Display Topic


Described

ద్వితియోపదేశాకాండము 13:13 – పనికిమాలిన కొందరు మనుష్యులు నీమధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.

హెబ్రీయులకు 3:12 – సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.

Persecution tends to make

మత్తయి 24:9 – అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

మత్తయి 24:10 – అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.

లూకా 8:13 – రాతినేలనుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు.

A worldly spirit tends to make

2తిమోతి 4:10 – దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;

Never belonged to Christ

1యోహాను 2:19 – వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్లిరి.

Saints do not become

కీర్తనలు 44:18 – మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

కీర్తనలు 44:19 – అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు

హెబ్రీయులకు 6:9 – అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.

హెబ్రీయులకు 10:39 – అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

It is impossible to restore

హెబ్రీయులకు 6:4 – ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

హెబ్రీయులకు 6:5 – దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు,

హెబ్రీయులకు 6:6 – తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

Guilt and punishment of

జెఫన్యా 1:4 – నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.

జెఫన్యా 1:5 – మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టియు, బయలుదేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.

జెఫన్యా 1:6 – యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయనయొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.

హెబ్రీయులకు 10:25 – ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.

హెబ్రీయులకు 10:26 – మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని

హెబ్రీయులకు 10:27 – న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.

హెబ్రీయులకు 10:28 – ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.

హెబ్రీయులకు 10:29 – ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?

హెబ్రీయులకు 10:30 – పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.

హెబ్రీయులకు 10:31 – జీవముగల దేవునిచేతిలో పడుట భయంకరము.

హెబ్రీయులకు 10:39 – అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

2పేతురు 2:17 – వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

2పేతురు 2:20 – వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.

2పేతురు 2:21 – వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.

2పేతురు 2:22 – కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

Cautions against becoming

హెబ్రీయులకు 3:12 – సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.

2పేతురు 3:17 – ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.

Shall abound in the latter days

మత్తయి 24:12 – అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.

2దెస్సలోనీకయులకు 2:3 – మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.

1తిమోతి 4:1 – అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మల యందును

1తిమోతి 4:2 – దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

1తిమోతి 4:3 – ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

Exemplified

-Amaziah

2దినవృత్తాంతములు 25:14 – అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగివచ్చిన తరువాత అతడు శేయీరువారి దేవతలను తీసికొనివచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను.

2దినవృత్తాంతములు 25:27 – అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతనిమీద కుట్రచేయగా అతడు లాకీషునకు పారిపోయెను.

-Professed disciples

యోహాను 6:66 – అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

-Hymenaeus and Alexander

1తిమోతి 1:19 – అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయిన వారివలె చెడియున్నారు.

1తిమోతి 1:20 – వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.