Display Topic


Called the kingdom of Grecia

దానియేలు 11:2 – ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.

Illustrated by the

– Brazen part of the image in Nebuchadnezzar’s dream

దానియేలు 2:32 – ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,

దానియేలు 2:39 – తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.

-Leopard with four Wings and four heads

దానియేలు 7:16 – నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకనియొద్దకు పోయి ఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా, అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను.

దానియేలు 7:17 – ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.

-Rough Goat with notable horn

దానియేలు 8:5 – నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమి యందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.

దానియేలు 8:21 – బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది.

Philippi the chief city of

అపోస్తలులకార్యములు 16:12 – మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి.

Predictions respecting

-Conquest of the Medo-Persian kingdom

దానియేలు 8:6 – ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.

దానియేలు 8:7 – నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రము గలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.

దానియేలు 11:2 – ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.

దానియేలు 11:3 – అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.

-Power and greatness of Alexander its last king

దానియేలు 8:8 – ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగినదానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,

దానియేలు 11:3 – అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.

-Division of it into four kingdoms

దానియేలు 8:8 – ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగినదానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,

దానియేలు 8:22 – అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు.

-divisions of it ruled by strangers

దానియేలు 11:4 – అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.

-history of its four divisions

దానియేలు 11:4 – అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.

దానియేలు 11:5 – అయితే దక్షిణ దేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును.

దానియేలు 11:6 – కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు.

దానియేలు 11:7 – అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును

దానియేలు 11:8 – మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.

దానియేలు 11:9 – అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును.

దానియేలు 11:10 – అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును.

దానియేలు 11:11 – అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును; ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.

దానియేలు 11:12 – ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు.

దానియేలు 11:13 – ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును.

దానియేలు 11:14 – ఆ కాలములయందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.

దానియేలు 11:15 – అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడిదిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేక పోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.

దానియేలు 11:16 – వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును.

దానియేలు 11:17 – అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు.

దానియేలు 11:18 – అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతని మీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.

దానియేలు 11:19 – అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.

దానియేలు 11:20 – అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.

దానియేలు 11:21 – అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.

దానియేలు 11:22 – ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.

దానియేలు 11:23 – అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనము గలవాడైనను ఎదురాడి బలము పొందును.

దానియేలు 11:24 – అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయని దానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచిపెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును

దానియేలు 11:25 – అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.

దానియేలు 11:26 – ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.

దానియేలు 11:27 – కీడు చేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.

దానియేలు 11:28 – అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగివచ్చును.

దానియేలు 11:29 – నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదట నున్నట్టుగా కడపటనుండదు.

-the Little horn to arise out of one of its divisions

దానియేలు 8:8 – ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగినదానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,

దానియేలు 8:9 – ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.

దానియేలు 8:10 – ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను

దానియేలు 8:11 – ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.

దానియేలు 8:12 – అతిక్రమము జరిగినందున అనుదినబలిని నిలుపుచేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.

దానియేలు 8:23 – వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తి యగుచుండగా, క్రూరముఖము గలవాడును యుక్తి గలవాడునై యుండి, ఉపాయము తెలిసికొను ఒక రాజు పుట్టును.

దానియేలు 8:24 – అతడు గెలుచును గాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును.

దానియేలు 8:25 – మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.

Gospel preached in, by God’s desire

అపోస్తలులకార్యములు 16:9 – అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.

అపోస్తలులకార్యములు 16:10 – అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి

Liberality of the churches of

2కొరిందీయులకు 8:1 – సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.

2కొరిందీయులకు 8:2 – ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.

2కొరిందీయులకు 8:3 – ఈ కృప విషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,

2కొరిందీయులకు 8:4 – వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.

2కొరిందీయులకు 8:5 – ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.