Display Topic
Origin of
ఆదికాండము 3:7 – అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.
ఆదికాండము 3:21 – దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
Called
-raiment
ఆదికాండము 28:20 – అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,
ద్వితియోపదేశాకాండము 8:4 – ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
-Clothes
సామెతలు 6:27 – ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?
యెహెజ్కేలు 16:39 – వారిచేతికి నిన్ను అప్పగించెదను, నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు.
-Clothing
యోబు 22:6 – ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి
యోబు 31:19 – వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయినయెడలను
-Vesture
ఆదికాండము 41:42 – మరియు ఫరో తనచేతినున్న తన ఉంగరము తీసి యోసేపుచేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి
ప్రకటన 19:16 – రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది.
Materials used for
-wool
సామెతలు 27:26 – నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును
యెహెజ్కేలు 34:3 – మీరు క్రొవ్విన గొఱ్ఱలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱలను మేపరు,
-Silk
సామెతలు 31:22 – ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.
-linen
లేవీయకాండము 6:10 – యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి
ఎస్తేరు 8:15 – అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజు సముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషమొందెను.
– Camel’s hair
మత్తయి 3:4 – ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
-Skins
హెబ్రీయులకు 11:37 – రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
-Sackcloth
2సమూయేలు 3:31 – దావీదుమీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.
2రాజులు 19:1 – హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి
Not to be made of mixed materials
ద్వితియోపదేశాకాండము 22:11 – ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు.
Of the sexes, not to be interchanged
ద్వితియోపదేశాకాండము 22:5 – స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.
Colours of, mentioned
-White
ప్రసంగి 9:8 – ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము.
-Blue
యెహెజ్కేలు 23:6 – తన విటకాండ్రమీద బహుగా ఆశపెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను.
-Purple
యెహెజ్కేలు 7:27 – రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషములనుబట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.
లూకా 16:19 – ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
-Scarlet
2సమూయేలు 1:24 – ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు.
దానియేలు 5:7 – రాజు గారడీ విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.
-different colours
ఆదికాండము 37:3 – మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.
2సమూయేలు 13:18 – కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.
Were often fringed and bordered
సంఖ్యాకాండము 15:38 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను.
ద్వితియోపదేశాకాండము 22:12 – నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను.
Scribes and Pharisees condemned for making broad the borders of
మత్తయి 23:5 – మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
Worn long and flowing
లూకా 20:46 – సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు.
ప్రకటన 1:13 – తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనియుండెను.
Girt up during employment
లూకా 17:8 – అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని
యోహాను 13:4 – భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.
Mentioned in scripture
-Hyke or upper garment
ద్వితియోపదేశాకాండము 24:13 – అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.
మత్తయి 21:8 – జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.
-Burnouse or cloak
లూకా 6:29 – నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము.
2తిమోతి 4:13 – ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
-Tunic or Coat
యోహాను 19:23 – సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక
యోహాను 21:7 – కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.
-Girdle
1సమూయేలు 18:4 – మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.
అపోస్తలులకార్యములు 21:11 – అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తనచేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్దాత్మ చెప్పుచున్నాడనెను
-Bonnet or hat
లేవీయకాండము 8:13 – అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను.
దానియేలు 3:21 – వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి.
-Shoe or sandal
నిర్గమకాండము 3:5 – అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
మార్కు 6:9 – చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను.
-Vail
ఆదికాండము 24:65 – మనలనెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
Liable to plague and leprosy
లేవీయకాండము 13:47 – మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి
లేవీయకాండము 13:48 – నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి
లేవీయకాండము 13:49 – ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.
లేవీయకాండము 13:50 – యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
లేవీయకాండము 13:51 – ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.
లేవీయకాండము 13:52 – కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.
లేవీయకాండము 13:53 – అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల
లేవీయకాండము 13:54 – యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను.
లేవీయకాండము 13:55 – ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.
లేవీయకాండము 13:56 – యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడియుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.
లేవీయకాండము 13:57 – అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.
లేవీయకాండము 13:58 – ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలినయెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;
లేవీయకాండము 13:59 – అప్పుడు అది పవిత్రమగును. బొచ్చుబట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలువస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.
Cleansed by water from ceremonial uncleanness
లేవీయకాండము 11:32 – వాటిలో చచ్చినదాని కళేబరము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయే గాని బట్టయే గాని చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును.
సంఖ్యాకాండము 31:20 – మీరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.
Of the rich
-of the finest Materials
మత్తయి 11:8 – సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.
-Gay
యాకోబు 2:23 – కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.
-Gorgeous
లూకా 7:25 – మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు.
అపోస్తలులకార్యములు 12:21 – నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా
-Embroidered
కీర్తనలు 45:14 – విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసికొనిరాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొనిరాబడుచున్నారు.
యెహెజ్కేలు 16:18 – మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి, నా తైలమును నా ధూపమును వాటికర్పించితివి.
-perfumed
కీర్తనలు 45:8 – నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.
పరమగీతము 4:11 – ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.
-Multiplied and heaped up
యోబు 27:17 – వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.
యెషయా 3:22 – ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
-Often moth-Eaten
యోబు 13:28 – మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
యాకోబు 5:2 – మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.
Of the poor
-Provided Specially by God
ద్వితియోపదేశాకాండము 10:18 – ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
-Vile
యాకోబు 2:2 – ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరము లోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల
-Used as A covering by night
ద్వితియోపదేశాకాండము 24:13 – అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.
-Not to be retained in pledge
ద్వితియోపదేశాకాండము 24:12 – ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
ద్వితియోపదేశాకాండము 24:13 – అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.
Grew old and wore out
యెహోషువ 9:5 – పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చు కొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.
కీర్తనలు 102:26 – అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
Of Israel preserved for forty years
ద్వితియోపదేశాకాండము 8:4 – ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
Were often changed
ఆదికాండము 35:2 – యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరితోను మీయొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.
ఆదికాండము 41:14 – ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.
Of those slain with a sword not used
యెషయా 14:19 – నీవు సమాధిపొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె నున్నావు
Given as a token of covenants
1సమూయేలు 18:4 – మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.
Given as presents
ఆదికాండము 45:22 – అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,
2రాజులు 5:22 – నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యమునుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరిగనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను.
Often rent in affliction
2సమూయేలు 15:32 – దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.
ఎజ్రా 9:3 – నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.
ఎజ్రా 9:5 – సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టుచేతులెతి ్త
Illustrative
– (White,) of righteousness
మత్తయి 28:3 – ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.
ప్రకటన 3:18 – నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
– (Rolled in blood,) of victory
యెషయా 9:5 – యుద్ధపు సందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.
– (Washed in wine,) of abundance
ఆదికాండము 49:11 – ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.