Display Topic


The young of the flock

నిర్గమకాండము 12:5 – ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

యెహెజ్కేలు 45:15 – మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱలలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.

Described as

-Patient

యెషయా 53:7 – అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

-Playful

కీర్తనలు 114:4 – కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులువేసెను.

కీర్తనలు 114:6 – కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది?

Exposed to danger from wild beasts

1సమూయేలు 17:34 – అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱపిల్లను ఎత్తికొని పోవుచుండగ.

The shepherd’s care for

యెషయా 40:11 – గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.

Used for

-Food

ద్వితియోపదేశాకాండము 32:14 – ఆవు మజ్జిగను గొఱ్ఱమేకల పచ్చిపాలను గొఱ్ఱపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.

2సమూయేలు 12:4 – అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతునియొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తనయొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.

-Clothing

సామెతలు 27:26 – నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును

-sacrifice

1దినవృత్తాంతములు 29:21 – తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱపొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.

2దినవృత్తాంతములు 29:32 – సమాజపువారు తీసికొనివచ్చిన దహనబలి పశువులెన్నియనగా, డెబ్బది కోడెలును నూరు పొట్టేళ్లును రెండువందల గొఱ్ఱపిల్లలును; ఇవి యన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను.

Considered a great delicacy

ఆమోసు 6:4 – దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.

Offered in sacrifice

-males

నిర్గమకాండము 12:5 – ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

-Females

సంఖ్యాకాండము 6:14 – అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధానబలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,

-while sucking

1సమూయేలు 7:9 – సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగబలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.

-at A year old

నిర్గమకాండము 12:5 – ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 6:14 – అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధానబలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,

-from the earliest times

ఆదికాండము 4:4 – హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను;

ఆదికాండము 22:7 – ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది అని అడుగగా

ఆదికాండము 22:8 – అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనునని చెప్పెను.

-Every morning and evening

నిర్గమకాండము 29:38 – నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱపిల్లను

నిర్గమకాండము 29:39 – సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:3 – మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:4 – వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

-at the Passover

నిర్గమకాండము 12:3 – మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.

నిర్గమకాండము 12:6 – నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలోనుండియైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.

నిర్గమకాండము 12:7 – ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్ల ద్వారబంధపు రెండు నిలువుకమ్ములమీదను పై కమ్మిమీదను చల్లి

-by the Wicked Not accepted

యెషయా 1:11 – యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

యెషయా 66:3 – ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.

Numbers of, given by Josiah to the people for sacrifice

2దినవృత్తాంతములు 35:7 – మరియు యోషీయా తన స్వంత మందలో ముప్పది వేల గొఱ్ఱపిల్లలను మేకపిల్లలను మూడువేల కోడెలను అక్కడనున్న జనులకందరికి పస్కాపశువులుగా ఇచ్చెను.

The first born of an ass to be redeemed with

నిర్గమకాండము 13:13 – ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను.

నిర్గమకాండము 34:20 – గొఱ్ఱపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు పట్టిచేతులతో కనబడవలదు.

An extensive commerce in

ఎజ్రా 7:17 – తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొఱ్ఱపిల్లలను, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలనుకొని, యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము.

యెహెజ్కేలు 27:21 – అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.

Tribute often paid in

2రాజులు 3:4 – మోయాబు రాజైన మేషా అనేకమైన మందలు గలవాడై లక్ష గొఱ్ఱపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.

యెషయా 16:1 – అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱపిల్లలను కప్పముగా సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి

Covenants confirmed by gift of

ఆదికాండము 21:28 – తరువాత అబ్రాహాము తన గొఱ్ఱల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగానుంచెను గనుక

ఆదికాండము 21:29 – అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు

ఆదికాండము 21:30 – నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱ పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.

The image of, was the first impression of on money

ఆదికాండము 33:19 – మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని

యెహోషువ 24:32 – ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.

Illustrative

-of Purity of Christ

1పేతురు 1:19 – అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

-of Christ as A sacrifice

యోహాను 1:29 – మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.

ప్రకటన 5:6 – మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.

-of any thing dear or cherished

2సమూయేలు 12:3 – అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను.

2సమూయేలు 12:9 – నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొనియున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

– Of the Lord’s people

యెషయా 5:17 – అది మేతబీడుగా నుండును గొఱ్ఱపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

యెషయా 11:6 – తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

-of Weak believers

యెషయా 40:11 – గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.

యోహాను 21:15 – వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు నా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.

– (Patience of,) of the patience of Christ

యెషయా 53:7 – అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

అపోస్తలులకార్యములు 8:32 – అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.

– (Among wolves,) of ministers among the ungodly

లూకా 10:3 – మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.

– (Deserted and exposed,) of Israel deprived of God’s protection

హోషేయ 4:16 – పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.

– (Brought to slaughter,) of the wicked under judgments

యిర్మియా 51:40 – గొఱ్ఱపిల్లలు వధకు పోవునట్లును మేకపోతులును పాట్ఠేళ్లును వధకు పోవునట్లును వారిని వధకు రప్పించెదను.

– (Consumed in sacrifice,) of complete destruction of the wicked

కీర్తనలు 37:20 – భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.