Display Topic
The supports of a building
న్యాయాధిపతులు 16:29 – ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకొని
Things raised up as memorials
ఆదికాండము 31:51 – మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.
Made of
-Marble
ఎస్తేరు 1:6 – అక్కడ ధవళ ధూమ్ర వర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను.
-wood
1రాజులు 10:12 – ఈ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.
-Iron
యిర్మియా 1:18 – యూదా రాజులయొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.
-Brass
1రాజులు 7:15 – ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోత పోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివి గలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.
-Silver
పరమగీతము 3:10 – దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
The vail and hangings of the tabernacle supported by
నిర్గమకాండము 26:32 – తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.
నిర్గమకాండము 26:37 – ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను.
నిర్గమకాండము 36:36 – దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను.
నిర్గమకాండము 36:38 – దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండెబద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.
Two, placed in the temple porch
1రాజులు 7:15 – ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోత పోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివి గలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.
1రాజులు 7:16 – మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒక పీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.
1రాజులు 7:17 – మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసుపని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగియుండెను.
1రాజులు 7:18 – ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.
1రాజులు 7:19 – మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.
1రాజులు 7:20 – మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.
1రాజులు 7:21 – ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.
Of memorial
-Sometimes of A Single stone
ఆదికాండము 28:18 – పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
-Sometimes of A heap of stones
యెహోషువ 4:8 – అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పి నట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి.
యెహోషువ 4:9 – అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.
యెహోషువ 4:20 – వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి
-to witness vows
ఆదికాండము 28:18 – పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ఆదికాండము 31:13 – నీవెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
-to witness covenants
ఆదికాండము 31:52 – హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీయొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నాయొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
-to mark the graves of the dead
ఆదికాండము 35:20 – యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
-to commemorate remarkable events
నిర్గమకాండము 24:4 – మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి
యెహోషువ 4:20 – వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి
యెహోషువ 4:24 – మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.
-to Perpetuate names
2సమూయేలు 18:18 – తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.
-in Honour of idols
లేవీయకాండము 26:1 – మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
ద్వితియోపదేశాకాండము 7:5 – కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
-Often Anointed
ఆదికాండము 28:18 – పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ఆదికాండము 31:13 – నీవెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
-Often had inscriptions
యోబు 19:24 – అవి యినుప పోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.
The divine glory appeared to Israel in the form of
నిర్గమకాండము 13:21 – వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
నిర్గమకాండము 13:22 – ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యెదుటనుండి తొలగింపలేదు.
సంఖ్యాకాండము 12:5 – యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.
Lot’s wife became a pillar of salt
ఆదికాండము 19:26 – అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.
Illustrative of
-Stability of the heavens
యోబు 26:11 – ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయమొంది అదరును
-Stability of the earth
1సమూయేలు 2:8 – దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము,లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
కీర్తనలు 75:3 – భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును.(సెలా.)
-the Church
1తిమోతి 3:15 – అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది
-Stability of Christ
పరమగీతము 5:15 – అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము
ప్రకటన 10:1 – బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
-Ministers
యిర్మియా 1:18 – యూదా రాజులయొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.
గలతీయులకు 2:9 – స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.
-Saints who overcome in Christ
ప్రకటన 3:12 – జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవునియొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.