Display Topic


Is a part of his character

ద్వితియోపదేశాకాండము 32:4 – ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.

యెషయా 45:21 – మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు? చాలకాలము క్రిందట దాని ప్రకటించినవాడెవడు? యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

Declared to be

-Plenteous

యోబు 37:23 – సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగియుందురు.

-Incomparable

యోబు 4:1 – దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

-Incorruptible

ద్వితియోపదేశాకాండము 10:17 – ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహా దేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.

2దినవృత్తాంతములు 19:7 – యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

-Impartial

2దినవృత్తాంతములు 19:7 – యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

యిర్మియా 32:19 – ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.

-Unfailing

జెఫన్యా 3:5 – అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు

-Undeviating

యోబు 8:3 – దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?

యోబు 34:12 – దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.

-without respect of Persons

రోమీయులకు 2:11 – దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

కొలొస్సయులకు 3:25 – అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతముండదు.

1పేతురు 1:17 – పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

-the habitation of His throne

కీర్తనలు 89:14 – నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.

Not to be sinned against

యిర్మియా 50:7 – కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు.

Denied by the ungodly

యెహెజ్కేలు 33:17 – అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది?

యెహెజ్కేలు 33:20 – యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే; ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధించెదను.

Exhibited in

-forgiving sins

1యోహాను 1:9 – మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

-redemption

రోమీయులకు 3:26 – క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

-His government

కీర్తనలు 9:4 – కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.

యిర్మియా 9:24 – అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

-His judgments

ఆదికాండము 18:25 – ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు

ప్రకటన 19:2 – ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి.

-all His ways

యెహెజ్కేలు 18:25 – అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమేగదా అన్యాయమైనది?

యెహెజ్కేలు 18:29 – అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు.

-the final judgment

అపోస్తలులకార్యములు 17:31 – ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

Acknowledge

కీర్తనలు 51:4 – నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

రోమీయులకు 3:4 – నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును. అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.

Magnify

కీర్తనలు 98:9 – భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

కీర్తనలు 99:3 – భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు.

కీర్తనలు 99:4 – యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.