Display Topic


Dimensions, &c of

నిర్గమకాండము 25:10 – వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర, దాని వెడల్పు మూరెడునర, దాని యెత్తు మూరెడునర

నిర్గమకాండము 37:1 – మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.

Entirely covered with gold

నిర్గమకాండము 25:11 – దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్టవలెను.

నిర్గమకాండము 37:2 – లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.

Surrounded with a crown of gold

నిర్గమకాండము 25:11 – దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్టవలెను.

Furnished with rings and staves

నిర్గమకాండము 25:12 – దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.

నిర్గమకాండము 25:13 – తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి

నిర్గమకాండము 25:14 – వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.

నిర్గమకాండము 25:15 – ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;

నిర్గమకాండము 37:3 – దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను.

నిర్గమకాండము 37:4 – మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి

నిర్గమకాండము 37:5 – మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.

Tables of testimony alone placed in

నిర్గమకాండము 25:16 – ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలెను.

నిర్గమకాండము 25:21 – నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

1రాజులు 8:9 – ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేకపోయెను.

1రాజులు 8:21 – అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని, ఐగుప్తు దేశములోనుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే యున్నది.

2దినవృత్తాంతములు 5:10 – ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియు లేదు.

హెబ్రీయులకు 9:4 – అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

Mercy-seat laid upon

నిర్గమకాండము 25:21 – నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

నిర్గమకాండము 26:34 – అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.

Placed in the Holy of Holies

నిర్గమకాండము 26:33 – ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

నిర్గమకాండము 40:21 – మందిరములోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.

హెబ్రీయులకు 9:3 – రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.

హెబ్రీయులకు 9:4 – అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

The pot of manna and Aaron’s rod laid up before

హెబ్రీయులకు 9:4 – అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

నిర్గమకాండము 16:33 – కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమయొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.

నిర్గమకాండము 16:34 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.

సంఖ్యాకాండము 17:10 – అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.

A copy of the law laid in the side of

ద్వితియోపదేశాకాండము 31:26 – అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.

Anointed with sacred oil

నిర్గమకాండము 30:26 – ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును

Covered with the vail by the priests before removal

సంఖ్యాకాండము 4:5 – దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

సంఖ్యాకాండము 4:6 – దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

Was called the

-Ark of God

1సమూయేలు 3:3 – దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగాను

– Ark of God’s strength

2దినవృత్తాంతములు 6:41 – నా దేవా, యెహోవా, బలమునకాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.

కీర్తనలు 132:8 – యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.

-Ark of the covenant of the Lord

సంఖ్యాకాండము 10:33 – వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను.

-Ark of the testimony

నిర్గమకాండము 30:6 – సాక్ష్యపుమందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.

సంఖ్యాకాండము 7:89 – మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీదనుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.

A symbol of the presence and glory of God

సంఖ్యాకాండము 14:43 – ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.

సంఖ్యాకాండము 14:44 – అయితే వారు మూర్ఖించి ఆ కొండకొనకెక్కి పోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలువెళ్లలేదు.

యెహోషువ 1:6 – నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.

1సమూయేలు 14:18 – దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.

1సమూయేలు 14:19 – సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి యెక్కువగా వినబడెను; కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి

కీర్తనలు 132:8 – యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.

Esteemed the glory of Israel

1సమూయేలు 4:21 – దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు1 అను పేరు పెట్టెను.

1సమూయేలు 4:22 – దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.

Was holy

2దినవృత్తాంతములు 35:3 – ఇశ్రాయేలీయులకందరికి బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి, మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి.

Sanctified its resting place

2దినవృత్తాంతములు 8:11 – ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను.

The Israelites enquired of the Lord before

యెహోషువ 7:6 – యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు

యెహోషువ 7:7 – అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయులచేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివ సించుట మేలు.

యెహోషువ 7:8 – ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?

యెహోషువ 7:9 – కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసినయెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా

న్యాయాధిపతులు 20:27 – ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను.

1దినవృత్తాంతములు 13:3 – మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.

Was carried

-by Priests of Levites Alone

ద్వితియోపదేశాకాండము 10:8 – నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.

యెహోషువ 3:14 – కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధన మందస మును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.

2సమూయేలు 15:24 – సాదోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను.

1దినవృత్తాంతములు 15:2 – మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.

-before the Israelites in their journeys

సంఖ్యాకాండము 10:33 – వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను.

యెహోషువ 3:6 – మీరు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజ కులకు అతడు సెలవియ్యగా వారు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి.

-Sometimes to the camp in war

1సమూయేలు 4:4 – కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.

1సమూయేలు 4:5 – యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి.

Profanation of, punished

సంఖ్యాకాండము 4:5 – దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

సంఖ్యాకాండము 4:15 – దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.

1సమూయేలు 6:19 – బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి.

1దినవృత్తాంతములు 15:13 – ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవాయొద్ద విధినిబట్టి విచారణ చేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.

Protecting of, rewarded

1దినవృత్తాంతములు 13:14 – దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.

Captured by the Philistines

1సమూయేలు 4:11 – మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు హతులైరి.

Miracles connected with

-Jordan divided

యెహోషువ 4:7 – అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును,

-Fall of the walls of Jericho

యెహోషువ 6:6 – నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించిమీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను.

యెహోషువ 6:7 – మరియు అతడుమీరు సాగి పట్టణమును చుట్టుకొను డనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.

యెహోషువ 6:8 – యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.

యెహోషువ 6:9 – యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.

యెహోషువ 6:10 – మరియు యెహోషువమీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.

యెహోషువ 6:11 – అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి.

యెహోషువ 6:12 – ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.

యెహోషువ 6:13 – ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.

యెహోషువ 6:14 – అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.

యెహోషువ 6:15 – ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకా రముగానే పట్టణ ముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి

యెహోషువ 6:16 – ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుకేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.

యెహోషువ 6:17 – ఈ పట్టణ మును దీనిలో నున్నది యావత్తును యెహోవావలన శపింప బడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారంద రును మాత్రమే బ్రదుకుదురు.

యెహోషువ 6:18 – శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనినయెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.

యెహోషువ 6:19 – వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్ర లును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.

యెహోషువ 6:20 – యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.

-Fall of Dagon

1సమూయేలు 5:1 – ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి

1సమూయేలు 5:2 – దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.

1సమూయేలు 5:3 – అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి.

1సమూయేలు 5:4 – ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడప దగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను.

-Philistines plagued

1సమూయేలు 5:6 – యెహోవా హస్తము అష్డోదు వారిమీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులలో నున్నవారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా

1సమూయేలు 5:7 – అష్డోదు వారు సంభవించిన దాని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోను మీదను బహు భారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణము గదా; అది యిక మనమధ్య నుండకూడదని చెప్పుకొని

1సమూయేలు 5:8 – ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొనిపోయిరి.

1సమూయేలు 5:9 – అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.

1సమూయేలు 5:10 – వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనయొద్దకు తీసికొని వచ్చిరనిరి.

1సమూయేలు 5:11 – కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టియుండెను.

1సమూయేలు 5:12 – చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.

-Manner of its Restoration

1సమూయేలు 6:1 – యెహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత

1సమూయేలు 6:2 – ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా

1సమూయేలు 6:3 – వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందురనిరి.

1సమూయేలు 6:4 – ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.

1సమూయేలు 6:5 – కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.

1సమూయేలు 6:6 – ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.

1సమూయేలు 6:7 – కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి

1సమూయేలు 6:8 – యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.

1సమూయేలు 6:9 – అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటినయెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసికొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందుమనిరి.

1సమూయేలు 6:10 – వారు ఆలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి

1సమూయేలు 6:11 – యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా

1సమూయేలు 6:12 – ఆ ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.

1సమూయేలు 6:13 – బేత్షెమెషువారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.

1సమూయేలు 6:14 – ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.

1సమూయేలు 6:15 – లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.

1సమూయేలు 6:16 – ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగివెళ్లిరి

1సమూయేలు 6:17 – అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.

1సమూయేలు 6:18 – ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పంది కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో నున్నది.

At Kirjath-jearim twenty years

1సమూయేలు 7:1 – అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.

1సమూయేలు 7:2 – మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా

Removed from Kirjath-jearim to the house of Obed-edom

2సమూయేలు 6:1 – తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో ముప్పదివేల మంది శూరులను సమకూర్చుకొని

2సమూయేలు 6:2 – బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తనయొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.

2సమూయేలు 6:3 – వారు దేవుని మందసమును క్రొత్త బండిమీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.

2సమూయేలు 6:4 – దేవుని మందసముగల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటనుండి తీసికొనిరాగా అహ్యో దాని ముందర నడిచెను

2సమూయేలు 6:5 – దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.

2సమూయేలు 6:6 – వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయిచాపి దేవుని మందసమును పట్టుకొనగా

2సమూయేలు 6:7 – యెహోవా కోపము ఉజ్జామీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.

2సమూయేలు 6:8 – యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్‌1 ఉజ్జా అను పేరు పెట్టెను.

2సమూయేలు 6:9 – నేటికిని దానికి అదేపేరు. ఆ దినమున యెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి

2సమూయేలు 6:10 – యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను.

2సమూయేలు 6:11 – యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను.

David made a tent for

2సమూయేలు 6:17 – వారు యెహోవా మందసమును తీసికొనివచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.

1దినవృత్తాంతములు 15:1 – దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.

Brought into the city of David

2సమూయేలు 6:12 – దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొనివచ్చెను.

2సమూయేలు 6:13 – ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను,

2సమూయేలు 6:14 – దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను.

2సమూయేలు 6:15 – ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.

1దినవృత్తాంతములు 15:25 – దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.

1దినవృత్తాంతములు 15:26 – యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడెలను ఏడు గొఱ్ఱపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.

1దినవృత్తాంతములు 15:27 – దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొనియుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.

1దినవృత్తాంతములు 15:28 – ఇశ్రాయేలీయులందరును ఆర్బాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.

Brought by Solomon into the temple with great solemnity

1రాజులు 8:1 – అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసికొనివచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను.

1రాజులు 8:2 – కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి.

1రాజులు 8:3 – ఇశ్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి

1రాజులు 8:4 – దాని తీసికొనివచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులును లేవీయులును తీసికొనిరాగా

1రాజులు 8:5 – రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱలను ఎడ్లను బలిగా అర్పించిరి.

1రాజులు 8:6 – మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బాలయమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.

2దినవృత్తాంతములు 5:2 – తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొనివచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను.

2దినవృత్తాంతములు 5:3 – ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.

2దినవృత్తాంతములు 5:4 – ఇశ్రాయేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి

2దినవృత్తాంతములు 5:5 – రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱలను పశువులను బలిగా అర్పించిరి.

2దినవృత్తాంతములు 5:6 – లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసికొనివచ్చిరి.

2దినవృత్తాంతములు 5:7 – మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.

2దినవృత్తాంతములు 5:8 – మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను.

2దినవృత్తాంతములు 5:9 – వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.

A type of Christ

కీర్తనలు 40:8 – నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

ప్రకటన 11:19 – మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.