Display Topic


Were the servants of the Levites

ఎజ్రా 8:20 – మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన నెతీనీయులలో రెండువందల ఇరువదిమంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు.

Probably originated in the appointment of the Gibeonites

యెహోషువ 9:27 – అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలి పీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.

The remnant of the Canaanites appointed as, by Solomon

1రాజులు 9:20 – అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.

1రాజులు 9:21 – ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.

ఎజ్రా 2:58 – నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.

With the priests and Levites

-had Cities to reside in

1దినవృత్తాంతములు 9:2 – తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును.

ఎజ్రా 2:70 – యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.

-Exempted from tribute

ఎజ్రా 7:24 – మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరినిగూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.

Had chiefs or captains over them

నెహెమ్యా 11:21 – నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు.

A large number of, returned from the captivity

ఎజ్రా 2:43 – నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,

ఎజ్రా 2:44 – కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు,

ఎజ్రా 2:45 – లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,

ఎజ్రా 2:46 – హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు,

ఎజ్రా 2:47 – గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,

ఎజ్రా 2:48 – రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,

ఎజ్రా 2:49 – ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,

ఎజ్రా 2:50 – అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,

ఎజ్రా 2:51 – బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,

ఎజ్రా 2:52 – బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,

ఎజ్రా 2:53 – బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు,

ఎజ్రా 2:54 – నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,

నెహెమ్యా 7:46 – నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు

నెహెమ్యా 7:47 – కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు

నెహెమ్యా 7:48 – లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు

నెహెమ్యా 7:49 – హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు

నెహెమ్యా 7:50 – రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు

నెహెమ్యా 7:51 – గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు

నెహెమ్యా 7:52 – బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.

నెహెమ్యా 7:53 – బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు

నెహెమ్యా 7:54 – బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు

నెహెమ్యా 7:55 – బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు

నెహెమ్యా 7:56 – సొలొమోను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు

నెహెమ్యా 7:60 – ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.

Were zealous for the covenant

నెహెమ్యా 10:28 – అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.

నెహెమ్యా 10:29 – వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.