Display Topic
Forbidden
లేవీయకాండము 19:15 – అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
లేవీయకాండము 19:35 – తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
ద్వితియోపదేశాకాండము 16:19 – నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.
Specially to be avoided towards
-the Poor
నిర్గమకాండము 23:6 – దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు
సామెతలు 22:16 – లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.
సామెతలు 22:22 – దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.
సామెతలు 22:23 – యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును.
-the stranger and fatherless
నిర్గమకాండము 22:21 – పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులైయుంటిరి గదా.
నిర్గమకాండము 22:22 – విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.
ద్వితియోపదేశాకాండము 24:17 – పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.
యిర్మియా 22:3 – యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
-servants
యోబు 31:13 – నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల
యోబు 31:14 – దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?
ద్వితియోపదేశాకాండము 24:14 – నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడియ్యవలెను.
యిర్మియా 22:13 – నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.
Of the least kind, condemned
లూకా 16:10 – మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
God
-Regards
ప్రసంగి 5:8 – ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు.
-Approves Not of
విలాపవాక్యములు 3:35 – మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు
విలాపవాక్యములు 3:36 – ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువుమెచ్చు కార్యములు కావు.
-Abominates
సామెతలు 17:15 – నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు.
సామెతలు 20:10 – వేరు వేరు తూనికె రాళ్లు వేరు వేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
-Hears the cry of Those who suffer
యాకోబు 5:4 – ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
-Provoked to avenge
కీర్తనలు 12:5 – బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Brings a curse
ద్వితియోపదేశాకాండము 27:17 – తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
ద్వితియోపదేశాకాండము 27:19 – పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను.
A bad example leads to
నిర్గమకాండము 23:2 – దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;
Intemperance leads to
సామెతలు 31:5 – త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు
Covetousness leads to
యిర్మియా 6:13 – అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.
యెహెజ్కేలు 22:12 – నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
మీకా 2:2 – వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.
Saints should
-Hate
సామెతలు 29:27 – దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
-Testify against
కీర్తనలు 58:1 – అధిపతులారా, మీరు నీతిననుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చుదురా?
కీర్తనలు 58:2 – లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీచేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.
మీకా 3:8 – నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనై యున్నాను.
మీకా 3:9 – యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
-Bear, patiently
1కొరిందీయులకు 6:7 – ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?
-Take No Vengeance for
మత్తయి 5:39 – నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము.
The wicked
-Deal with
యెషయా 26:10 – దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.
-judge with
కీర్తనలు 82:2 – ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపుదురు?(సెలా.)
ప్రసంగి 3:16 – మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.
హబక్కూకు 1:4 – అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.
-practise, without shame
యిర్మియా 6:13 – అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.
యిర్మియా 6:15 – వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
జెఫన్యా 3:5 – అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు
Punishment of
సామెతలు 11:7 – భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.
సామెతలు 28:8 – వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.
ఆమోసు 5:11 – దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన
ఆమోసు 5:12 – మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్షతోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు.
ఆమోసు 8:5 – తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారా,
ఆమోసు 8:8 – ఇందునుగూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలు నదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపు నదివలె అది అణగిపోవును.
1దెస్సలోనీకయులకు 4:6 – ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.
Exemplified
-Potiphar
ఆదికాండము 39:20 – అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.
-Sons of Samuel
1సమూయేలు 8:3 – వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా
-Ahab
1రాజులు 21:10 – నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టుడి.
1రాజులు 21:15 – నాబోతు రాతి దెబ్బలచేత మరణమాయెనని యెజెబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పెను.
1రాజులు 21:16 – నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనబోయెను.
-Jews
యెషయా 59:14 – న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు.
– Princes &c
దానియేలు 6:4 – అందుకా ప్రధానులును అధిపతులును రాజ్యపాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.
-Judas
మత్తయి 27:4 – నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
-Pilate
మత్తయి 27:24 – పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.
మత్తయి 27:25 – అందుకు ప్రజలందరు వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
మత్తయి 27:26 – అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
– Priests &c
అపోస్తలులకార్యములు 4:3 – వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.
-Festus
అపోస్తలులకార్యములు 24:27 – రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను.