Display Topic


Brought from Sheba

యిర్మియా 6:20 – షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.

Called frankincense

పరమగీతము 4:6 – ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.

పరమగీతము 4:14 – జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

An article of extensive commerce

ప్రకటన 18:13 – దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోదుమలు పశువులు గొఱ్ఱలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు;

Common, not to be offered to God

నిర్గమకాండము 30:9 – మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీయమునైనను దానిమీద పోయకూడదు.

For God’s service mixed with sweet spices

నిర్గమకాండము 25:6 – ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,

నిర్గమకాండము 37:29 – అతడు పరిశుద్ధమైన అభిషేకతైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.

Receipt for mixing

నిర్గమకాండము 30:34 – మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని

నిర్గమకాండము 30:35 – వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.

నిర్గమకాండము 30:36 – దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాని నుంచవలెను. అది మీకు అతిపరిశుద్ధముగా ఉండవలెను.

None but priest to offer

సంఖ్యాకాండము 16:40 – కోరహువలెను అతని సమాజమువలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడినవారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.

ద్వితియోపదేశాకాండము 33:10 – వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు

Offered

-in censers

లేవీయకాండము 10:1 – అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా

సంఖ్యాకాండము 16:17 – మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటిమీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.

సంఖ్యాకాండము 16:46 – అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా

-on the altar of gold

నిర్గమకాండము 30:1 – మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.

నిర్గమకాండము 30:6 – సాక్ష్యపుమందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.

నిర్గమకాండము 40:5 – సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను.

-morning and evening

నిర్గమకాండము 30:7 – అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.

నిర్గమకాండము 30:8 – మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.

-Perpetually

నిర్గమకాండము 30:8 – మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.

-by the High Priest in the Most holy place on the day of atonement

లేవీయకాండము 16:12 – యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరిమళధూప చూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు

లేవీయకాండము 16:13 – ఆ ధూపము మేఘమువలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను.

-with fire from off the altar of burnt offering

లేవీయకాండము 16:12 – యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరిమళధూప చూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు

సంఖ్యాకాండము 16:46 – అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా

Offering of, allotted to the priests

లూకా 1:9 – యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను.

The Jews prayed at time of offering

లూకా 1:10 – ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా

Designed for atonement

సంఖ్యాకాండము 16:46 – అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా

సంఖ్యాకాండము 16:47 – మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

Put on meat offerings

లేవీయకాండము 2:1 – ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి

లేవీయకాండము 2:2 – యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులోనుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.

లేవీయకాండము 2:15 – అది నైవేద్య రూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను.

లేవీయకాండము 2:16 – అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

లేవీయకాండము 6:15 – అతడు నైవేద్య తైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలోనుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను.

Levites had charge of

1దినవృత్తాంతములు 9:29 – మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి అధీనము చేయబడెను.

Used in idolatrous worship

యిర్మియా 48:35 – ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు.

The Jews

-Not accepted in offering, on account of Sin

యెషయా 1:13 – మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చజాలను.

యెషయా 66:3 – ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.

-offered, to idols on Altars of brick

యెషయా 65:3 – వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెలమీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు.

-punished for offering, to idols

2దినవృత్తాంతములు 34:25 – వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమచేతి పనులవలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఈ స్థలముమీద మితిలేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపినవానికి ఈ వార్త తెలుపుడి.

Nadab and Abihu destroyed for offering, with strange fire

లేవీయకాండము 10:1 – అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా

లేవీయకాండము 10:2 – యెహోవా సన్నిధినుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతిబొందిరి.

Korah and his company punished for offering

సంఖ్యాకాండము 16:16 – మరియు మోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.

సంఖ్యాకాండము 16:17 – మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటిమీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.

సంఖ్యాకాండము 16:18 – కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.

సంఖ్యాకాండము 16:19 – కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.

సంఖ్యాకాండము 16:20 – అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.

సంఖ్యాకాండము 16:21 – క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా

సంఖ్యాకాండము 16:22 – వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజముమీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.

సంఖ్యాకాండము 16:23 – అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 16:24 – కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.

సంఖ్యాకాండము 16:25 – అప్పుడు మోషే లేచి దాతాను అబీరాములయొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.

సంఖ్యాకాండము 16:26 – అతడు ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.

సంఖ్యాకాండము 16:27 – కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.

సంఖ్యాకాండము 16:28 – మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.

సంఖ్యాకాండము 16:29 – మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.

సంఖ్యాకాండము 16:30 – అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.

సంఖ్యాకాండము 16:31 – అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను.

సంఖ్యాకాండము 16:32 – భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.

సంఖ్యాకాండము 16:33 – వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.

సంఖ్యాకాండము 16:34 – వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.

సంఖ్యాకాండము 16:35 – మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.

Uzziah punished for offering

2దినవృత్తాంతములు 26:16 – అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా

2దినవృత్తాంతములు 26:17 – యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికిపోయిరి.

2దినవృత్తాంతములు 26:18 – వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధ స్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా

2దినవృత్తాంతములు 26:19 – ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తినిచేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునేయున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.

2దినవృత్తాంతములు 26:20 – ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికివెళ్లుటకు తానును త్వరపడెను.

2దినవృత్తాంతములు 26:21 – రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.

Presented to Christ by the wise men

మత్తయి 2:11 – తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.

Illustrative of

-the merits of Christ

ప్రకటన 8:3 – మరియు సువర్ణ ధూపార్తిచేత పట్టుకొనియున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.

ప్రకటన 8:4 – అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూతచేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.

-prayer

కీర్తనలు 141:2 – నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

మలాకీ 1:11 – తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ప్రకటన 5:8 – ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.