Display Topic


Forbidden

ప్రసంగి 7:9 – ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.

మత్తయి 5:22 – నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

రోమీయులకు 12:19 – ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.

A work of the flesh

గలతీయులకు 5:20 – విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

A characteristic of fools

సామెతలు 12:16 – మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.

సామెతలు 14:29 – దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

సామెతలు 27:3 – రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.

ప్రసంగి 7:9 – ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.

Connected with

-Pride

సామెతలు 21:24 – అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును.

-Cruelty

ఆదికాండము 49:7 – వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.

సామెతలు 27:3 – రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.

సామెతలు 27:4 – క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

-Clamour and evil-speaking

ఎఫెసీయులకు 4:31 – సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

-Malice and blasphemy

కొలొస్సయులకు 3:8 – ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

-Strife and contention

సామెతలు 21:19 – ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.

సామెతలు 29:22 – కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.

సామెతలు 30:33 – పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును

Brings its own punishment

యోబు 5:2 – దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.

సామెతలు 19:19 – మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.

సామెతలు 25:28 – ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.

Grievous words stir up

న్యాయాధిపతులు 12:4 – అప్పుడు యెఫ్తా గిలాదువారి నందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారుఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.

2సమూయేలు 19:43 – అందుకు ఇశ్రాయేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదావారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను.

సామెతలు 15:1 – మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.

Should not betray us into sin

కీర్తనలు 37:8 – కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము

ఎఫెసీయులకు 4:26 – కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు.

In prayer be free from

1తిమోతి 2:8 – కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైనచేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

May be averted by wisdom

సామెతలు 29:8 – అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.

Meekness pacifies

సామెతలు 15:1 – మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.

ప్రసంగి 10:4 – ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.

Children should not be provoked to

ఎఫెసీయులకు 6:4 – తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.

కొలొస్సయులకు 3:21 – తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.

Be slow to

సామెతలు 15:18 – కోపోద్రేకి యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

సామెతలు 16:32 – పరాక్రమశాలికంటె దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు

సామెతలు 19:11 – ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

తీతుకు 1:7 – ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,

యాకోబు 1:19 – నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

Avoid those given to

ఆదికాండము 49:6 – నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.

సామెతలు 22:24 – కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగియుండకుము

Justifiable, Exemplified

-Our Lord

మార్కు 3:5 – ఆయన వారి హృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

-Jacob

ఆదికాండము 31:36 – యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి?

-Moses

నిర్గమకాండము 11:8 – అప్పుడు నీ సేవకులైన వీరందరు నాయొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలువెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరోయెద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను

నిర్గమకాండము 32:19 – అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తనచేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను

లేవీయకాండము 10:16 – అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయియుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి

సంఖ్యాకాండము 16:15 – అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవాయొద్ద మనవిచేసెను.

-Nehemiah

నెహెమ్యా 5:6 – వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.

నెహెమ్యా 13:17 – అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?

నెహెమ్యా 13:25 – అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి

Sinful, Exemplified

-Cain

ఆదికాండము 4:5 – కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా

ఆదికాండము 4:6 – యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?

-Esau

ఆదికాండము 27:45 – అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొననేల అనెను.

-Simeon and Levi

ఆదికాండము 49:5 – షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.

ఆదికాండము 49:6 – నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.

ఆదికాండము 49:7 – వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.

-Moses

సంఖ్యాకాండము 20:10 – తరువాత మోషే అహరోనులు ఆ బండయెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.

సంఖ్యాకాండము 20:11 – అప్పుడు మోషే తన చెయ్యియెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.

-Balaam

సంఖ్యాకాండము 22:27 – గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తనచేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.

-Saul

1సమూయేలు 20:30 – సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?

-Ahab

1రాజులు 21:4 – నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.

-Naaman

2రాజులు 5:11 – అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి యిట్లనెను అతడు నాయొద్దకు వచ్చి నిలిచి,తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.

-Asa

2దినవృత్తాంతములు 16:10 – ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.

-Uzziah

2దినవృత్తాంతములు 26:19 – ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తినిచేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునేయున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.

-Haman

ఎస్తేరు 3:5 – మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి

-Nebuchadnezzar

దానియేలు 3:13 – అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.

-Jonah

యోనా 4:4 – అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.

-Herod

మత్తయి 2:16 – ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరిని వధించెను.

-Jews

లూకా 4:28 – సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని

– High Priest, &c

అపోస్తలులకార్యములు 5:17 – ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని

అపోస్తలులకార్యములు 7:54 – వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి.