Display Topic


Christ pre-eminently called »The Apostle«

హెబ్రీయులకు 3:1 – ఇందువలన, పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.

Ordained by Christ

మార్కు 3:14 – వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు

యోహాను 15:16 – మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.

Received their title from Christ

లూకా 6:13 – ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.

Called by

-God

1కొరిందీయులకు 1:1 – దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

1కొరిందీయులకు 12:28 – మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

గలతీయులకు 1:1 – మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తువలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,

గలతీయులకు 1:15 – అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

గలతీయులకు 1:16 – ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.

-Christ

మత్తయి 10:1 – ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను.

మార్కు 3:13 – ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయనయొద్దకు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 20:24 – అయితే దేవుని కృపా సువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు

రోమీయులకు 1:5 – యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

-the holy spirit

అపోస్తలులకార్యములు 20:24 – అయితే దేవుని కృపా సువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు

రోమీయులకు 1:5 – యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

Were unlearned men

అపోస్తలులకార్యములు 4:13 – వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

Selected from obscure stations

మత్తయి 4:18 – యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

Sent first to the house of Israel

మత్తయి 10:5 – యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని

మత్తయి 10:6 – ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱలయొద్దకే వెళ్లుడి.

లూకా 24:47 – యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

అపోస్తలులకార్యములు 13:46 – అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము

Sent to preach the gospel to all nations

మత్తయి 28:19 – కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు

మత్తయి 28:20 – నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

మార్కు 16:15 – మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

2తిమోతి 1:11 – ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడితిని.

Christ always present with

మత్తయి 28:20 – నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

Warned against a timid profession of Christ

మత్తయి 10:27 – చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.

మత్తయి 10:28 – మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

మత్తయి 10:29 – రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.

మత్తయి 10:30 – మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి

మత్తయి 10:31 – గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.

మత్తయి 10:32 – మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును వానిని ఒప్పుకొందును.

మత్తయి 10:33 – మనుష్యులయెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.

The Holy Spirit given to

యోహాను 20:22 – ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి.

అపోస్తలులకార్యములు 2:1 – పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

అపోస్తలులకార్యములు 2:2 – అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

అపోస్తలులకార్యములు 2:3 – మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

అపోస్తలులకార్యములు 2:4 – అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

అపోస్తలులకార్యములు 9:17 – అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతనిమీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను

Guided by the Spirit into all truth

యోహాను 14:26 – ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

యోహాను 15:26 – తండ్రియొద్దనుండి మీయొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రియొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.

యోహాను 16:13 – అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును

Instructed by the Spirit to answer adversaries

మత్తయి 10:19 – వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును.

మత్తయి 10:20 – మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.

లూకా 12:11 – వారు సమాజమందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసికొనిపోవునప్పుడు మీరుఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదుమా అని చింతింపకుడి,

లూకా 12:12 – మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.

Specially devoted to the office of the ministry

అపోస్తలులకార్యములు 6:4 – అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 20:27 – దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.

Humility urged upon

మత్తయి 20:26 – మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;

మత్తయి 20:27 – మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.

మార్కు 9:33 – అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక

మార్కు 9:34 – ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా

మార్కు 9:35 – వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచి ఎవడైనను మొదటివాడై యుండగోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి

మార్కు 9:36 – యొక చిన్నబిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని

మార్కు 9:37 – ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనునని వారితో చెప్పెను.

లూకా 22:24 – తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా

లూకా 22:25 – ఆయన వారితో ఇట్లనెను అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు.

లూకా 22:26 – మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను.

లూకా 22:27 – గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను.

లూకా 22:28 – నా శోధనలలో నాతో కూడ నిలిచియున్నవారు మీరే;

లూకా 22:29 – గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,

లూకా 22:30 – సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.

Self-denial urged upon

మత్తయి 10:37 – తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;

మత్తయి 10:38 – తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

మత్తయి 10:39 – తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

Mutual love urged upon

యోహాను 15:17 – మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.

Equal authority given to each of

మత్తయి 16:19 – పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

మత్తయి 18:18 – భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

2కొరిందీయులకు 11:5 – నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.

Were not of the world

యోహాను 15:19 – మీరు లోకసంబంధులైనయెడల లోకము తనవారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.

యోహాను 17:16 – నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.

Were hated by the world

మత్తయి 10:22 – మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షంపబడును.

మత్తయి 24:9 – అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

యోహాను 15:18 – లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.

Persecutions and sufferings of

మత్తయి 10:16 – ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.

మత్తయి 10:18 – వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.

లూకా 21:16 – తలిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;

యోహాను 15:20 – దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల మీ మాటకూడా గైకొందురు

యోహాను 16:2 – వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.

Saw Christ in the flesh

లూకా 1:2 – ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

అపోస్తలులకార్యములు 1:22 – ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియైయుండుట ఆవశ్యకమని చెప్పెను.

1కొరిందీయులకు 9:1 – నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా?

1యోహాను 1:1 – జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మాచేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.

Witnesses of the resurrection and ascension of Christ

లూకా 24:33 – ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగివెళ్లగా, పదునొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి

లూకా 24:34 – ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని

లూకా 24:35 – త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.

లూకా 24:36 – వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి–మీకు సమాధానమవుగాకని వారితో అనెను.

లూకా 24:37 – అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

లూకా 24:38 – అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?

లూకా 24:39 – నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి

లూకా 24:40 – తన చేతులను పాదములను వారికి చూపెను.

లూకా 24:41 – అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.

లూకా 24:51 – వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.

అపోస్తలులకార్యములు 1:2 – తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.

అపోస్తలులకార్యములు 1:3 – ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారికగపడుచు, దేవుని రాజ్య విషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.

అపోస్తలులకార్యములు 1:4 – ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి;

అపోస్తలులకార్యములు 1:5 – యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను.

అపోస్తలులకార్యములు 1:6 – కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన

అపోస్తలులకార్యములు 1:7 – కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.

అపోస్తలులకార్యములు 1:8 – అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను

అపోస్తలులకార్యములు 1:9 – ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.

అపోస్తలులకార్యములు 10:40 – దేవుడాయనను మూడవ దినమున లేపి

అపోస్తలులకార్యములు 10:41 – ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.

1కొరిందీయులకు 15:8 – అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

Empowered to work miracles

మత్తయి 10:1 – ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను.

మత్తయి 10:8 – రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.

మార్కు 16:20 – వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్‌.

లూకా 9:1 – ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి

అపోస్తలులకార్యములు 2:43 – అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచక క్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.