Display Topic


Was necessary to his mediatorial office

1తిమోతి 2:5 – దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

హెబ్రీయులకు 2:17 – కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

గలతీయులకు 4:4 – అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,

గలతీయులకు 4:5 – మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

1కొరిందీయులకు 15:21 – మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

రోమీయులకు 6:15 – అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు.

రోమీయులకు 6:19 – మీ శరీర బలహీనతనుబట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

Is proved by his

– Conception in the Virgin’s womb

మత్తయి 1:18 – యేసుక్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

లూకా 1:31 – ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

-birth

మత్తయి 1:16 – యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

మత్తయి 1:25 – ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

మత్తయి 2:2 – యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

లూకా 2:7 – తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

లూకా 2:11 – దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు

-Partaking of flesh and blood

యోహాను 1:14 – ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

హెబ్రీయులకు 2:14 – కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును,

-Having A human soul

మత్తయి 26:38 – అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి

లూకా 23:46 – అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీచేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

అపోస్తలులకార్యములు 2:31 – క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను.

-circumcision

లూకా 2:21 – ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.

-Increase in Wisdom and stature

లూకా 2:52 – యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లు చుండెను.

-Weeping

లూకా 19:41 – ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

యోహాను 11:35 – యేసు కన్నీళ్లు విడిచెను.

-Hungering

మత్తయి 4:2 – నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా

మత్తయి 21:18 – ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.

-Thirsting

యోహాను 4:7 – సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను.

యోహాను 19:28 – అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను.

-Sleeping

మత్తయి 8:24 – అంతట సముద్రముమీద తుపాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా

మార్కు 4:38 – ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవుచున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి.

-Being subject to weariness

యోహాను 4:6 – అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావియొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.

-Being A Man of sorrows

యెషయా 53:3 – అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.

యెషయా 53:4 – నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు.

లూకా 22:44 – అప్పుడు పరలోకమునుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.

యోహాను 11:33 – ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచితిరని అడుగగా,

యోహాను 12:27 – ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;

-Being buffeted

మత్తయి 26:67 – అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;

లూకా 22:64 – యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,

-Enduring indignities

లూకా 23:11 – హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరల పంపెను.

-Being scourged

మత్తయి 27:26 – అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

లూకా 22:64 – యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,

-Being nailed to the cross

కీర్తనలు 22:16 – కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

లూకా 23:33 – వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.

-death

యోహాను 19:30 – యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.

-Side Being pierced

యోహాను 19:34 – సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

-burial

మత్తయి 27:59 – యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి

మత్తయి 27:60 – తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

మార్కు 15:46 – అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.

-resurrection

అపోస్తలులకార్యములు 3:15 – మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

2తిమోతి 2:8 – నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము.

Was like our own in all things except sin

అపోస్తలులకార్యములు 3:22 – మోషే యిట్లనెను ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.

ఫిలిప్పీయులకు 2:7 – మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

ఫిలిప్పీయులకు 2:8 – మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

హెబ్రీయులకు 2:17 – కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

Was without sin

హెబ్రీయులకు 7:26 – పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.

హెబ్రీయులకు 7:28 – ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.

1యోహాను 3:5 – పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.

1పేతురు 2:22 – ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

హెబ్రీయులకు 4:15 – మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

యోహాను 18:38 – అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులయొద్దకు తిరిగివెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;

యోహాను 8:46 – నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

Was submitted to the evidence of the senses

లూకా 24:39 – నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి

యోహాను 20:27 – తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నాచేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

1యోహాను 1:1 – జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మాచేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.

1యోహాను 1:2 – ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము.

Was of the seed of

-the Woman

ఆదికాండము 3:15 – మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.

యెషయా 7:4 – భద్రము సుమీ, నిమ్మళించుము; పొగ రాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము.

యిర్మియా 31:22 – నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.

లూకా 1:31 – ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

గలతీయులకు 4:4 – అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,

-Abraham

ఆదికాండము 22:18 – మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

గలతీయులకు 3:16 – అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులనుగూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకనిగూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు

హెబ్రీయులకు 2:16 – ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.

-David

2సమూయేలు 7:12 – నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.

2సమూయేలు 7:16 – నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

కీర్తనలు 89:35 – అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు

కీర్తనలు 89:36 – చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు

యిర్మియా 23:5 – యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

మత్తయి 22:42 – క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.

మార్కు 10:47 – ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలువేయ మొదలుపెట్టెను.

అపోస్తలులకార్యములు 2:30 – అతని సమాధి నేటివరకు మనమధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి

అపోస్తలులకార్యములు 13:23 – అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.

రోమీయులకు 1:3 – మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగుగాక,

Genealogy of

మత్తయి 1:1 – అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.

మత్తయి 1:2 – అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;

మత్తయి 1:3 – యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;

మత్తయి 1:4 – పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను;

మత్తయి 1:5 – నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;

మత్తయి 1:6 – యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.

మత్తయి 1:7 – సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;

మత్తయి 1:8 – ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;

మత్తయి 1:9 – ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;

మత్తయి 1:10 – హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;

మత్తయి 1:11 – యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

మత్తయి 1:12 – బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;

మత్తయి 1:13 – జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;

మత్తయి 1:14 – అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను;

మత్తయి 1:15 – ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను;

మత్తయి 1:16 – యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

మత్తయి 1:17 – ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.

లూకా 3:23 – యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడు గలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,

లూకా 3:24 – హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,

లూకా 3:25 – మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,

లూకా 3:26 – నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు,

లూకా 3:27 – యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి,

లూకా 3:28 – నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు,

లూకా 3:29 – ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,

లూకా 3:30 – లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు,

లూకా 3:31 – ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,

లూకా 3:32 – దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,

లూకా 3:33 – నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,

లూకా 3:34 – యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు,

లూకా 3:35 – నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,

లూకా 3:36 – షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,

లూకా 3:37 – లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు,

లూకా 3:38 – కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.

Attested by himself

మత్తయి 8:20 – అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.

మత్తయి 16:13 – యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా

Confession of, a test of belonging to God

యోహాను 4:2 – ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగివెళ్లెను.

Acknowledged by men

మార్కు 6:3 – ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.

యోహాను 7:27 – అయినను ఈయన ఎక్కడివాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.

యోహాను 19:5 – ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 2:22 – ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.

Denied by Antichrist

1యోహాను 4:3 – యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.

2యోహాను 1:7 – యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు.