Display Topic


Endued with strength by God

యోబు 39:19 – గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?

Described as

-Strong

కీర్తనలు 33:17 – రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింపజాలదు.

కీర్తనలు 147:10 – గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు.

-Swift

యెషయా 30:16 – అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

యిర్మియా 4:13 – మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగము గలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితివిు.

హబక్కూకు 1:8 – వారి గుఱ్ఱములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.

-Fearless

యోబు 39:20 – మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

యోబు 39:22 – అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.

-Fierce and impetuous

యోబు 39:21 – మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.

యోబు 39:24 – ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.

-Warlike in disposition

యోబు 39:21 – మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.

యిర్మియా 8:6 – నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేకపోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.

-Sure footed

యెషయా 63:13 – తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించినవాడేడి? యనుకొనిరి

Want of understanding in, alluded to

కీర్తనలు 32:9 – బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.

Hard hoofs of, alluded to

యెషయా 5:28 – వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కుపెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును

Loud snorting of, alluded to

యిర్మియా 8:16 – దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు.

యోబు 39:20 – మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

Colours of, mentioned

-White

జెకర్యా 1:8 – రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజిచెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.

జెకర్యా 6:3 – మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.

ప్రకటన 6:2 – మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను.

-Black

జెకర్యా 6:2 – మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,

జెకర్యా 6:6 – నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.

ప్రకటన 6:5 – ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.

-red

జెకర్యా 1:8 – రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజిచెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.

జెకర్యా 6:2 – మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,

ప్రకటన 6:4 – అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను

-Speckled

జెకర్యా 1:8 – రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజిచెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.

-Bay

జెకర్యా 6:3 – మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.

జెకర్యా 6:7 – బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోకమందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.

-Grisled

జెకర్యా 6:3 – మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.

జెకర్యా 6:6 – నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.

-Pale or ash colour

ప్రకటన 6:8 – అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను (లేక తెగులువలనను) భూమిలోనుండి క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికియ్యబడెను

Fed on grain and herbs

1రాజులు 4:28 – మరియు గుఱ్ఱములును పాటుపశువులును ఉన్న ఆ యా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.

1రాజులు 18:5 – అహాబు దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.

Used for

-Mounting calvary

నిర్గమకాండము 14:9 – ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.

1సమూయేలు 13:5 – ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.

-Drawing chariots

మీకా 1:13 – లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలువారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును.

జెకర్యా 6:2 – మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,

-bearing burdens

ఎజ్రా 2:66 – వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,

నెహెమ్యా 7:68 – వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును

-Hunting

యోబు 39:18 – అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.

– Conveying posts, &c

2రాజులు 9:17 – యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచియుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.

2రాజులు 9:18 – కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగిరాక నిలిచెనని సమాచారము తెలిపెను.

2రాజులు 9:19 – రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.

ఎస్తేరు 8:10 – రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీదులను వారిచేత పంపెను.

Kings and princes rode on

ఎస్తేరు 6:8 – రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుఱ్ఱమును రాజు తన తలమీద ఉంచుకొను రాజకీరీటమును ఒకడు తీసికొని రాగా

ఎస్తేరు 6:9 – ఘనులైన రాజుయొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును పట్టుకొని, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుఱ్ఱముమీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను.

ఎస్తేరు 6:10 – అందుకు రాజు నీవు చెప్పినప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, రాజు గుమ్మమునొద్ద కూర్చునియున్న యూదుడైన మొర్దెకైకి ఆలాగుననే చేయుము; నీవు చెప్పినదానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను.

ఎస్తేరు 6:11 – ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను.

యెహెజ్కేలు 23:23 – గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించుచున్నాను.

Governed by bit and bridle

కీర్తనలు 32:9 – బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.

యాకోబు 3:3 – గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెము పెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

Urged on by whips

సామెతలు 26:3 – గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.

Adorned with bells on the neck

జెకర్యా 14:20 – ఆ దినమున గుఱ్ఱముల యొక్క కళ్లెములమీద యెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయబడును; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును.

Numbers of, kept for war

యిర్మియా 51:27 – దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱములను దానిమీదికి రప్పించుడి.

యెహెజ్కేలు 26:10 – అతనికి గుఱ్ఱములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి యెగరగొట్టగా అది నిన్ను కమ్మును, బీటసందులుగల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతుల యొక్కయు చక్రములయొక్కయు రథములయొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును.

Prepared and trained for war

సామెతలు 21:31 – యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము.

In battle protected by armour

యిర్మియా 46:4 – గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.

Vanity of trusting to

కీర్తనలు 33:17 – రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింపజాలదు.

ఆమోసు 2:15 – విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.

The Jews

-Forbidden to multiply

ద్వితియోపదేశాకాండము 17:16 – అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.

-Imported from Egypt

1రాజులు 10:28 – సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొని తెప్పించిరి.

1రాజులు 10:29 – వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.

– Multiplied in Solomon’s reign

1రాజులు 4:26 – సొలొమోను రథములకు నలువదివేల గుఱ్ఱపు శాలలును రౌతులకు పండ్రెండు వేల గుఱ్ఱములును ఉండెను.

-Condemned for Multiplying

యెషయా 2:7 – వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

-Not to Trust in

హోషేయ 14:3 – అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమికమీదట మాచేతిపనితో చెప్పము; తండ్రిలేనివారియెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.

-Condemned for Trusting to

యెషయా 30:16 – అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

యెషయా 31:3 – ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.

-Brought back many, from Babylon

ఎజ్రా 2:66 – వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,

Notice of early traffic in

ఆదికాండము 47:17 – ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.

Sold in fairs and markets

యెహెజ్కేలు 27:14 – తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;

ప్రకటన 18:13 – దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోదుమలు పశువులు గొఱ్ఱలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు;

Often suffered

-from blindness

జెకర్యా 12:4 – ఇదే యెహోవా వాక్కు ఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదావారిమీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును.

-from plague

జెకర్యా 14:15 – ఆలాగుననే గుఱ్ఱముల మీదను కంచరగాడిదల మీదను ఒంటెల మీదను గార్దభముల మీదను దండుపాళెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్లు పడును.

-from murrain

నిర్గమకాండము 9:3 – ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.

-from bites of serpents

ఆదికాండము 49:17 – దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

-in the hoof from prancing

న్యాయాధిపతులు 5:22 – గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.

-in Battle

యిర్మియా 51:21 – నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టుచున్నాను.

హగ్గయి 2:22 – రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనముచేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.

Dedicated to the sun by idolaters

2రాజులు 23:11 – ఇదియుగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను.

Illustrative of

-beauty of the Church

పరమగీతము 1:9 – నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.

జెకర్యా 10:3 – నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వములవంటి వారినిగా చేయును.

-glorious and triumphant deliverance of the Church

యెషయా 63:13 – తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించినవాడేడి? యనుకొనిరి

-A dull headstrong disposition

కీర్తనలు 32:9 – బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.

-Impetuosity of the Wicked in Sin

యిర్మియా 8:6 – నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేకపోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.