Display Topic


Of all mankind one at first

ఆదికాండము 11:1 – భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.

ఆదికాండము 11:6 – అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏ పనియైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు

Called

-speech

మార్కు 14:70 – అతడు మరల నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.

అపోస్తలులకార్యములు 14:11 – జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో –దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగివచ్చి యున్నారని కేకలువేసి,

-tongue

అపోస్తలులకార్యములు 1:19 – ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా

ప్రకటన 5:9 – ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని,

Confusion of

– A punishment for presumption, &c

ఆదికాండము 11:2 – వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి

ఆదికాండము 11:3 – మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.

ఆదికాండము 11:4 – మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

ఆదికాండము 11:5 – యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను.

ఆదికాండము 11:6 – అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏ పనియైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు

-Originated the varieties in

ఆదికాండము 11:7 – గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.

-Scattered Men over the earth

ఆదికాండము 11:8 – ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.

ఆదికాండము 11:9 – దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.

-divided Men into Separated nations

ఆదికాండము 10:5 – వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.

ఆదికాండము 10:20 – వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములనుబట్టియు జాతులనుబట్టియు హాము కుమారులు.

ఆదికాండము 10:31 – వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశ ములనుబట్టియు తమ తమ జాతులనుబట్టియు షేము కుమారులు.

Great variety of, spoken by men

1కొరిందీయులకు 14:10 – లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.

Ancient kingdoms often comprehended nations of different

ఎస్తేరు 1:22 – ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాష ననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానినిగూర్చిన తాకీదులు పంపించెను.

దానియేలు 3:4 – ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా, దేశస్థులారా, ఆ యా భాషలు మాటలాడు వారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.

దానియేలు 6:25 – అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక.

Kinds of, mentioned

-Hebrew

2రాజులు 18:28 – గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా

అపోస్తలులకార్యములు 26:14 – మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

-Chaldea

దానియేలు 1:4 – తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

-Syriack

2రాజులు 18:26 – హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

ఎజ్రా 4:7 – అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది.

-Greek

అపోస్తలులకార్యములు 21:37 – వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పై యధికారిని చూచి నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాష నీకు తెలియునా?

-Latin

లూకా 23:38 – ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను.

-Lycaonian

అపోస్తలులకార్యములు 14:11 – జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో –దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగివచ్చి యున్నారని కేకలువేసి,

– Arabic, &c

అపోస్తలులకార్యములు 2:11 – క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.

-Egyptian

కీర్తనలు 84:5 – నీవలన బలమునొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.

కీర్తనలు 114:1 – ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలువెళ్లినప్పుడు

అపోస్తలులకార్యములు 2:10 – కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,

Of some nations difficult

యెహెజ్కేలు 3:5 – నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనులయొద్దకు కాదు ఇశ్రాయేలీయులయొద్దకే నిన్ను పంపుచున్నాను.

యెహెజ్కేలు 3:6 – నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారియొద్దకు నేను నిన్ను పంపినయెడల వారు నీ మాటలు విందురు.

The term barbarian applied to those who spoke a strange

1కొరిందీయులకు 14:11 – మాటల అర్థము నాకు తెలియకుండినయెడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.

Power of speaking different

-A gift of the holy spirit

1కొరిందీయులకు 12:10 – మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

-promised

మార్కు 16:17 – నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు,

-Given on the day of Pentecost

అపోస్తలులకార్యములు 2:3 – మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

అపోస్తలులకార్యములు 2:4 – అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

-Followed Receiving the gospel

అపోస్తలులకార్యములు 10:44 – పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.

అపోస్తలులకార్యములు 10:45 – సున్నతి పొందినవారిలో పేతురుతో కూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి.

అపోస్తలులకార్యములు 10:46 – ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.

– Conferred by laying on of the apostles’ hands

అపోస్తలులకార్యములు 8:17 – అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.

అపోస్తలులకార్యములు 8:18 – అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి

అపోస్తలులకార్యములు 19:6 – తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.

-Necessary to Spread of the gospel

అపోస్తలులకార్యములు 2:7 – అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?

అపోస్తలులకార్యములు 2:8 – మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?

అపోస్తలులకార్యములు 2:9 – పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,

అపోస్తలులకార్యములు 2:10 – కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,

అపోస్తలులకార్యములు 2:11 – క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.

-A sign to unbelievers

1కొరిందీయులకు 14:22 – కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైయున్నది.

-Sometimes abused

1కొరిందీయులకు 14:2 – ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.

1కొరిందీయులకు 14:3 – క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.

1కొరిందీయులకు 14:4 – భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

1కొరిందీయులకు 14:5 – మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

1కొరిందీయులకు 14:6 – సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడకపోయినయెడల, నావలన మీకు ప్రయోజనమేమి?

1కొరిందీయులకు 14:7 – పిల్లనగ్రోవి గాని వీణ గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును?

1కొరిందీయులకు 14:8 – మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?

1కొరిందీయులకు 14:9 – ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.

1కొరిందీయులకు 14:10 – లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.

1కొరిందీయులకు 14:11 – మాటల అర్థము నాకు తెలియకుండినయెడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.

1కొరిందీయులకు 14:12 – మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.

1కొరిందీయులకు 14:23 – సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాటలాడుచున్నారని అనుకొందురు కదా?

-Ceased when the Written Bible Completed

1కొరిందీయులకు 13:8 – ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

1కొరిందీయులకు 13:9 – మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని

1కొరిందీయులకు 13:10 – పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.

Interpretation of

-antiquity of engaging Persons for

ఆదికాండము 42:23 – అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.

-A gift of the holy spirit

1కొరిందీయులకు 12:10 – మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

-Most important in the early Church

1కొరిందీయులకు 14:5 – మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

1కొరిందీయులకు 14:13 – భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను.

1కొరిందీయులకు 14:27 – భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైనయెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను.

1కొరిందీయులకు 14:28 – అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.

-the Jews punished by Being Given up to people of A strange

ద్వితియోపదేశాకాండము 28:49 – యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,

యెషయా 28:11 – నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవులచేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.

యిర్మియా 5:15 – ఇశ్రాయేలు కుటుంబము వారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.