Display Topic


Antiquity of

ఆదికాండము 12:1 – యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

ఆదికాండము 19:3 – అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

Deep and solid foundations required for

మత్తయి 7:24 – కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

లూకా 6:48 – వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను.

Sometimes built without foundation

మత్తయి 7:26 – మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

లూకా 6:49 – అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను

Built of

-Clay

యోబు 4:19 – జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

-Bricks

నిర్గమకాండము 1:11 – కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టిపనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

నిర్గమకాండము 1:12 – అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయులయెడల అసహ్యపడిరి.

నిర్గమకాండము 1:13 – ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;

నిర్గమకాండము 1:14 – వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

యెషయా 9:10 – వారు ఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కినరాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.

-stone and wood

లేవీయకాండము 14:40 – యాజకుని సెలవుచొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.

లేవీయకాండము 14:42 – వేరు రాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.

హబక్కూకు 2:11 – గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి.

-hewn or cut stone

యెషయా 9:10 – వారు ఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కినరాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.

ఆమోసు 5:11 – దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన

In cities, built in streets

ఆదికాండము 19:2 – నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి

యెహోషువ 2:19 – నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగు దుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.

Often built on city walls

యెహోషువ 2:15 – ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.

2కొరిందీయులకు 11:33 – అప్పుడు నేను కిటికీగుండ గోడమీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.

The flat roofs of

-Surrounded with battlements

ద్వితియోపదేశాకాండము 22:8 – క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవడైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.

-had Often booths on them

2సమూయేలు 16:22 – కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.

నెహెమ్యా 8:16 – ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ యిండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.

సామెతలు 2:19 – దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల

-had Often Idolatrous Altars on them

2రాజులు 23:12 – మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.

యిర్మియా 19:13 – యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులును ఆ తోఫెతు స్థలమువలెనే అపవిత్రములగును; ఏ యిండ్లమీద జనులు ఆకాశ సమూహమను దేవతలకు ధూపము వేయుదురో, లేక అన్యదేవతలకు పానార్పణముల నర్పించుదురో ఆ యిండ్లన్నిటికి ఆలాగే జరుగును.

జెఫన్యా 1:5 – మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టియు, బయలుదేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.

-Used for Drying Flax

యెహోషువ 2:6 – అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.

-Used for Exercise

2సమూయేలు 11:2 – ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.

దానియేలు 4:29 – పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా

-Used for Devotion

అపోస్తలులకార్యములు 10:9 – మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెమీది కెక్కెను.

-Used for Making Proclamations

లూకా 12:3 – అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును.

-Used for secret conference

1సమూయేలు 9:25 – పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీదనుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడుచుండెను.

1సమూయేలు 9:26 – మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దెమీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి

-Resorted to in grief

యెషయా 15:3 – తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయుదురు.

యిర్మియా 48:38 – మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు.

-Often Covered with week Grass

కీర్తనలు 129:6 – వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగకమునుపే అది వాడిపోవును

కీర్తనలు 129:7 – కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు.

Accessible from the outside

మత్తయి 24:17 – మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకు దిగకూడదు;

The courts of, large and used as apartments

ఎస్తేరు 1:5 – ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను.

లూకా 5:19 – జనులు గుంపుకూడి యుండినందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక, ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.

Entered by a gate or door

ఆదికాండము 43:19 – వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి

నిర్గమకాండము 12:22 – మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువుకమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలువెళ్లకూడదు.

లూకా 16:20 – లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటివాకిట పడియుండి

అపోస్తలులకార్యములు 10:17 – పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

Doors of, low and small for safety

సామెతలు 17:19 – కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.

Doors of, how fastened

2సమూయేలు 13:18 – కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.

పరమగీతము 5:5 – నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నాచేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను

లూకా 11:7 – అతడు లోపలనే యుండి నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?

Admission to, gained by knocking at the door

అపోస్తలులకార్యములు 12:13 – అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.

ప్రకటన 3:20 – ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

Walls of, plastered

లేవీయకాండము 14:42 – వేరు రాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.

లేవీయకాండము 14:43 – అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.

Serpents often lodged in walls of

ఆమోసు 5:19 – ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.

Custom of fastening nails, &c, in walls of, alluded to

ప్రసంగి 12:11 – జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.

యెషయా 22:23 – దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును.

Had often several stories

యెహెజ్కేలు 41:16 – మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్లకూర్పుండెను

అపోస్తలులకార్యములు 20:9 – అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయినవాడై యెత్తబడెను

Divided into apartments

ఆదికాండము 43:30 – అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.

యెషయా 26:20 – నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలివచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

Apartments of, were often

-large and airy

యిర్మియా 22:14 – వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో1 రంగువేయుచు నున్నాడే;

-Ceiled and painted

యిర్మియా 22:14 – వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో1 రంగువేయుచు నున్నాడే;

హగ్గయి 1:4 – ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?

-Inlaid with Ivory

1రాజులు 22:39 – అహాబు చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

ఆమోసు 3:15 – చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.

-Hung with rich tapestries

ఎస్తేరు 1:6 – అక్కడ ధవళ ధూమ్ర వర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను.

-Warmed with fires

యిర్మియా 36:22 – తొమ్మిదవ మాసమున రాజు శీతకాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.

యోహాను 18:18 – అప్పుడు చలివేయుచున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను.

Upper apartments of, the best, and used for entertainments

మార్కు 14:15 – అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.

Had often detached apartments for secrecy and for strangers

న్యాయాధిపతులు 3:20 – ఏహూదు అతని దగ్గ రకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదునీతో నేను చెప్ప వలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను.

న్యాయాధిపతులు 3:21 – అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.

న్యాయాధిపతులు 3:22 – పడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వుకత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుకనుండి బయటికి వచ్చి యుండెను.

న్యాయాధిపతులు 3:23 – అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపువేసి గడియ పెట్టెను.

2రాజులు 4:10 – కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీపస్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బస చేయవచ్చునని చెప్పెను.

2రాజులు 4:11 – ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.

2రాజులు 9:2 – అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడనున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరుల మధ్యనుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొనిపోయి

2రాజులు 9:3 – తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారిపొమ్ము.

Lighted by windows

1రాజులు 7:4 – మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.

Street windows of, high and dangerous

2రాజులు 1:2 – అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా

2రాజులు 9:30 – యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగుపూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా

2రాజులు 9:33 – దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను.

అపోస్తలులకార్యములు 20:9 – అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయినవాడై యెత్తబడెను

Of the rich

-great

యెషయా 5:9 – నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.

ఆమోసు 6:11 – ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు

2తిమోతి 2:20 – గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును.

-Goodly

ద్వితియోపదేశాకాండము 8:12 – మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,

-pleasant

యెహెజ్కేలు 26:12 – వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.

మీకా 2:9 – వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డలయొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొనిపోవుదురు.

Of brick or clay

-Plastered

యెహెజ్కేలు 13:10 – సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

యెహెజ్కేలు 13:11 – ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.

-Easily Broken through

యోబు 24:16 – చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు

యెహెజ్కేలు 12:5 – వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము

-Often swept away by torrents

యెహెజ్కేలు 13:13 – ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నా కోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,

యెహెజ్కేలు 13:14 – దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.

When finished were usually dedicated

ద్వితియోపదేశాకాండము 20:5 – మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

కీర్తనలు 30:1 – యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనియ్యక నీవు నన్నుద్ధరించియున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.

For summer residence

ఆమోసు 3:15 – చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.

Liable to leprosy

లేవీయకాండము 14:34 – నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసినయెడల

లేవీయకాండము 14:35 – ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చి నా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియచెప్పవలెను.

లేవీయకాండము 14:36 – అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగా చేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.

లేవీయకాండము 14:37 – అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చదాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల

లేవీయకాండము 14:38 – యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసియుంచవలెను.

లేవీయకాండము 14:39 – ఏడవనాడు యాజకుడు తిరిగివచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైనయెడల

లేవీయకాండము 14:40 – యాజకుని సెలవుచొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.

లేవీయకాండము 14:41 – అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారబోసి

లేవీయకాండము 14:42 – వేరు రాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.

లేవీయకాండము 14:43 – అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.

లేవీయకాండము 14:44 – అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.

లేవీయకాండము 14:45 – కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.

లేవీయకాండము 14:46 – మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 14:47 – ఆ యింట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.

లేవీయకాండము 14:48 – యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపకపోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.

లేవీయకాండము 14:49 – ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని

లేవీయకాండము 14:50 – పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి

లేవీయకాండము 14:51 – ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షిరక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 14:52 – అట్లు ఆ పక్షిరక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరిహారార్థబలి అర్పింపవలెను.

లేవీయకాండము 14:53 – అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.

Not to be coveted

నిర్గమకాండము 20:17 – నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.

మీకా 2:2 – వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.

Were hired

అపోస్తలులకార్యములు 28:30 – పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి

Were mortgaged

నెహెమ్యా 5:3 – మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువపెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందుమనిరి.

Were sold

అపోస్తలులకార్యములు 4:34 – భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.

Law respecting the sale of

లేవీయకాండము 25:29 – ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సరదినములోనే దాని విడిపించుకొనవచ్చును.

లేవీయకాండము 25:30 – అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తర తరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.

లేవీయకాండము 25:31 – చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగిపోవును.

లేవీయకాండము 25:32 – అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.

లేవీయకాండము 25:33 – లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపాదించినయెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును.

Of criminals, desolated

దానియేలు 2:5 – రాజు నేను దాని మరచిపోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయబడును.

దానియేలు 3:29 – కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములోగాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

Desolation of, threatened as a punishment

యెషయా 5:9 – నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.

యెషయా 13:16 – వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు.

యెషయా 13:21 – నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును

యెషయా 13:22 – వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.

యెహెజ్కేలు 16:41 – వారు నీ యిండ్లను అగ్నిచేత కాల్చుదురు, అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు, ఈలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక యుందువు;

యెహెజ్కేలు 26:12 – వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.

Often broken down to repair city walls before sieges

యెషయా 22:10 – యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి

Illustrative

-of the body

యోబు 4:19 – జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

-of the grave

యోబు 30:23 – మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.

-of the Church

హెబ్రీయులకు 3:6 – అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

1పేతురు 2:5 – యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

– Of saints’ inheritance

యోహాను 14:2 – నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

– (On sand,) of the delusive hope of hypocrites

మత్తయి 7:24 – కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

మత్తయి 7:25 – వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

– (On a rock,) of the hope of saints

మత్తయి 7:24 – కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

మత్తయి 7:25 – వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

– (Insecurity of,) of earthly trust

మత్తయి 6:19 – భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

మత్తయి 6:20 – పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

– (Building of,) of great prosperity

యెషయా 65:21 – జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.

యెహెజ్కేలు 28:26 – వారు అందులో నిర్ఛయముగా నివసించి యిండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు, వారి చుట్టు ఉండి వారిని తిరస్కరించుచు వచ్చినవారికందరికి నేను శిక్షవిధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

– (Built and not inhabited,) of calamity

ద్వితియోపదేశాకాండము 28:30 – స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువు గాని దాని పండ్లు తినవు.

ఆమోసు 5:11 – దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన

జెఫన్యా 1:13 – వారి ఆస్తి దోపుడుసొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు.

– (To inhabit those, built by others,) of abundant feelings

ద్వితియోపదేశాకాండము 6:10 – నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను

ద్వితియోపదేశాకాండము 6:11 – నీవు నింపని మంచి ద్రవ్యములచేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తిపొందినప్పుడు