్తాంతములు 16:9 – తనయెడల యథార్థహృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతితప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.

Works in, and for saints

2కొరిందీయులకు 13:4 – బలహీనతనుబట్టి ఆయన సిలువ వేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమైయున్నాము గాని, మీయెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవము గలవారము.

ఎఫెసీయులకు 1:19 – మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

ఎఫెసీయులకు 3:20 – మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

The faith of saints stands in

1కొరిందీయులకు 2:5 – నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.

Should be

-Acknowledged

1దినవృత్తాంతములు 29:11 – యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొనియున్నావు.

యెషయా 33:13 – దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.

-Pleaded in prayer

కీర్తనలు 79:11 – చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము.

మత్తయి 6:13 – మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

-Feared

యిర్మియా 5:22 – సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.

మత్తయి 10:28 – మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

-magnified

కీర్తనలు 21:13 – యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము.

యూదా 1:25 – మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.

Efficiency of ministers is through

1కొరిందీయులకు 3:6 – నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే

1కొరిందీయులకు 3:7 – కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

1కొరిందీయులకు 3:8 – నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.

గలతీయులకు 2:8 – అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

ఎఫెసీయులకు 3:7 – దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

Is a ground of trust

యెషయా 26:4 – యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

రోమీయులకు 4:21 – దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

The wicked

-know Not

మత్తయి 22:29 – అందుకు యేసు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.

-Have against them

ఎజ్రా 8:22 – మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించువారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.

-Shall be destroyed by

లూకా 12:5 – ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.

The heavenly host magnify

ప్రకటన 4:11 – ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి

ప్రకటన 5:13 – అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని

ప్రకటన 11:17 – వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.