Display Topic
Descended form Jacob’s eighth son
ఆదికాండము 30:12 – లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
ఆదికాండము 30:13 – లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
Predictions concerning
ఆదికాండము 49:20 – ఆషేరు నొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
ద్వితియోపదేశాకాండము 33:24 – ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.
ద్వితియోపదేశాకాండము 33:25 – నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
Strength of, on leaving Egypt
సంఖ్యాకాండము 1:40 – ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
సంఖ్యాకాండము 1:41 – ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలువది యొకవేయి ఐదు వందలమంది యైరి.
Persons selected from
-to number the people
సంఖ్యాకాండము 1:13 – ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు
-to spy out the land
సంఖ్యాకాండము 13:13 – ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
-to divide the land
సంఖ్యాకాండము 34:27 – ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.
The centre of the fourth division of Israel in its journeys
సంఖ్యాకాండము 10:25 – దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి
సంఖ్యాకాండము 10:26 – ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.
Encamped next to, and under the standard of Dan, north of the tabernacles
సంఖ్యాకాండము 2:25 – దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
సంఖ్యాకాండము 2:27 – అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
Offering of, at the dedication
సంఖ్యాకాండము 7:72 – పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.
సంఖ్యాకాండము 7:73 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
సంఖ్యాకాండము 7:74 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
సంఖ్యాకాండము 7:75 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
సంఖ్యాకాండము 7:76 – ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
సంఖ్యాకాండము 7:77 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.
Families of
సంఖ్యాకాండము 26:44 – ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;
సంఖ్యాకాండము 26:45 – బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;
సంఖ్యాకాండము 26:46 – ఆషేరు కుమార్తె పేరు శెరహు.
సంఖ్యాకాండము 26:47 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.
Strength of on entering Canaan
సంఖ్యాకాండము 26:47 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.
On Ebal, said amen to the curses of the law
ద్వితియోపదేశాకాండము 27:13 – రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.
Bounds of their inheritance
యెహోషువ 19:24 – అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
యెహోషువ 19:25 – వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు
యెహోషువ 19:26 – అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి
యెహోషువ 19:27 – తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు
యెహోషువ 19:28 – ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.
యెహోషువ 19:29 – అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
యెహోషువ 19:30 – ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
యెహోషువ 19:31 – వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
Bordered on the sea
యెహోషువ 19:29 – అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
న్యాయాధిపతులు 5:17 – గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి? ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద ఏల నిలిచిరి?
Did not fully drive out Canaanites
న్యాయాధిపతులు 1:31 – ఆషే రీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని అఫెకువారిని రెహోబు వారిని
న్యాయాధిపతులు 1:32 – ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షె మెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదు గాని
Reproved for not aiding against Sisera
న్యాయాధిపతులు 5:17 – గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి? ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద ఏల నిలిచిరి?
Assisted Gideon against the Midianites
న్యాయాధిపతులు 6:35 – అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడు కొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.
న్యాయాధిపతులు 7:23 – నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.
Some of, at coronation of David
1దినవృత్తాంతములు 12:36 – ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.
Officers place over, by Solomon
1రాజులు 4:16 – ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.
Aided in Hezekiah’s reformation
2దినవృత్తాంతములు 30:11 – అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.
Remarkable persons of
1దినవృత్తాంతములు 7:30 – ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.
1దినవృత్తాంతములు 7:31 – బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.
1దినవృత్తాంతములు 7:32 – హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.
1దినవృత్తాంతములు 7:33 – యప్లేటు కుమారులెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.
1దినవృత్తాంతములు 7:34 – షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.
1దినవృత్తాంతములు 7:35 – వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.
1దినవృత్తాంతములు 7:36 – జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా
1దినవృత్తాంతములు 7:37 – బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.
1దినవృత్తాంతములు 7:38 – ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.
1దినవృత్తాంతములు 7:39 – ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.
1దినవృత్తాంతములు 7:40 – ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతినొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునైయుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.
లూకా 2:36 – మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,