Display Topic
Antiquity of
ఆదికాండము 28:18 – పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ఆదికాండము 35:14 – ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.
Consecrates to God’s service
నిర్గమకాండము 30:29 – అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును.
Persons who received
-Prophets
1రాజులు 19:16 – ఇశ్రాయేలు వారిమీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయై యుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
యెషయా 61:1 – ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును
-Priests
నిర్గమకాండము 40:13 – అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను.
నిర్గమకాండము 40:14 – మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి
నిర్గమకాండము 40:15 – వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.
-Kings
న్యాయాధిపతులు 9:8 – చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి
1సమూయేలు 9:16 – ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.
1రాజులు 1:34 – యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను.
Things which received
– Tabernacle, &c
నిర్గమకాండము 30:26 – ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
నిర్గమకాండము 30:27 – బల్లను దాని ఉపకరణములన్నిటిని దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను
నిర్గమకాండము 40:9 – మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
-brazen altar
నిర్గమకాండము 29:36 – ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలినర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.
నిర్గమకాండము 40:10 – దహనబలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును.
-brazen laver
నిర్గమకాండము 40:11 – ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
Those who partook of
-Protected by God
1దినవృత్తాంతములు 16:22 – ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.
కీర్తనలు 105:15 – ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.
-Not to be injured or insulted
1సమూయేలు 24:6 – ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.
1సమూయేలు 26:9 – దావీదు నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?
2సమూయేలు 1:14 – అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి?
2సమూయేలు 1:15 – యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే;
2సమూయేలు 19:21 – అంతట సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా
Oil or ointment for
-Divinely prescribed
నిర్గమకాండము 30:23 – పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధము గల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును
నిర్గమకాండము 30:24 – నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
నిర్గమకాండము 30:25 – వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
-Compounded by the Priests
1దినవృత్తాంతములు 9:30 – యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు.
-An holy anointing oil for ever
నిర్గమకాండము 30:25 – వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
నిర్గమకాండము 30:31 – మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేక తైలమై యుండవలెను;
-Not to be imitated
నిర్గమకాండము 30:32 – దానిని నర శరీరముమీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దానివంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను.
-to be put on No stranger
నిర్గమకాండము 30:33 – దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
-Jews Condemned for imitating
యెహెజ్కేలు 23:41 – ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.
Illustrative of the anointing
-of Christ with the holy spirit
కీర్తనలు 45:7 – నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు.
యెషయా 61:1 – ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును
లూకా 4:18 – ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును
-of Saints with the holy spirit
1యోహాను 2:27 – అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు భోదించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోదించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).