Display Topic


Descended from Jacob’s fifth son

ఆదికాండము 30:17 – దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.

ఆదికాండము 30:18 – లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.

Predictions respecting

ఆదికాండము 49:14 – ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.

ఆదికాండము 49:15 – అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.

ద్వితియోపదేశాకాండము 33:18 – జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.

ద్వితియోపదేశాకాండము 33:19 – వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతిబలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు.

Persons selected from

-to number the people

సంఖ్యాకాండము 1:8 – ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు

-to spy out the land

సంఖ్యాకాండము 13:7 – ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;

-to divide the land

సంఖ్యాకాండము 34:26 – ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని,

Strength of, on leaving Egypt

సంఖ్యాకాండము 1:28 – ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 1:29 – ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 2:6 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగువేల నాలుగువందలమంది.

Encamped under the standard of Judah east of the tabernacle

సంఖ్యాకాండము 2:5 – అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.

Next to and under standard of Judah in the journeys of Israel

సంఖ్యాకాండము 10:14 – యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 10:15 – ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి.

Offering of, at the dedication

సంఖ్యాకాండము 7:18 – రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు.

సంఖ్యాకాండము 7:19 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:20 – ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:21 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

సంఖ్యాకాండము 7:22 – ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:23 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.

Families of

సంఖ్యాకాండము 26:23 – ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.

సంఖ్యాకాండము 26:24 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.

Strength of, on entering Canaan

సంఖ్యాకాండము 26:25 – జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;

On Gerizim said amen to the blessings

ద్వితియోపదేశాకాండము 27:12 – బెన్యామీను గోత్రములవారు ప్రజలనుగూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.

Bounds of their inheritance

యెహోషువ 19:17 – నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.

యెహోషువ 19:18 – వారి సరిహద్దు యెజ్రె యేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను

యెహోషువ 19:19 – అబెసు రెమెతు ఏన్గన్నీము

యెహోషువ 19:20 – ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు

యెహోషువ 19:21 – సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు

యెహోషువ 19:22 – అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.

యెహోషువ 19:23 – వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

Assisted Deborah against Sisera

న్యాయాధిపతులు 5:15 – ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.

Officers of, appointed by David

1దినవృత్తాంతములు 27:18 – దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారుడైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,

Officers of, appointed by Solomon

1రాజులు 4:17 – ఇశ్శాఖారు దేశమందు పరూ యహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.

Some of, at David’s coronation

1దినవృత్తాంతములు 12:32 – ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.

Number of warriors belonging to, in David’s time

1దినవృత్తాంతములు 7:2 – తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమశాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.

1దినవృత్తాంతములు 7:5 – మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.

Many of, at Hezekiah’s passover

2దినవృత్తాంతములు 30:18 – ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా

Remarkable persons of

న్యాయాధిపతులు 10:1 – అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.

1రాజులు 15:27 – ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడివేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.