Display Topic
Descended from Jacob’s fourth son
ఆదికాండము 29:35 – ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.
Predictions respecting
ఆదికాండము 49:8 – యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
ఆదికాండము 49:9 – యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
ఆదికాండము 49:10 – షిలోహు వచ్చువరకు యూదాయొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
ఆదికాండము 49:11 – ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
ఆదికాండము 49:12 – అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
ద్వితియోపదేశాకాండము 33:7 – యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజలయొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.
Persons selected from
-to number the people
సంఖ్యాకాండము 1:7 – యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను
-to spy out the land
సంఖ్యాకాండము 13:6 – యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;
-to divide the land
సంఖ్యాకాండము 34:19 – వారెవరనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు.
Strength of, on leaving Egypt
సంఖ్యాకాండము 1:26 – యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
సంఖ్యాకాండము 1:27 – యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరు వందలమంది యైరి.
సంఖ్యాకాండము 2:4 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.
Encamped with its standard east of the tabernacle
సంఖ్యాకాండము 2:3 – సూర్యుడు ఉదయించు తూర్పుదిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.
Led the first division of Israel in their journeys
సంఖ్యాకాండము 10:14 – యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.
Offering of, at dedication
సంఖ్యాకాండము 7:12 – మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
సంఖ్యాకాండము 7:13 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
సంఖ్యాకాండము 7:14 – ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
సంఖ్యాకాండము 7:15 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను
సంఖ్యాకాండము 7:16 – అపరాధపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
సంఖ్యాకాండము 7:17 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము.
Families of
సంఖ్యాకాండము 26:19 – యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతిబొందిరి.
సంఖ్యాకాండము 26:20 – యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;
సంఖ్యాకాండము 26:21 – పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
Strength of on entering Canaan
సంఖ్యాకాండము 26:22 – వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదువందలమంది.
On Gerizim said amen to the blessings
ద్వితియోపదేశాకాండము 27:12 – బెన్యామీను గోత్రములవారు ప్రజలనుగూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.
Bounds of inheritance
యెహోషువ 15:1 – యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.
యెహోషువ 15:2 – దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.
యెహోషువ 15:3 – అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి
యెహోషువ 15:4 – అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరి హద్దు.
యెహోషువ 15:5 – దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.
యెహోషువ 15:6 – ఆ సరిహద్దు బేత్ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.
యెహోషువ 15:7 – ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షే మెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను.
యెహోషువ 15:8 – ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.
యెహోషువ 15:9 – ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.
యెహోషువ 15:10 – ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.
యెహోషువ 15:11 – ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.
యెహోషువ 15:12 – పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.
First and most vigorous in driving out the Canaanites
న్యాయాధిపతులు 1:3 – అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోమనము కనా నీయులతో యుద్ధము చేయుటకుమా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడ పోయిరి.
న్యాయాధిపతులు 1:4 – కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.
న్యాయాధిపతులు 1:5 – వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి.
న్యాయాధిపతులు 1:6 – అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.
న్యాయాధిపతులు 1:7 – అప్పుడు అదోనీ బెజెకుతమ కాళ్లుచేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.
న్యాయాధిపతులు 1:8 – యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.
న్యాయాధిపతులు 1:9 – తరువాత యూదావంశస్థులు మన్యములయందును దక్షిణదేశమందును లోయయందును నివసించిన కనానీయు లతో యుద్ధము చేయుటకు పోయిరి.
న్యాయాధిపతులు 1:10 – మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయులమీదికి పోయి, షేషయిని అహీమానును తల్మయిని హతముచేసిరి.
న్యాయాధిపతులు 1:11 – ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.
న్యాయాధిపతులు 1:12 – కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెద నని చెప్పగా
న్యాయాధిపతులు 1:13 – కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను.
న్యాయాధిపతులు 1:14 – ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబునీకేమి కావలెనని యడిగెను
న్యాయాధిపతులు 1:15 – అందుకామెదీవెన దయ చేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయ చేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.
న్యాయాధిపతులు 1:16 – మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.
న్యాయాధిపతులు 1:17 – యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫ తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.
న్యాయాధిపతులు 1:18 – యూదావంశస్థులు గాజా నుదాని ప్రదేశమును అష్కె లోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.
న్యాయాధిపతులు 1:19 – యెహోవా యూదావంశస్థులకు తోడై యున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించువారికి ఇనుపరథములున్నం దున వారిని వెళ్లగొట్టలేకపోయిరి.
న్యాయాధిపతులు 1:20 – మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను.
Went first against Gibeah
న్యాయాధిపతులు 20:18 – వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.
Furnished to Israel the first judge
న్యాయాధిపతులు 3:9 – ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.
Aided Saul in his wars
1సమూయేలు 11:8 – అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేల మందియు అయిరి.
1సమూయేలు 15:4 – అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.
After Saul’s rebellion appointed to furnish kings to Israel
1సమూయేలు 13:14 – యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.
1సమూయేలు 15:28 – అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీచేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.
1సమూయేలు 16:6 – వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను
1సమూయేలు 16:13 – సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
2సమూయేలు 2:4 – అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
2సమూయేలు 7:16 – నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.
2సమూయేలు 7:17 – తనకు కలిగిన దర్శనమంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను.
The first to submit to David
2సమూయేలు 2:10 – సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేలనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.
Reigned over alone by David seven years and a half
2సమూయేలు 2:11 – దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.
2సమూయేలు 5:5 – హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
Officer placed over by David
1దినవృత్తాంతములు 27:18 – దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారుడైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,
Reproved for tardiness in bringing back David after Absalom’s rebellion
2సమూయేలు 19:11 – రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి ఇశ్రాయేలువారందరు మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు?
2సమూయేలు 19:12 – మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులైయుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను.
2సమూయేలు 19:13 – మరియు అమాశాయొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.
2సమూయేలు 19:14 – అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా నీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నదియొద్దకు రాగా
2సమూయేలు 19:15 – యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యివతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి.
Other tribes jealous of, on account of David
2సమూయేలు 19:41 – ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి మా సహోదరులగు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ యింటివారిని నీవారిని యొర్దాను ఇవతలకు తోడుకొని వచ్చిరని యడుగగా
2సమూయేలు 19:42 – యూదా వారందరు రాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోపమెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి.
2సమూయేలు 20:1 – బెన్యామీనీయుడగు బిక్రి కుమారుడైన షెబయను పనికిమాలినవాడొకడు అచ్చటనుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమును లేదు; ఇశ్రాయేలు వారలారా, మీరందరు మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా
2సమూయేలు 20:2 – ఇశ్రాయేలు వారందరు దావీదును విడిచి బిక్రి కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యొర్దాను నదినుండి యెరూషలేమువరకు యూదావారు రాజును హత్తుకొనిరి.
With Benjamin alone, adhered to the house of David
1రాజులు 12:21 – రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధ ప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగుచేసెను.
The last tribe carried into captivity
2రాజులు 17:18 – కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి యే గోత్రమును శేషించి యుండలేదు.
2రాజులు 17:20 – అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.
2రాజులు 25:21 – బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదా వారు తమ దేశములోనుండి ఎత్తికొనిపోబడిరి.
Out Lord sprang from
మత్తయి 1:3 – యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;
మత్తయి 1:4 – పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను;
మత్తయి 1:5 – నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
మత్తయి 1:6 – యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
మత్తయి 1:7 – సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;
మత్తయి 1:8 – ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;
మత్తయి 1:9 – ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;
మత్తయి 1:10 – హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;
మత్తయి 1:11 – యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.
మత్తయి 1:12 – బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;
మత్తయి 1:13 – జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;
మత్తయి 1:14 – అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను;
మత్తయి 1:15 – ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను;
మత్తయి 1:16 – యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
లూకా 3:23 – యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడు గలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,
లూకా 3:24 – హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,
లూకా 3:25 – మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,
లూకా 3:26 – నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు,
లూకా 3:27 – యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి,
లూకా 3:28 – నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు,
లూకా 3:29 – ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,
లూకా 3:30 – లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు,
లూకా 3:31 – ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,
లూకా 3:32 – దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
లూకా 3:33 – నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
హెబ్రీయులకు 7:14 – మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులనుగూర్చి మోషే యేమియు చెప్పలేదు.
Remarkable persons of
-Achan
యెహోషువ 7:18 – అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.
-Elimelech
రూతు 1:1 – న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను.
రూతు 1:2 – ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.
-Boaz
రూతు 2:1 – నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.
-Obed
రూతు 4:21 – బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.
-Jesse
రూతు 4:22 – యెష్షయి దావీదును కనెను.
1సమూయేలు 16:1 – అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
-David
1సమూయేలు 16:1 – అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
1సమూయేలు 16:13 – సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
-Solomon
1రాజులు 1:32 – అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.
1రాజులు 1:33 – అంతట రాజు మీరు మీ యేలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి
1రాజులు 1:34 – యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను.
1రాజులు 1:35 – ఇశ్రాయేలు వారిమీదను యూదావారి మీదను నేనతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను.
1రాజులు 1:36 – అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను ఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.
1రాజులు 1:37 – యెహోవా నా యేలినవాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;
1రాజులు 1:38 – కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచర గాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొనిరాగా
1రాజులు 1:39 – యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి
-Elihu
1దినవృత్తాంతములు 27:18 – దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారుడైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,
-Pethahiah
నెహెమ్యా 11:24 – మరియు యూదా దేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులనుగూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.
-Bezaleel
నిర్గమకాండము 31:2 – చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.
నిర్గమకాండము 35:30 – మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి;
-Nahshon
సంఖ్యాకాండము 7:12 – మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
-Caleb
సంఖ్యాకాండము 14:24 – నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.
-Absalom
2సమూయేలు 15:1 – ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.
-Elhanan
2సమూయేలు 21:19 – తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటె కఱ్ఱనేతగాని దోనె అంత గొప్పది.
2సమూయేలు 23:24 – ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,
-Adonijah
1రాజులు 1:5 – హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్పరచుకొనెను.
1రాజులు 1:6 – అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.
-Jonathan
2సమూయేలు 21:21 – అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను.
– Kings of Judah (See 1st and 2nd Books of Kings)