Display Topic


Often found wild

ద్వితియోపదేశాకాండము 14:5 – దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే.

Includes the

-Bull

ఆదికాండము 32:15 – ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా

యోబు 21:10 – వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును.

-Bullock

కీర్తనలు 50:9 – నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

యిర్మియా 46:21 – పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడలవలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.

-Cow

సంఖ్యాకాండము 18:17 – అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠితమైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును.

యోబు 21:10 – వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును.

-heifer

ఆదికాండము 15:9 – ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నాయొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

సంఖ్యాకాండము 19:2 – యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొనిరావలెనని వారితో చెప్పుము.

Was clean and fit for food

ద్వితియోపదేశాకాండము 14:4 – ఎద్దు, గొఱ్ఱపిల్ల, మేకపిల్ల,

Described as

-Strong

కీర్తనలు 144:14 – మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు

సామెతలు 14:4 – ఎద్దులు లేనిచోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును

-beautiful

యిర్మియా 46:20 – ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చేయున్నది.

హోషేయ 10:11 – ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నించుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.

-Not without sagacity

యెషయా 1:3 – ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

Horns and hoofs of, alluded to

కీర్తనలు 69:31 – ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడెకంటెను అది యెహోవాకు ప్రీతికరము

Lowing of, alluded to

1సమూయేలు 15:14 – సమూయేలు ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి? అని అడిగెను.

యోబు 6:5 – అడవిగాడిద గడ్డిచూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేతచూచి రంకెవేయునా?

Was fed

-with Grass

యోబు 40:15 – నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును.

కీర్తనలు 106:20 – తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి.

దానియేలు 4:25 – తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపుమంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును.

-with Corn

యెషయా 30:24 – భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

-with straw

యెషయా 11:7 – ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

-on the hills

యెషయా 7:25 – పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చపొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱలు త్రొక్కుటకును ఉపయోగమగును.

-in the valleys

1దినవృత్తాంతములు 27:29 – షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి.

యెషయా 65:10 – నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱల మేతభూమియగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును.

-in stalls

హబక్కూకు 3:17 – అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను

Rapid manner of collecting its food alluded to

సంఖ్యాకాండము 22:4 – మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.

Formed a part of the patriarchal wealth

ఆదికాండము 13:2 – అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.

ఆదికాండము 13:5 – అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱలు గొడ్లు గుడారములు ఉండెను గనుక

ఆదికాండము 26:14 – అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

యోబు 1:3 – అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.

Formed a part of the wealth of Israel in Egypt

ఆదికాండము 50:8 – యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.

నిర్గమకాండము 10:9 – అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను

నిర్గమకాండము 12:32 – మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొనిపోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.

Formed a part of the wealth of the Jews

సంఖ్యాకాండము 32:4 – ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు.

కీర్తనలు 144:14 – మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు

Required great care and attention

సామెతలు 27:23 – నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.

Herdmen appointed over

ఆదికాండము 13:7 – అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.

1సమూయేలు 21:7 – ఆ దినమున సౌలుయొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పసులకాపరులకు పెద్ద

Urged on by the goad

న్యాయాధిపతులు 3:31 – అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.

Used for

– Drawing wagons &c

సంఖ్యాకాండము 7:3 – వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడుబండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొనివచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొనివచ్చిరి.

1సమూయేలు 6:7 – కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి

-Carrying burdens

1దినవృత్తాంతములు 12:40 – ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱలను పశువులను విస్తారముగా తీసికొనివచ్చిరి.

-Ploughing

1రాజులు 19:19 – ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేరబోయి తన దుప్పటి అతనిమీద వేయగా

యోబు 1:14 – ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొనిపోయి

ఆమోసు 6:12 – గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,

-Earing the ground

యెషయా 30:24 – భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

యెషయా 32:20 – సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.

-Treading out the Corn

హోషేయ 10:11 – ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నించుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.

-sacrifice

నిర్గమకాండము 20:24 – మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొఱ్ఱలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.

2సమూయేలు 24:22 – అందుకు అరౌనానా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.

-Food

1రాజులు 1:9 – అదోనీయా ఏన్‌రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారులగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని

1రాజులు 19:21 – అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటి మాంసమును గొర్తినొగలచేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.

2దినవృత్తాంతములు 18:2 – కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులోనుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతనికొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేకమైన గొఱ్ఱలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదుమీదికి పోవుటకు అతని ప్రేరేపించెను.

Often stall-fed for slaughter

సామెతలు 15:17 – పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.

Goes to the slaughter unconscious

సామెతలు 7:22 – వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

Young of, considered a great delicacy

ఆదికాండము 18:7 – మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను.

ఆమోసు 6:4 – దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.

Male firstlings of, belonged to God

నిర్గమకాండము 34:19 – ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱ పిల్లయేగాని అది నాదగును

Tithe of, given to the priests

2దినవృత్తాంతములు 31:6 – యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలువారును యూదావారును ఎద్దులలోను గొఱ్ఱలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొనివచ్చి కుప్పలుగా కూర్చిరి.

Laws respecting

-to rest on the Sabbath

నిర్గమకాండము 23:12 – ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను.

ద్వితియోపదేశాకాండము 5:14 – ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.

-Not to be yoked with An ass in the same plough

ద్వితియోపదేశాకాండము 22:10 – ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.

-Not to be muzzled when Treading out the Corn

ద్వితియోపదేశాకాండము 25:4 – నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.

1కొరిందీయులకు 9:9 – కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి యున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?

-If stolen to be Restored Double

నిర్గమకాండము 22:4 – వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండంతలు చెల్లింపవలెను.

-of others Not to be coveted

నిర్గమకాండము 20:17 – నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 5:21 – నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.

-of others If lost or hurt through neglect, to be made good

నిర్గమకాండము 22:9 – ప్రతి విధమైన ద్రోహమునుగూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱనుగూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను.

నిర్గమకాండము 22:10 – ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను,

నిర్గమకాండము 22:11 – వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు.

నిర్గమకాండము 22:12 – అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను.

నిర్గమకాండము 22:13 – అది నిజముగా చీల్చబడినయెడల వాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు.

-Killing A Man, to be stoned

నిర్గమకాండము 21:28 – ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.

నిర్గమకాండము 21:29 – ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను.

నిర్గమకాండము 21:30 – వానికి పరిక్రయ ధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.

నిర్గమకాండము 21:31 – అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.

నిర్గమకాండము 21:32 – ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచినయెడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్టవలెను.

-Mode of reparation for one, Killing another

నిర్గమకాండము 21:35 – ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడిచినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.

నిర్గమకాండము 21:36 – అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయనివాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.

-Straying to be Brought back to its owner

నిర్గమకాండము 23:4 – నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను.

ద్వితియోపదేశాకాండము 22:1 – నీ సహోదరుని యెద్దుగాని గొఱ్ఱగాని త్రోవ తప్పిపోవుట చూచినయెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరునియొద్దకు మళ్లింపవలెను.

ద్వితియోపదేశాకాండము 22:2 – నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయినయెడలను, నీవు అతని నెరుగకపోయినయెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాని వెదకుచు వచ్చువరకు అది నీయొద్ద నుండవలెను, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను.

-Fallen under its burden to be raised up again

ద్వితియోపదేశాకాండము 22:4 – నీ సహోదరుని గాడిదగాని యెద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచినయెడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను.

-Fat of, Not to be Eaten

లేవీయకాండము 7:23 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎద్దుదేగాని గొఱ్ఱదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు.

Increase of, promised

ద్వితియోపదేశాకాండము 7:13 – ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱల మందలను, మేకల మందలను దీవించును.

ద్వితియోపదేశాకాండము 28:4 – నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱమేకల మందలు దీవింపబడును;

Publicly sold

2సమూయేలు 24:24 – రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.

లూకా 14:19 – మరియెకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.

Often given as a present

ఆదికాండము 12:16 – అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.

ఆదికాండము 20:14 – అబీమెలెకు గొఱ్ఱలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.

The wicked often took, in pledge from the poor

యోబు 24:3 – తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

Custom of sending the pieces of, to collect the people to war

1సమూయేలు 11:7 – ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.

Sea of brass rested on figures of

1రాజులు 7:25 – అది పండ్రెండు ఎడ్లమీద నిలువబడియుండెను; వీటిలో మూడు ఉత్తరదిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణదిక్కును మూడు తూర్పుదిక్కును చూచుచుండెను. వీటిమీద ఆ సముద్రము ఎత్తబడి యుండెను. వాటి వెనుకటి భాగములన్నియు లోపలితట్టు త్రిప్పబడి యుండెను.

Illustrative

– (Engaged in husbandry,) of Ministers

యెషయా 30:24 – భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

యెషయా 32:20 – సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.

– (Not muzzled in treading corn,) of Minister’s right to support

1కొరిందీయులకు 9:9 – కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి యున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?

1కొరిందీయులకు 9:10 – కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.

– (Prepared for a feast,) of the provision of the gospel

సామెతలు 9:2 – పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది

మత్తయి 22:4 – కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని

– (Led to slaughter,) of a rash youth

సామెతలు 7:22 – వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

– (Led to slaughter,) of saints under persecution

యిర్మియా 11:19 – అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱపిల్లవలె ఉంటిని; మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.

– (Stall fed,) of sumptuous living

సామెతలు 15:17 – పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.

Bull or bullock illustrative

-of Fierce Enemies

కీర్తనలు 22:12 – వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి.

కీర్తనలు 68:30 – రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.

– (Firstling of,) of the glory of Joseph

ద్వితియోపదేశాకాండము 33:17 – అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.

– (In a net,) of the impatient under judgment

యెషయా 51:20 – యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.

– (Fatted,) of greedy mercenaries

యిర్మియా 46:21 – పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడలవలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.

– (Unaccustomed to the yoke,) of intractable sinners

యిర్మియా 31:18 – నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

Kine illustrative

-of Proud and wealthy Rules

ఆమోసు 4:1 – షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టు వారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా

– (well favoured,) of years of plenty

ఆదికాండము 41:2 – చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.

ఆదికాండము 41:26 – ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్స రములు.

ఆదికాండము 41:29 – ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.

– (Lean,) of years of scarcity

ఆదికాండము 41:3 – వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటియొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.

ఆదికాండము 27:30 – ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.

Heifer illustrative

-of A beloved wife

న్యాయాధిపతులు 14:18 – ఏడవదినమున సూర్యుడు అస ్తమింపకమునుపు ఆ ఊరివారు తేనెకంటె తీపియైనదేది?సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడునా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.

– (Sliding back,) of backsliding Israel

హోషేయ 4:16 – పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.

– (Taught, &c) of Israel’s fondness for ease in preference to obedience

హోషేయ 10:11 – ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నించుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.

– (Of three years old,) of Moab in affliction

యెషయా 15:5 – మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలువేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.

యిర్మియా 48:34 – నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీము వరకును ఎగ్లాత్షాలిషా వరకును జనులు కేకలువేయుచున్నారు.

– (Fair,) of the beauty and wealth of Egypt

యిర్మియా 46:20 – ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చేయున్నది.

– (At grass,) of the luxurious Chaldees

యిర్మియా 50:11 – నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే?