Display Topic


Used for idolatrous worship

1రాజులు 11:7 – సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.

1రాజులు 11:8 – తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.

God sometimes worshipped on

1సమూయేలు 9:12 – అందుకు వారు ఇదిగో అతడు మీ యెదుటనేయున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక

1రాజులు 3:2 – ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి.

1రాజులు 3:4 – గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.

2దినవృత్తాంతములు 33:17 – అయినను జనులు ఉన్నత స్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి.

Mentioned in scripture

-Gibeon

1రాజులు 3:4 – గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.

-Arnon

సంఖ్యాకాండము 21:28 – హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.

-Baal

సంఖ్యాకాండము 22:41 – మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నత స్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.

-Tophet

యిర్మియా 7:31 – నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

-Bamah

యెహెజ్కేలు 20:29 – మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నత స్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది.

-Aven

హోషేయ 10:8 – ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్లచెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరుగును, పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మామీద పడుడనియు వారు చెప్పుదురు.

Adorned with tapestry

యెహెజ్కేలు 16:16 – మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి, వాటిమీద పండుకొని వ్యభిచారము చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగకూడనివి, అట్టివియు నిక జరుగవు.

Surrounded with groves

1రాజులు 14:23 – ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతా స్తంభములను ఉంచిరి.

Built by

-Solomon

1రాజులు 11:7 – సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.

-Jeroboam

1రాజులు 12:31 – మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.

-Jehoram

2దినవృత్తాంతములు 21:11 – మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను.

-Ahaz

2దినవృత్తాంతములు 28:25 – యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

-Manasseh

2రాజులు 21:3 – తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను.

2దినవృత్తాంతములు 33:3 – ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగికట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను.

-people of Judah

1రాజులు 14:23 – ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతా స్తంభములను ఉంచిరి.

-people of Israel

2రాజులు 17:9 – మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని

Priests ordained for

1రాజులు 12:32 – మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.

1రాజులు 13:33 – ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.

Sacrifices and incense offered to idols upon

2రాజులు 12:3 – అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.

2రాజులు 16:4 – మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

Enchantments used upon

సంఖ్యాకాండము 23:3 – మరియు బిలాము బాలాకుతో బలిపీఠముమీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.

సంఖ్యాకాండము 24:1 – ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటివలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.

Of the Canaanites to be destroyed

సంఖ్యాకాండము 33:52 – ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి

The Jews

-built, in their Cities

2రాజులు 17:9 – మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని

-built, in all their streets

యెహెజ్కేలు 16:24 – నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలిపీఠములను ఏర్పరచితివి,

యెహెజ్కేలు 16:31 – నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్య చేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి

-Condemned for Building

యెహెజ్కేలు 16:23 – ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ; యిదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 16:24 – నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలిపీఠములను ఏర్పరచితివి,

యెహెజ్కేలు 16:25 – ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీయొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.

యెహెజ్కేలు 16:26 – మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి.

యెహెజ్కేలు 16:27 – కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను.

యెహెజ్కేలు 16:28 – అంతటితో తృప్తినొందక అష్షూరు వారితోను నీవు వ్యభిచరించితివి, వారితోకూడి జారత్వము చేసినను తృప్తినొందకపోతివి.

యెహెజ్కేలు 16:29 – కనాను దేశము మొదలుకొని కల్దీయదేశమువరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు.

యెహెజ్కేలు 16:30 – నీ హృదయమెంత బలహీనమాయెను! సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటిని జరిగించుటకై

యెహెజ్కేలు 16:31 – నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్య చేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి

యెహెజ్కేలు 16:32 – అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా?

యెహెజ్కేలు 16:33 – నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.

యెహెజ్కేలు 16:34 – నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీవెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమ్మిచ్చుటయు లేదు, నీవే యెదురు జీతమిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 16:35 – కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము

-Provoked God with

1రాజులు 14:22 – యూదావారు యెహోవా దృష్టికి కీడుచేసి తమ పితరులు చేసినదానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి.

1రాజులు 14:23 – ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతా స్తంభములను ఉంచిరి.

కీర్తనలు 78:58 – వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి.

-threatened with Destruction of

లేవీయకాండము 26:30 – నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

-punished for

2రాజులు 17:11 – తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనుల వాడుకచొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి

2రాజులు 17:18 – కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి యే గోత్రమును శేషించి యుండలేదు.

Destroyed

-Asa, partially

2దినవృత్తాంతములు 14:3 – అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి

2దినవృత్తాంతములు 14:5 – ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.

2దినవృత్తాంతములు 15:17 – ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.

-Jehoshaphat

2దినవృత్తాంతములు 17:6 – యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడై ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలోనుండి తీసివేసెను.

-Hezekiah

2రాజులు 18:4 – ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి

2దినవృత్తాంతములు 31:1 – ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదా దేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశములయందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగివెళ్లిరి

-Josiah

2రాజులు 23:8 – యూదా పట్టణములోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమ పార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను.

2దినవృత్తాంతములు 34:3 – తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి, యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను.

Not removed

-Jehoash

2రాజులు 12:3 – అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.

-Amaziah

2రాజులు 14:4 – అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు; జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.

-Azariah

2రాజులు 15:4 – ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు; ఉన్నత స్థలములయందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.

-Jotham

2రాజులు 15:35 – అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలుల నర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వారమును కట్టించెను.