Display Topic
Distinguished from murder
నిర్గమకాండము 21:13 – అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.
నిర్గమకాండము 21:14 – అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.
సంఖ్యాకాండము 35:16 – ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.
సంఖ్యాకాండము 35:17 – ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
సంఖ్యాకాండము 35:18 – మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
సంఖ్యాకాండము 35:19 – హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.
సంఖ్యాకాండము 35:20 – వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను.
సంఖ్యాకాండము 35:21 – నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.
సంఖ్యాకాండము 35:25 – అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధతైలముతో అభిషేకింపబడిన ప్రధానయాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
Justifiable, described as
-Killing Persons Condemned by law
ఆదికాండము 9:6 – నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
నిర్గమకాండము 35:2 – ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును.
లేవీయకాండము 24:16 – యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
-Killing A Thief in the night
నిర్గమకాండము 22:2 – దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధముండదు.
-Killing Enemies in Battle
సంఖ్యాకాండము 31:7 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి.
సంఖ్యాకాండము 31:8 – చంపబడిన యితరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.
-Killing A manslayer by next of kin
సంఖ్యాకాండము 35:27 – నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.
Unjustifiable, described as
-Killing without enmity
సంఖ్యాకాండము 35:22 – అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
-Killing without Lying in wait
నిర్గమకాండము 21:13 – అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.
సంఖ్యాకాండము 35:22 – అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
-Killing by accident
సంఖ్యాకాండము 35:23 – దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు వానిమీద పగపట్టలేదు, వానికి హాని చేయగోరలేదు.
ద్వితియోపదేశాకాండము 19:5 – పొరబాటున వాని చంపినయెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తనచేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయినయెడల, వాడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక
The avenger of blood might slay those guilty of unjustifiable
సంఖ్యాకాండము 35:19 – హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.
సంఖ్యాకాండము 35:27 – నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.
Protection afforded in the cities of refuge to those guilty of unjustified
సంఖ్యాకాండము 35:11 – ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను.
సంఖ్యాకాండము 35:15 – పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమైయుండును.
Confinement in the city of refuge the punishment for unjustifiable
సంఖ్యాకాండము 35:25 – అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధతైలముతో అభిషేకింపబడిన ప్రధానయాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
సంఖ్యాకాండము 35:28 – ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును.