Display Topic


Created by God

ఆదికాండము 1:24 – దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను.

ఆదికాండము 1:25 – దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను.

Divided into

-Clean and fit for Food

లేవీయకాండము 11:21 – అయితే నాలుగు కాళ్లతో చరించుచు నేలగంతులు వేయుటకు కాళ్లమీద తొడలుగల పురుగులన్ని తినవచ్చును.

లేవీయకాండము 11:22 – నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

-unclean and Abominable

లేవీయకాండము 11:23 – నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.

లేవీయకాండము 11:24 – వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.

Mentioned in scripture

-Ant

సామెతలు 6:6 – సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

సామెతలు 30:25 – చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.

-Bee

న్యాయాధిపతులు 14:8 – కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కన బడగా

కీర్తనలు 118:12 – కందిరీగలవలె నామీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

యెషయా 7:18 – ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

-Beetle

లేవీయకాండము 11:22 – నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

-Caterpillar

కీర్తనలు 78:46 – ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.

యెషయా 33:4 – చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు

-Cankerworm

యోవేలు 1:4 – గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసియున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసియున్నవి. పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసియున్నవి.

నహూము 3:15 – అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళిపురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.

నహూము 3:16 – నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగా నున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.

-Earthworm

యోబు 25:6 – మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

మీకా 7:17 – సర్పములాగున వారు మన్ను నాకుదురు, భూమిమీద ప్రాకు పురుగులవలె తమ యిరవులలోనుండి వణకుచు ప్రాకి వత్తురు, మన దేవుడైన యెహోవాయొద్దకు భయపడుచు వత్తురు, నిన్నుబట్టి భయము నొందుదురు.

-Flea

1సమూయేలు 24:14 – ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా?

-fly

నిర్గమకాండము 8:22 – మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు.

ప్రసంగి 10:1 – బుక్కావాని తైలములో చచ్చిన యీగలు పడుటచేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును.

యెషయా 7:18 – ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

-Gnat

మత్తయి 23:24 – అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.

-Grasshopper

లేవీయకాండము 11:22 – నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

న్యాయాధిపతులు 6:5 – వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.

యోబు 39:20 – మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

-Hornet

ద్వితియోపదేశాకాండము 7:20 – మరియు మిగిలినవారును నీ కంటబడక దాగినవారును నశించువరకు నీ దేవుడైన యెహోవా వారిమీదికి పెద్ద కందిరీగలను పంపును.

-Locust

నిర్గమకాండము 10:12 – అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తు దేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయునని చెప్పెను

నిర్గమకాండము 10:13 – మోషే ఐగుప్తు దేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసరజేసెను; ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను.

-bald Locust

లేవీయకాండము 11:22 – నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

-Lice

నిర్గమకాండము 8:16 – అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.

కీర్తనలు 105:31 – ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.

-Maggot

నిర్గమకాండము 16:20 – అయితే వారు మోషే మాటవినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా

-moth

యోబు 4:19 – జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

యోబు 27:18 – పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.

యెషయా 50:9 – ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

-Palmer-worm

యోవేలు 1:4 – గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసియున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసియున్నవి. పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసియున్నవి.

ఆమోసు 4:9 – మరియు మీ సస్యములను ఎండుతెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపుచెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

-Spider

యోబు 8:14 – అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.

సామెతలు 30:28 – బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.

Fed by God

కీర్తనలు 104:25 – అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి.

కీర్తనలు 104:27 – తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి

కీర్తనలు 145:9 – యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.

కీర్తనలు 145:15 – సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.