Display Topic
Descended from Jacob’s seventh son
ఆదికాండము 30:11 – లేయా ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను.
Predictions respecting
ఆదికాండము 49:19 – బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
ద్వితియోపదేశాకాండము 33:20 – గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును.
ద్వితియోపదేశాకాండము 33:21 – అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.
Persons selected from
-to number the people
సంఖ్యాకాండము 1:14 – గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
-to spy out the land
సంఖ్యాకాండము 13:15 – గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
Strength of, on leaving Egypt
సంఖ్యాకాండము 1:24 – గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
సంఖ్యాకాండము 1:25 – గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
The rear of second division of Israel in their journeys
సంఖ్యాకాండము 10:18 – రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
సంఖ్యాకాండము 10:19 – షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి.
సంఖ్యాకాండము 10:20 – గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.
Encamped south of the tabernacle under the standard of Reuben
సంఖ్యాకాండము 2:10 – రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణదిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.
సంఖ్యాకాండము 2:14 – అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.
Offering of, at the dedication
సంఖ్యాకాండము 7:42 – ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాపా.
సంఖ్యాకాండము 7:43 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
సంఖ్యాకాండము 7:44 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
సంఖ్యాకాండము 7:45 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను
సంఖ్యాకాండము 7:46 – పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
సంఖ్యాకాండము 7:47 – ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.
Families of
సంఖ్యాకాండము 26:15 – గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,
సంఖ్యాకాండము 26:16 – ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు;
సంఖ్యాకాండము 26:17 – ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.
Strength of, on entering Canaan
సంఖ్యాకాండము 26:18 – వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది.
On Ebal, said amen to the curse
ద్వితియోపదేశాకాండము 27:13 – రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.
Sought and obtained its inheritance east of Jordan
సంఖ్యాకాండము 32:1 – రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని
సంఖ్యాకాండము 32:2 – వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో
సంఖ్యాకాండము 32:3 – అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా
సంఖ్యాకాండము 32:4 – ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు.
సంఖ్యాకాండము 32:5 – కాబట్టి మాయెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా
సంఖ్యాకాండము 32:6 – మోషే గాదీయులతోను రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా?
సంఖ్యాకాండము 32:7 – యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు?
సంఖ్యాకాండము 32:8 – ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా
సంఖ్యాకాండము 32:9 – వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి.
సంఖ్యాకాండము 32:10 – ఆ దినమున యెహోవా కోపము రగులుకొని
సంఖ్యాకాండము 32:11 – ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప
సంఖ్యాకాండము 32:12 – మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను.
సంఖ్యాకాండము 32:13 – అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.
సంఖ్యాకాండము 32:14 – ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు.
సంఖ్యాకాండము 32:15 – మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లినయెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువచేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను.
సంఖ్యాకాండము 32:16 – అందుకు వారు అతనియొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లలకొరకు పురములను కట్టుకొందుము.
సంఖ్యాకాండము 32:17 – ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారిముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను.
సంఖ్యాకాండము 32:18 – ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగిరాము.
సంఖ్యాకాండము 32:19 – తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి.
సంఖ్యాకాండము 32:20 – అప్పుడు మోషే వారితో మీరు మీ మాటమీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టువరకు
సంఖ్యాకాండము 32:21 – యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధసన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల
సంఖ్యాకాండము 32:22 – ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైయుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును.
సంఖ్యాకాండము 32:23 – మీరు అట్లు చేయనియెడల యెహోవా దృష్టికి పాపము చేసినవారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి.
సంఖ్యాకాండము 32:24 – మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందలకొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాటచొప్పున చేయుడనెను.
సంఖ్యాకాండము 32:25 – అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము.
సంఖ్యాకాండము 32:26 – మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును.
సంఖ్యాకాండము 32:27 – నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికి వచ్చెదమనిరి.
సంఖ్యాకాండము 32:28 – కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను
సంఖ్యాకాండము 32:29 – గాదీయులును రూబేనీయులును అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతోకూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.
సంఖ్యాకాండము 32:30 – అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా
సంఖ్యాకాండము 32:31 – గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.
సంఖ్యాకాండము 32:32 – మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నదిదాటి కనాను దేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.
సంఖ్యాకాండము 32:33 – అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.
Bounds of its inheritance
యెహోషువ 13:24 – మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను.వారి సరి
యెహోషువ 13:25 – హద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును
యెహోషువ 13:26 – హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరి హద్దువరకును
యెహోషువ 13:27 – లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.
యెహోషువ 13:28 – వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్ట ణములును గ్రామములును ఇవి.
Cities built by
సంఖ్యాకాండము 32:34 – గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను
సంఖ్యాకాండము 32:35 – యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను
సంఖ్యాకాండము 32:36 – అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.
Assisted in conquest of Canaan
యెహోషువ 4:12 – మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి.
యెహోషువ 4:13 – సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.
After the conquest, returned home
యెహోషువ 22:9 – కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాటచొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్యభూమి యైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలో హులోనున్న ఇశ్రాయేలీయులయొద్దనుండి బయలుదేరిరి. కనానుదేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు
Assisted in building the altar of witness which excited the jealousy of Israel
యెహోషువ 22:10 – రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్థ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠ మును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే.
యెహోషువ 22:11 – అప్పుడు రూబే నీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల యెదుటివైపున యొర్దానుప్రదేశ ములో కనానుదేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను.
యెహోషువ 22:12 – ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి
యెహోషువ 22:13 – ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయులయొద్దకును గాదీయులయొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారియొద్దకును యాజకు డగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి.
యెహోషువ 22:14 – ఇశ్రాయేలీయుల గోత్రముల న్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా పదిమంది ప్రధానులను అతనితో కూడ పంపిరి, వారందరు ఇశ్రాయేలీయుల సమూ హములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు.
యెహోషువ 22:15 – వారు గిలాదుదేశములోనున్న రూబేనీయులయొద్దకును గాదీయులయొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారియొద్ద కును పోయి వారితో ఇట్లనిరి
యెహోషువ 22:16 – యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగానేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయు చున్నారు?
యెహోషువ 22:17 – పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజ ములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దానినుండి పవిత్రపరచుకొనకయున్నాము.
యెహోషువ 22:18 – మీరు ఈ దిన మున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగ బడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతె ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమా జముమీద కోపపడును గదా?
యెహోషువ 22:19 – మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్ర ముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలి పీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి,
యెహోషువ 22:20 – జెరహు కుమారుడైన ఆకాను ప్రతి ష్ఠితమైన దానివిషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషమువలన ఆ మనుష్యుడొకడే మరణ మాయెనా?
యెహోషువ 22:21 – అందుకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా
యెహోషువ 22:22 – దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలి యును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహముచేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.
యెహోషువ 22:23 – యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్య మునైనను దానిమీద అర్పించుటకే గాని సమా ధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితివిు.
యెహోషువ 22:24 – ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితోఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము?
యెహోషువ 22:25 – రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతా నపువారు మా సంతానపువా రిని యెహోవా విషయములో భయభక్తులులేని వార గునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువుచేతనే దీని చేసితివిు.
యెహోషువ 22:26 – కాబట్టి మేముమనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలుల నర్పించుటకైనను బలి నర్పిం చుటకైనను కాదు.
యెహోషువ 22:27 – మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకుయెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.
యెహోషువ 22:28 – అందుకు మేముఇకమీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినయెడల మేముమన పిత రులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదుగాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి.
యెహోషువ 22:29 – ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలి పీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగి పోయినయెడల నేమి యెహోవామీద ద్రోహము చేసినయెడల నేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక.
Many from other tribes sought refuge with, from the Philistines
1సమూయేలు 13:7 – కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లిపోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.
Eleven of, swam the Jordan, and joined David in the hold
1దినవృత్తాంతములు 12:8 – మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాదవేగము గలవారు.
1దినవృత్తాంతములు 12:9 – వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,
1దినవృత్తాంతములు 12:10 – నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
1దినవృత్తాంతములు 12:11 – ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,
1దినవృత్తాంతములు 12:12 – ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,
1దినవృత్తాంతములు 12:13 – పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.
1దినవృత్తాంతములు 12:14 – గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్యధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,
1దినవృత్తాంతములు 12:15 – యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.
Some of, at coronation of David
1దినవృత్తాంతములు 12:37 – మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.
1దినవృత్తాంతములు 12:38 – ఇశ్రాయేలులో కడమ వారందరును ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి.
David appointed rulers over
1దినవృత్తాంతములు 26:32 – పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటిపెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబేనీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను.
Spoiled the Hagarites
1దినవృత్తాంతములు 5:18 – రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.
1దినవృత్తాంతములు 5:19 – వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.
1దినవృత్తాంతములు 5:20 – యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను
1దినవృత్తాంతములు 5:21 – గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.
1దినవృత్తాంతములు 5:22 – యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడువరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.
Subdued by Hazael king of Syria
2రాజులు 10:33 – హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలోనున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబెనియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను.
Taken captive to Assyria
2రాజులు 15:29 – ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొనిపోయెను.
1దినవృత్తాంతములు 5:22 – యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడువరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.
1దినవృత్తాంతములు 5:26 – కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.
Land of, seized by the Moabites and Ammonites
యిర్మియా 48:18 – దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీమీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము ఎండినదేశములో కూర్చుండుము.
యిర్మియా 48:19 – ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.
యిర్మియా 48:20 – మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
యిర్మియా 48:21 – మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
యిర్మియా 48:22 – నెబోకును బేత్‌దిబ్లాతయీమునకును కిర్యతాయిమునకును బేత్గామూలునకును
యిర్మియా 48:23 – బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
యిర్మియా 48:24 – మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడియున్నది.
యిర్మియా 49:1 – అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు?