Display Topic
Antiquity of
1దినవృత్తాంతములు 4:23 – వారు కుమ్మరివాండ్లయి నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమముచేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
Designed for protection
యెషయా 5:2 – ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను
Often made of thorns
మీకా 7:4 – వారిలో మంచివారు ముండ్లచెట్టు వంటివారు, వారిలో యథార్థవంతులు ముండ్లకంచె కంటెను ముండ్లుముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు.
Placed around
-Gardens
పరమగీతము 4:12 – నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.
విలాపవాక్యములు 2:6 – ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు యెహోవా సీయోనులో నియామకకాలము విశ్రాంతిదినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు.
-Vineyards
మత్తయి 21:33 – మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.
మార్కు 12:1 – ఆయన ఉపమానరీతిగా వారికి బోధింప నారంభించెను; ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచెవేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను.
Difficulty of breaking through
సామెతలు 15:19 – సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
Danger of breaking through
ప్రసంగి 10:8 – గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.
Desolation caused by removing
కీర్తనలు 80:12 – త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?
కీర్తనలు 80:13 – అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.
Filled with grasshoppers
నహూము 3:17 – నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరిపోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.
Poor travellers sought rest under
లూకా 14:23 – అందుకు యజమానుడు–నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గముల లోనికిని కంచెల లోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;
Afforded protection in danger
యిర్మియా 49:3 – హెష్బోనూ, అంగలార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవుచున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.
Making up gaps in, alluded to
యెహెజ్కేలు 13:5 – యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.
యెహెజ్కేలు 22:30 – నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు.
Illustrative
– Of God’s protection
యోబు 1:10 – నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.
-of Numerous afflictions
యోబు 3:23 – మరుగుపడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
యోబు 19:8 – నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
-of heavy judgments
విలాపవాక్యములు 3:7 – ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలువెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు
హోషేయ 2:6 – ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.
-of holy ordinances
యెషయా 5:2 – ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను
మత్తయి 21:33 – మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.
-of the way of the Slothful
సామెతలు 15:19 – సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
– (Broken down,) of the taking away of protection
కీర్తనలు 80:12 – త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?
యెషయా 5:5 – ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను