Display Topic
Moses and Aaron
-Rod turned into A serpent
నిర్గమకాండము 4:3 – అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.
నిర్గమకాండము 7:10 – కాబట్టి మోషే అహరోనులు ఫరోయొద్దకు వెళ్లి యెహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్పమాయెను.
-Rod Restored
నిర్గమకాండము 4:4 – అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.
-Hand made leprous
నిర్గమకాండము 4:6 – మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.
-Hand healed
నిర్గమకాండము 4:7 – తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.
-Water turned into blood
నిర్గమకాండము 4:9 – వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.
నిర్గమకాండము 4:30 – యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి.
-river turned into blood
నిర్గమకాండము 7:20 – యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.
-Frogs Brought
నిర్గమకాండము 8:6 – అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
-Frogs removed
నిర్గమకాండము 8:13 – యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.
-Lice Brought
నిర్గమకాండము 8:17 – అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను
-Flies Brought
నిర్గమకాండము 8:21 – నీవు నా ప్రజలను పోనియ్యనియెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
నిర్గమకాండము 8:22 – మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు.
నిర్గమకాండము 8:23 – నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.
నిర్గమకాండము 8:24 – యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
-Flies removed
నిర్గమకాండము 8:31 – యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరోయొద్దనుండియు అతని సేవకులయొద్దనుండియు అతని ప్రజలయొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.
-murrain of beasts
నిర్గమకాండము 9:3 – ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.
నిర్గమకాండము 9:4 – అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను
నిర్గమకాండము 9:5 – మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.
నిర్గమకాండము 9:6 – మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.
-Boils and blains Brought
నిర్గమకాండము 9:10 – కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.
నిర్గమకాండము 9:11 – ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను.
-Hail Brought
నిర్గమకాండము 9:23 – మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశముమీద వడగండ్లు కురిపించెను.
-Hail removed
నిర్గమకాండము 9:33 – మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలువెళ్లి యెహోవావైపు తనచేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమిమీద కురియుట మానెను.
-Locusts Brought
నిర్గమకాండము 10:13 – మోషే ఐగుప్తు దేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసరజేసెను; ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను.
-Locust removed
నిర్గమకాండము 10:19 – అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు
-darkness Brought
నిర్గమకాండము 10:22 – మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెను.
-the First-born destroyed
నిర్గమకాండము 12:29 – అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరిని పశువుల తొలి పిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను
-the red-sea divided
నిర్గమకాండము 14:21 – మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
నిర్గమకాండము 14:22 – నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
-Egyptians overwhelmed
నిర్గమకాండము 14:26 – అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగివచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.
నిర్గమకాండము 14:27 – మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.
నిర్గమకాండము 14:28 – నీళ్లు తిరిగివచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
-Water sweetened
నిర్గమకాండము 15:25 – అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి
-Water from rock in Horeb
నిర్గమకాండము 17:6 – ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.
-Amalek vanquished
నిర్గమకాండము 17:11 – మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,
నిర్గమకాండము 17:12 – మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొనివచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.
నిర్గమకాండము 17:13 – అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.
-Destruction of Korah
సంఖ్యాకాండము 16:28 – మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.
సంఖ్యాకాండము 16:29 – మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.
సంఖ్యాకాండము 16:30 – అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
సంఖ్యాకాండము 16:31 – అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను.
సంఖ్యాకాండము 16:32 – భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
-Water from rock in Kadesh
సంఖ్యాకాండము 20:11 – అప్పుడు మోషే తన చెయ్యియెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
-Healing by brazen serpent
సంఖ్యాకాండము 21:8 – మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పమువంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
సంఖ్యాకాండము 21:9 – కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.
Joshua
-Waters of Jordan divided
యెహోషువ 3:10 – వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక
యెహోషువ 3:11 – జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.
యెహోషువ 3:12 – కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.
యెహోషువ 3:13 – సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజ కుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.
యెహోషువ 3:14 – కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధన మందస మును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.
యెహోషువ 3:15 – అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే
యెహోషువ 3:16 – పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.
యెహోషువ 3:17 – జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిర ముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.
-Jordan Restored to its course
యెహోషువ 4:18 – యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను.
-Jericho Taken
యెహోషువ 6:6 – నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించిమీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను.
యెహోషువ 6:7 – మరియు అతడుమీరు సాగి పట్టణమును చుట్టుకొను డనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.
యెహోషువ 6:8 – యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.
యెహోషువ 6:9 – యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.
యెహోషువ 6:10 – మరియు యెహోషువమీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.
యెహోషువ 6:11 – అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి.
యెహోషువ 6:12 – ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.
యెహోషువ 6:13 – ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.
యెహోషువ 6:14 – అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.
యెహోషువ 6:15 – ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకా రముగానే పట్టణ ముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి
యెహోషువ 6:16 – ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుకేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.
యెహోషువ 6:17 – ఈ పట్టణ మును దీనిలో నున్నది యావత్తును యెహోవావలన శపింప బడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారంద రును మాత్రమే బ్రదుకుదురు.
యెహోషువ 6:18 – శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనినయెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.
యెహోషువ 6:19 – వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్ర లును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.
యెహోషువ 6:20 – యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.
-the sun and moon stayed
యెహోషువ 10:12 – యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
యెహోషువ 10:13 – సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.
యెహోషువ 10:14 – యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.
Gideon
-Midianites destroyed
న్యాయాధిపతులు 7:16 – ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివానిచేతికిచ్చి వారితో ఇట్లనెనునన్ను చూచి నేను చేయునట్లు చేయుడి;
న్యాయాధిపతులు 7:17 – ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను.
న్యాయాధిపతులు 7:18 – నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచుయెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను.
న్యాయాధిపతులు 7:19 – అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమచేతులలోనున్న కుండలను పగులగొట్టిరి.
న్యాయాధిపతులు 7:20 – అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, యెడమచేతు లలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.
న్యాయాధిపతులు 7:21 – వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.
న్యాయాధిపతులు 7:22 – ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్ద నున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా
Samson
-A lion Killed
న్యాయాధిపతులు 14:6 – యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.
-Philistines Killed
న్యాయాధిపతులు 14:19 – యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.
న్యాయాధిపతులు 15:15 – అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.
-the Gates of Gaza Carried away
న్యాయాధిపతులు 16:3 – సమ్సోను మధ్యరాత్రివరకు పండు కొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసి కొనిపోయెను.
– Dagon’s house pulled down
న్యాయాధిపతులు 16:30 – నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.
Samuel
-Thunder and rain in Harvest
1సమూయేలు 12:18 – సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
The prophet of Judah
– Jeroboam’s hand withered
1రాజులు 13:4 – బేతేలునందున్న బలిపీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండిపోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తి లేకపోయెను.
-the altar Rent
1రాజులు 13:5 – మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను.
-the withered Hand Restored
1రాజులు 13:6 – అప్పుడు రాజు నా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.
Elijah
-drought Caused
1రాజులు 17:1 – అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.
యాకోబు 5:17 – ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు.
-meal and oil Multiplied
1రాజులు 17:14 – భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని
1రాజులు 17:15 – ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటివారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.
1రాజులు 17:16 – యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
-A Child Restored to life
1రాజులు 17:22 – యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
1రాజులు 17:23 – ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి–ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
-sacrifice Consumed by fire
1రాజులు 18:36 – అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థన చేసెను యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.
1రాజులు 18:38 – అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
-Men destroyed by fire
2రాజులు 1:10 – అందుకు ఏలీయా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించును గాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.
2రాజులు 1:11 – మరల రాజు ఏబది మందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.
2రాజులు 1:12 – అందుకు ఏలీయా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించును గాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.
-rain Brought
1రాజులు 18:41 – పిమ్మట ఏలీయా విస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా
1రాజులు 18:42 – అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
1రాజులు 18:43 – తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకిపోయి సముద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడు ఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.
1రాజులు 18:44 – ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.
1రాజులు 18:45 – అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్లిపోయెను.
యాకోబు 5:18 – అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
-Waters of Jordan divided
2రాజులు 2:8 – అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడతపెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.
-Taken to heaven
2రాజులు 2:11 – వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరుచేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
Elisha
-Waters of Jordan divided
2రాజులు 2:14 – ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.
-Waters healed
2రాజులు 2:21 – అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
2రాజులు 2:22 – కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
-Children torn by bears
2రాజులు 2:24 – అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.
-oil Multiplied
2రాజులు 4:1 – అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా
2రాజులు 4:2 – ఎలీషా నావలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటియున్నది; అది తప్ప మరేమియు లేదనెను.
2రాజులు 4:3 – అతడు నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము;
2రాజులు 4:4 – అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా
2రాజులు 4:5 – ఆమె అతనియొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.
2రాజులు 4:6 – పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమియు లేవని చెప్పెను. అంతలొ నూనె నిలిచిపోయెను.
2రాజులు 4:7 – ఆమె దైవజనుడైన అతనియొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
-Child Restored to life
2రాజులు 4:32 – ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడియుండుట చూచి
2రాజులు 4:33 – తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి
2రాజులు 4:34 – మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తనచేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.
2రాజులు 4:35 – తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వానిమీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.
-Naaman healed
2రాజులు 5:10 – ఎలీషా నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.
2రాజులు 5:14 – అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.
-Gehazi struck with leprosy
2రాజులు 5:27 – కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను.
-Iron Caused to swim
2రాజులు 6:6 – ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.
-Syrians smitten with blindness
2రాజులు 6:20 – వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.
-Syrians Restored to sight
2రాజులు 6:20 – వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.
-A Man Restored to life
2రాజులు 13:21 – కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లుమోపి నిలిచెను.
Isaiah
-Hezekiah healed
2రాజులు 20:7 – పిమ్మట యెషయా అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.
-shadow put back on the dial
2రాజులు 20:11 – ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలకమీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను.
The seventy disciples
-Various miracles
లూకా 10:9 – అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.
లూకా 10:17 – ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగివచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా
The apostles
-many miracles
అపోస్తలులకార్యములు 2:43 – అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచక క్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.
అపోస్తలులకార్యములు 5:12 – ప్రజలమధ్య అనేకమైన సూచక క్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.
Peter
-Lame Man cured
అపోస్తలులకార్యములు 3:7 – వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
-death of Ananias
అపోస్తలులకార్యములు 5:5 – అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను;
-death of Sapphira
అపోస్తలులకార్యములు 5:10 – వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.
-the sick healed
అపోస్తలులకార్యములు 5:15 – అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
అపోస్తలులకార్యములు 5:16 – మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.
-AEneas made whole
అపోస్తలులకార్యములు 9:34 – పేతురు ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా
-Dorcas Restored to life
అపోస్తలులకార్యములు 9:40 – పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
Stephen
-great miracles
అపోస్తలులకార్యములు 6:8 – స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.
Philip
-Various miracles
అపోస్తలులకార్యములు 8:6 – జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా.
అపోస్తలులకార్యములు 8:7 – అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.
అపోస్తలులకార్యములు 8:13 – అప్పుడు సీమోను కూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతినొందెను.
Paul
-Elymas smitten with blindness
అపోస్తలులకార్యములు 13:11 – ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
-Lame Man cured
అపోస్తలులకార్యములు 14:10 – నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువసాగెను.
-An unclean spirit cast out
అపోస్తలులకార్యములు 16:18 – ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.
-Special miracles
అపోస్తలులకార్యములు 19:11 – మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;
అపోస్తలులకార్యములు 19:12 – అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలిపోయెను.
-Eutychus Restored to life
అపోస్తలులకార్యములు 20:10 – అంతట పౌలు క్రిందికివెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.
అపోస్తలులకార్యములు 20:11 – అతడు మరల పైకివచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను.
అపోస్తలులకార్యములు 20:12 – వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
– Viper’s bite made harmless
అపోస్తలులకార్యములు 28:5 – అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించివేసి, యే హానియు పొందలేదు.
-father of Publius healed
అపోస్తలులకార్యములు 28:8 – అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థన చేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.
Paul and Barnabas
-Various miracles
అపోస్తలులకార్యములు 14:3 – కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి. ప్రభువు వారిచేత సూచక క్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను.