Display Topic
Issues of life are out of
సామెతలు 4:23 – నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
God
-tries
1దినవృత్తాంతములు 29:17 – నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
యిర్మియా 12:3 – యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచుచున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱలనువలె వారిని హతము చేయుము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము.
-knows
కీర్తనలు 44:21 – హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?
యిర్మియా 20:12 – సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక
-searched
1దినవృత్తాంతములు 28:9 – సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.
యిర్మియా 17:10 – ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
-Understands the thoughts of
1దినవృత్తాంతములు 28:9 – సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.
కీర్తనలు 139:2 – నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
-Ponders
సామెతలు 21:2 – ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు.
సామెతలు 24:12 – ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
-Influences
1సమూయేలు 10:26 – సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంటవెళ్లిరి.
ఎజ్రా 6:22 – ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారిచేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.
ఎజ్రా 7:27 – యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజు యొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.
సామెతలు 21:1 – యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును.
యిర్మియా 20:9 – ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృద యములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు.
-Creates A new
కీర్తనలు 51:10 – దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
యెహెజ్కేలు 36:26 – నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
-Prepares
1దినవృత్తాంతములు 29:18 – అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.
సామెతలు 16:1 – హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును.
-Opens
అపోస్తలులకార్యములు 16:14 – అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను
-Enlightens
2కొరిందీయులకు 4:6 – గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
ఎఫెసీయులకు 1:18 – ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
-Strengthens
కీర్తనలు 27:14 – ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.
-Establishes
కీర్తనలు 112:8 – వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు.
1దెస్సలోనీకయులకు 3:13 – మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకనియెడల ఒకడును మనుష్యులందరియెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.
Should be
-Prepared to God
1సమూయేలు 7:3 – సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను మీ పూర్ణహృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.
-Given to God
సామెతలు 23:26 – నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,
-Perfect with God
1రాజులు 8:61 – కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.
-Applied to Wisdom
కీర్తనలు 90:12 – మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
సామెతలు 2:2 – జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల
-Guided in the right
సామెతలు 23:19 – నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.
-Purified
యాకోబు 4:8 – దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీచేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
-Single
ఎఫెసీయులకు 6:5 – దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీరవిషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి.
కొలొస్సయులకు 3:22 – దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.
-Tender
ఎఫెసీయులకు 4:32 – ఒకనియెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
-kept with Diligence
సామెతలు 4:23 – నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
We should
-believe with
అపోస్తలులకార్యములు 8:37 – ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.
రోమీయులకు 10:10 – ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
-serve God with all
ద్వితియోపదేశాకాండము 11:13 – కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల
– Keep God’s statutes with all
ద్వితియోపదేశాకాండము 26:16 – ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిననుసరించి నడుచుకొనవలెను.
-Walk before God with all
1రాజులు 2:4 – అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగానుండి నాయెదుట తమ పూర్ణహృదయముతోను పూర్ణమనస్సుతోను సత్యము ననుసరించి నడుచుకొనినయెడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనముమీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్నుగూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును.
-Trust in God with all
సామెతలు 3:5 – నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము
-love God with all
మత్తయి 22:37 – అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.
-return to God with all
ద్వితియోపదేశాకాండము 30:2 – సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీకాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల
-Do the will of God from
ఎఫెసీయులకు 6:6 – మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,
-Sanctify God in
1పేతురు 3:15 – నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
-love one another with A pure
1పేతురు 1:22 – మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి.
No man can cleanse
సామెతలు 20:9 – నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?
Faith, the means of purifying
అపోస్తలులకార్యములు 15:9 – వారి హృదయములను విశ్వాసమువలన పవిత్ర పరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు
Renewal of, promised under the gospel
యెహెజ్కేలు 11:19 – వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.
యెహెజ్కేలు 36:26 – నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
హెబ్రీయులకు 3:10 – కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.
When broken and contrite, not despised by God
కీర్తనలు 51:17 – విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
The pure in, shall see God
మత్తయి 5:8 – హృదయశుద్ధి గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
Pray that it may be
-Cleansed
కీర్తనలు 51:10 – దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
– Inclined to God’s testimonies
కీర్తనలు 119:36 – లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.
-united to fear God
కీర్తనలు 86:11 – యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
-Directed into the love of God
2దెస్సలోనీకయులకు 3:5 – దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.
Harden not, against God
కీర్తనలు 95:8 – అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొనినట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
హెబ్రీయులకు 4:7 – నేడు మీరాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
Harden not against the poor
ద్వితియోపదేశాకాండము 15:7 – నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు.
Regard not iniquity in
కీర్తనలు 66:18 – నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల ప్రభువు నా మనవి వినకపోవును.
Take heed lest it to be deceived
ద్వితియోపదేశాకాండము 11:16 – మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్తపడుడి.
Know the plague of
1రాజులు 8:38 – ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల
He that trusts in, is a fool
సామెతలు 28:26 – తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.