Display Topic
Descended from Abraham’s son, Ishmael
ఆదికాండము 16:15 – తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.
ఆదికాండము 16:16 – హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.
1దినవృత్తాంతములు 1:28 – ఇస్సాకు ఇష్మాయేలు.
Divided into twelve tribes
ఆదికాండము 25:16 – ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.
Heads of tribes
ఆదికాండము 25:13 – ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము
ఆదికాండము 25:14 – మిష్మా దూమానమశ్శా
ఆదికాండము 25:15 – హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
1దినవృత్తాంతములు 1:29 – వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
1దినవృత్తాంతములు 1:30 – మిష్మా దూమా మశ్శా హదదు తేమా
1దినవృత్తాంతములు 1:31 – యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
Called
-Hagarites
1దినవృత్తాంతములు 5:10 – సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
-Hagarenes
కీర్తనలు 83:6 – గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును
-Arabians
యెషయా 13:20 – అది మరెన్నడును నివాసస్థలముగానుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు
Original possessions of
ఆదికాండము 25:18 – వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి యెదుట నివాసమేర్పరచుకొనెను.
Governed by kings
యిర్మియా 25:24 – అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
Dwelt in tents
యెషయా 13:20 – అది మరెన్నడును నివాసస్థలముగానుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు
Rich in cattle
1దినవృత్తాంతములు 5:21 – గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.
Wore ornaments of gold
న్యాయాధిపతులు 8:24 – మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.
Were the merchants of the east
ఆదికాండము 37:25 – వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.
యెహెజ్కేలు 27:20 – దదానువారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
యెహెజ్కేలు 27:21 – అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.
Travelled in large companies or caravans
ఆదికాండము 37:25 – వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.
యోబు 6:19 – సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
Waylaid and plundered travellers
యిర్మియా 3:2 – చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.
Often confederate against Israel
కీర్తనలు 83:6 – గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును
Overcome by
-Gideon
న్యాయాధిపతులు 8:10 – అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.
న్యాయాధిపతులు 8:11 – అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.
న్యాయాధిపతులు 8:12 – జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.
న్యాయాధిపతులు 8:13 – యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను
న్యాయాధిపతులు 8:14 – హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక యౌవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.
న్యాయాధిపతులు 8:15 – అప్పుడతడు సుక్కో తువారియొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీచేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహా రము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి
న్యాయాధిపతులు 8:16 – ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.
న్యాయాధిపతులు 8:17 – మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను.
న్యాయాధిపతులు 8:18 – అతడుమీరు తాబోరులో చంపిన మను ష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా
న్యాయాధిపతులు 8:19 – అతడువారు నా తల్లి కుమారులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చినయెడల
న్యాయాధిపతులు 8:20 – యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందు నని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచినీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
న్యాయాధిపతులు 8:21 – అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.
న్యాయాధిపతులు 8:22 – అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతోనీవు మిద్యా నీయులచేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.
న్యాయాధిపతులు 8:23 – అందుకు గిద్యోనునేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.
న్యాయాధిపతులు 8:24 – మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.
-Reubenites and Gadites
1దినవృత్తాంతములు 5:10 – సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
1దినవృత్తాంతములు 5:18 – రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.
1దినవృత్తాంతములు 5:19 – వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.
1దినవృత్తాంతములు 5:20 – యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను
-Uzziah
2దినవృత్తాంతములు 26:7 – ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.
Sent presents to Solomon
1రాజులు 10:15 – ఇదియు గాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్దనుండియు అరబి రాజుల యొద్దనుండియు దేశాధికారుల యొద్దనుండియు అతనికి చాలా వచ్చుచుండెను.
2దినవృత్తాంతములు 9:14 – అరబీదేశపు రాజులందరును దేశాధిపతులును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొనివచ్చిరి.
Sent flocks to Jehoshaphat
2దినవృత్తాంతములు 17:11 – ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి; అరబీయులును అతనికి ఏడువేల ఏడు వందల గొఱ్ఱపొట్టేళ్లను ఏడువేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచు వచ్చిరి.
Predictions respecting
-to be Numerous
ఆదికాండము 16:10 – మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
ఆదికాండము 17:20 – ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
-to be wild and savage
ఆదికాండము 16:12 – అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరిచేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
-to be Warlike and predatory
ఆదికాండము 16:12 – అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరిచేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
-to be divided into Twelve tribes
ఆదికాండము 17:20 – ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
-to Continue Independent
ఆదికాండము 16:12 – అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరిచేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
-to be A great nation
ఆదికాండము 21:13 – అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.
ఆదికాండము 21:18 – నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీచేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
-to be judged with the nations
యిర్మియా 25:23 – దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువారందరును
యిర్మియా 25:24 – అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
యిర్మియా 25:25 – జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును
– Their glory, &c to be diminished
యెషయా 21:13 – అరేబియానుగూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.
యెషయా 21:14 – తేమాదేశ నివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
యెషయా 21:15 – ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయముచేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవుచున్నారు
యెషయా 21:16 – ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు కూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.
యెషయా 21:17 – కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.
-their Submission to Christ
కీర్తనలు 72:10 – తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబ రాజులును సెబా రాజులును కానుకలు తీసికొనివచ్చెదరు.
కీర్తనలు 72:15 – అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు.
Probably preached to by Paul
గలతీయులకు 1:17 – నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.