Display Topic


Forbidden

లేవీయకాండము 19:11 – నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;

కొలొస్సయులకు 3:9 – ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ

Hateful to God

సామెతలు 6:16 – యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు

సామెతలు 6:17 – అవేవనగా, అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

సామెతలు 6:18 – దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును

సామెతలు 6:19 – లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

An abomination to God

సామెతలు 12:22 – అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.

A hindrance to prayer

యెషయా 59:2 – మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

యెషయా 59:3 – మీచేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

The devil, the father of

యోహాను 8:44 – మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడై యుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.

The devil excites men to

1రాజులు 22:22 – అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

అపోస్తలులకార్యములు 5:3 – అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?

Saints

-Hate

కీర్తనలు 119:163 – అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.

సామెతలు 13:5 – నీతిమంతునికి కల్లమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.

-Avoid

యెషయా 63:8 – వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

జెఫన్యా 3:13 – ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు;

-respect Not Those who practise

కీర్తనలు 40:4 – గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.

-Reject Those who practise

కీర్తనలు 101:7 – మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.

-Pray to be Preserved from

కీర్తనలు 119:29 – కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము

సామెతలు 30:8 – వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

Unbecoming in rulers

సామెతలు 17:7 – అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.

The evil of rulers hearkening to

సామెతలు 29:12 – అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు

False prophets addicted to

యిర్మియా 23:14 – యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమవలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

యెహెజ్కేలు 22:28 – మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు.

False witnesses addicted to

సామెతలు 14:5 – నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

సామెతలు 14:25 – నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.

Antinomians guilty of

1యోహాను 1:6 – ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.

1యోహాను 2:4 – ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.

Hypocrites addicted to

హోషేయ 11:12 – ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.

Hypocrites, a seed of

యెషయా 57:4 – మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

The wicked

-Addicted to, from their infancy

కీర్తనలు 58:3 – తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

-love

కీర్తనలు 52:3 – మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.)

-Delight in

కీర్తనలు 62:4 – అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. (సెలా.)

-seek after

కీర్తనలు 4:2 – నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?

-Prepare their tongues for

యిర్మియా 9:3 – విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 9:5 – సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.

-Bring forth

కీర్తనలు 7:14 – పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కనియున్నాడు.

-give heed to

సామెతలు 17:4 – చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును.

A characteristic of the Apostasy

2దెస్సలోనీకయులకు 2:9 – నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను

1తిమోతి 4:2 – దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

Leads to

-hatred

సామెతలు 26:28 – అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

-love of Impure conversation

సామెతలు 17:4 – చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును.

Often accompanied by gross crimes

హోషేయ 4:1 – ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.

హోషేయ 4:2 – అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు.

Folly of concealing hatred by

సామెతలు 10:18 – అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.

Vanity of getting riches by

సామెతలు 21:6 – అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.

Shall be detected

సామెతలు 12:19 – నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

Poverty preferable to

సామెతలు 19:22 – కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.

Excludes from heaven

ప్రకటన 21:27 – గొఱ్ఱపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

ప్రకటన 22:15 – కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

They who are guilty of, shall be cast into hell

ప్రకటన 21:8 – పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

Punishment for

కీర్తనలు 5:6 – అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

కీర్తనలు 120:3 – మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

కీర్తనలు 120:4 – తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

సామెతలు 19:5 – కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.

యిర్మియా 50:36 – ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును

Exemplified

-the devil

ఆదికాండము 3:4 – అందుకు సర్పము మీరు చావనే చావరు;

-Cain

ఆదికాండము 4:9 – యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.

-Sarah

ఆదికాండము 18:15 – శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.

-Jacob

ఆదికాండము 27:19 – అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను

– Joseph’s brethren

ఆదికాండము 37:31 – వారు యోసేపు అంగీని తీసికొని, ఒకమేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి

ఆదికాండము 37:32 – ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి

-Gibeonites

యెహోషువ 9:9 – వారునీ దేవుడైన యెహోవా నామ మునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చి తివిు; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న

యెహోషువ 9:10 – హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.

యెహోషువ 9:11 – అప్పుడు మా పెద్దలును మా దేశనివాసు లందరును మాతోమీరు ప్రయాణ ముకొరకు ఆహారముచేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితోమేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.

యెహోషువ 9:12 – మీయొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధ పరచుకొని మా యిండ్లనుండి తెచ్చు కొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.

యెహోషువ 9:13 – ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెనని అతనితో చెప్పిరి.

-Samson

న్యాయాధిపతులు 16:10 – అప్పుడు దెలీలాఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింప వచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా

-Saul

1సమూయేలు 15:13 – తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా

-Michal

1సమూయేలు 19:14 – సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియై యున్నాడని చెప్పెను.

-David

1సమూయేలు 21:2 – దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;

-prophet of Bethel

1రాజులు 13:18 – అందుకతడు నేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడు యెహోవాచేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొనిరమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా

-Gehazi

2రాజులు 5:22 – నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యమునుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరిగనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను.

– Job’s friends

యోబు 13:4 – మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.

-Ninevites

నహూము 3:1 – నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.

-Peter

మత్తయి 26:72 – అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.

– Ananias, &c

అపోస్తలులకార్యములు 5:5 – అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను;

-Cretans

తీతుకు 1:12 – వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండిపోతులునై యున్నారు.