Display Topic


Extended from India to Ethiopia

ఎస్తేరు 1:1 – అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.

Peopled by descendants of Eliam

ఆదికాండము 10:22 – షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామనువారు.

Illustrated by

– Silver part of image in Nebuchadnezzar’s dream

దానియేలు 2:32 – ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,

దానియేలు 2:39 – తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.

-A Bear

దానియేలు 7:5 – రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.

-A ram with Two horns

దానియేలు 8:3 – నేను ఊలయి యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.

దానియేలు 8:20 – నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది.

Shushan a chief city of

ఎస్తేరు 1:2 – ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్యపరిపాలన చేయుచుండగా

ఎస్తేరు 8:15 – అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజు సముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషమొందెను.

Achmetha or Ecbatana a chief city of

ఎజ్రా 6:2 – మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.

Divided into many provinces

ఎస్తేరు 1:1 – అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.

దానియేలు 6:1 – తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను.

Laws of, unalterable

దానియేలు 6:12 – రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమునుబట్టి రాజా, ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను.

దానియేలు 6:15 – ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసికొనవలెననిరి.

Ruled by, absolute kings

ఎస్తేరు 3:8 – అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.

ఎస్తేరు 3:11 – ఆ వెండి నీ కియ్యబడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.

ఎస్తేరు 7:9 – రాజుముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తుగల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.

Kings of, mentioned in scripture

-Cyrus

ఎజ్రా 1:1 – పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

-Ahasuerus or Cambyses

ఎజ్రా 4:6 – మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులనుగూర్చియు యెరూషలేము పట్టణపువారినిగూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.

-Artaxerxes Smerdis (An usurper)

ఎజ్రా 4:7 – అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది.

-Darius Hystaspes

ఎజ్రా 6:1 – అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా

దానియేలు 5:31 – మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.

-Xerxes

దానియేలు 11:2 – ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.

-Artaxerxes Longimanus or Ahasuerus

ఎజ్రా 6:14 – యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపు రాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.

ఎజ్రా 7:1 – ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్త యొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడై యుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు

ఎస్తేరు 1:1 – అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.

Kings of

-Called Kings of Assyria

ఎజ్రా 6:22 – ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారిచేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.

-Called Kings of Babylon

నెహెమ్యా 13:6 – ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని

-Styled Themselves king of Kings

ఎజ్రా 7:12 – రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను

-dwelt in Royal palaces

ఎస్తేరు 1:2 – ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్యపరిపాలన చేయుచుండగా

ఎస్తేరు 8:14 – రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.

-were Exceeding rich

ఎస్తేరు 1:4 – అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.

దానియేలు 12:2 – మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

-Entertained magnificently

ఎస్తేరు 1:3 – తన యేలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్య దేశము యొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా

ఎస్తేరు 1:5 – ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను.

ఎస్తేరు 1:7 – అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.

-Held in their Hand A golden sceptre

ఎస్తేరు 5:2 – రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తనచేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను.

-put to death all who approached them without permission

ఎస్తేరు 4:11 – యొక్క అంతర్గృహమున ప్రవేశించినయెడల బ్రదుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికిని తెలిసేయున్నది. నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను.

ఎస్తేరు 4:16 – నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.

Celebrated for wise men

ఎస్తేరు 1:13 – విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక

మత్తయి 2:1 – రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి

People of, warlike

యెహెజ్కేలు 27:10 – పారసీక దేశపువారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.

యెహెజ్కేలు 38:5 – నీతో కూడిన పారసీకదేశపువారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిరస్త్రాణములను ధరించువారినందరిని నేను బయలుదేరదీసెదను.

Peculiar customs in

ఎస్తేరు 1:8 – ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చి యుండెను.

ఎస్తేరు 2:12 – ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను.

ఎస్తేరు 2:13 – మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు.

Babylon taken by the king of

దానియేలు 5:20 – అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వమునతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను.

దానియేలు 5:31 – మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.

The Jews delivered from captivity by means of

2దినవృత్తాంతములు 36:20 – ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.

2దినవృత్తాంతములు 36:22 – పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

2దినవృత్తాంతములు 36:23 – పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేరవచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.

ఎజ్రా 1:1 – పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

ఎజ్రా 1:2 – పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

ఎజ్రా 1:3 – కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండును గాక.

ఎజ్రా 1:4 – మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమయొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.

Predictions respecting

-Extensive Conquest

దానియేలు 8:4 – ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమము గాను ఉత్తరము గాను దక్షిణము గాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.

-Conquest of Babylon

యెషయా 21:1 – సముద్రతీరముననున్న అడవిదేశమునుగూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.

యెషయా 21:2 – కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

దానియేలు 5:28 – బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని

-deliverance of the Jews

యెషయా 44:28 – కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను.

యెషయా 45:1 – అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

యెషయా 45:2 – నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

యెషయా 45:3 – పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.

యెషయా 45:4 – నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

-Invasion of Greece under Xerxes

దానియేలు 11:2 – ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.

-Downfall by Alexander

దానియేలు 8:6 – ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.

దానియేలు 8:7 – నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రము గలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.

దానియేలు 11:3 – అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.