Display Topic
Descent of
ఆదికాండము 10:15 – కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
ఆదికాండము 10:16 – హివ్వీయులను అర్కీయులను సినీయులను
1దినవృత్తాంతములు 1:13 – కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
1దినవృత్తాంతములు 1:14 – యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
One of the seven nations of Canaan
ఆదికాండము 15:21 – అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
నిర్గమకాండము 3:8 – కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను.
నిర్గమకాండము 3:17 – ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.
Governed by many independent kings
యెహోషువ 5:1 – వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల యెదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటిదిక్కుననున్న అమోరీయుల రాజు లందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజు లందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయముచేత వారి కిక ధైర్యమేమియు లేక పోయెను.
యెహోషువ 9:10 – హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.
Kings of, great and powerful
కీర్తనలు 136:18 – ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనలు 136:20 – బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
Originally inhabited a mountain district in the south
సంఖ్యాకాండము 13:29 – అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి.
ద్వితియోపదేశాకాండము 1:7 – మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసు వరకును వెళ్లుడి.
ద్వితియోపదేశాకాండము 1:20 – అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము.
న్యాయాధిపతులు 1:36 – అమోరీయుల సరి హద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.
Acquired an extensive territory from Moab east of Jordan
సంఖ్యాకాండము 21:26 – హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.
సంఖ్యాకాండము 21:30 – వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడుచేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
Had many and strong cities
సంఖ్యాకాండము 32:17 – ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారిముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను.
సంఖ్యాకాండము 32:33 – అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.
Of gigantic strength and stature
ఆమోసు 2:9 – దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,
Character of
-Profane and Wicked
ఆదికాండము 15:16 – అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
-Idolatrous
యెహోషువ 24:15 – యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
Defeated by Chedorlaomer, &c
ఆదికాండము 14:7 – తిరిగి కాదేషను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.
Joined Abraham against the kings
ఆదికాండము 14:13 – తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.
ఆదికాండము 14:24 – అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆ యా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.
Jacob took a portion from
ఆదికాండము 48:22 – నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయులచేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.
Forbearance of God towards
ఆదికాండము 15:16 – అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
Doomed to utter destruction
ద్వితియోపదేశాకాండము 20:17 – వీరు, అనగా హీత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,
ద్వితియోపదేశాకాండము 20:18 – నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను.
Refused a passage to Israel
సంఖ్యాకాండము 21:21 – ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.
సంఖ్యాకాండము 21:22 – మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి.
సంఖ్యాకాండము 21:23 – అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.
ద్వితియోపదేశాకాండము 2:30 – అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీచేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.
Deprived of their eastern territory by Israel
సంఖ్యాకాండము 21:24 – ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది.
సంఖ్యాకాండము 21:25 – అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి.
సంఖ్యాకాండము 21:26 – హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.
సంఖ్యాకాండము 21:27 – కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను
సంఖ్యాకాండము 21:28 – హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
సంఖ్యాకాండము 21:29 – మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను.
సంఖ్యాకాండము 21:30 – వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడుచేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
సంఖ్యాకాండము 21:31 – అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.
సంఖ్యాకాండము 21:32 – మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.
సంఖ్యాకాండము 21:33 – వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా
సంఖ్యాకాండము 21:34 – యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీచేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.
సంఖ్యాకాండము 21:35 – కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి.
Land of, given to Reubenites, &c
యెహోషువ 13:15 – వారి వంశములనుబట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్య మిచ్చెను.
యెహోషువ 13:16 – వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు
యెహోషువ 13:17 – హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను
యెహోషువ 13:18 – యాహసు కెదేమోతు మేఫాతు
యెహోషువ 13:19 – కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు
యెహోషువ 13:20 – బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణము లన్నియు, హెష్బోనులో ఏలికయు,
యెహోషువ 13:21 – మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీ యుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్య ముగా ఇచ్చెను.
యెహోషువ 13:22 – ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడు నైన బిలామును తాము చంపిన తక్కినవారితో పాటు ఖడ్గముతో చంపిరి.
యెహోషువ 13:23 – యొర్దాను ప్రదేశమంతయు రూబేనీ యులకు సరిహద్దు; అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము.
యెహోషువ 13:24 – మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను.వారి సరి
యెహోషువ 13:25 – హద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును
యెహోషువ 13:26 – హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరి హద్దువరకును
యెహోషువ 13:27 – లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.
యెహోషువ 13:28 – వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్ట ణములును గ్రామములును ఇవి.
యెహోషువ 13:29 – మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము.
యెహోషువ 13:30 – వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.
యెహోషువ 13:31 – గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.
Western kings of, confederated against Israel
యెహోషువ 10:1 – యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు; అతడు యెరికోను దాని రాజును నిర్మూలముచేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలముచేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధిచేసికొని వారితో కలిసికొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడిరి.
యెహోషువ 10:2 – ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకుగిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని
యెహోషువ 10:3 – హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
యెహోషువ 10:4 – లాకీషురాజైన యాఫీయయొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను.
యెహోషువ 10:5 – కాబట్టి అమోరీయుల అయిదుగురురాజులను, అనగా యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి.
Miraculous overthrow of
యెహోషువ 10:11 – మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్ హోరోనుకు దిగిపోవుత్రోవను పారి పోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.
యెహోషువ 10:12 – యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
యెహోషువ 10:13 – సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.
యెహోషువ 10:14 – యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.
Kings of, degraded and slain
యెహోషువ 10:24 – వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువయొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.
యెహోషువ 10:25 – అప్పుడు యెహోషువ వారితోమీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి; మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను.
యెహోషువ 10:26 – తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను.
యెహోషువ 10:27 – ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి.
The Gibeonites a tribe of, deceived Israel into a league
2సమూయేలు 21:2 – గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను.
యెహోషువ 9:3 – యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబి యోను నివాసులు వినినప్పుడు
యెహోషువ 9:4 – వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షా రసపు సిద్దెలు తీసికొని
యెహోషువ 9:5 – పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చు కొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.
యెహోషువ 9:6 – వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువయొద్దకు వచ్చిమేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పగా
యెహోషువ 9:7 – ఇశ్రాయేలీయులుమీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివీ్వ యులతో ననిరి.
యెహోషువ 9:8 – వారుమేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువమీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా
యెహోషువ 9:9 – వారునీ దేవుడైన యెహోవా నామ మునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చి తివిు; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న
యెహోషువ 9:10 – హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.
యెహోషువ 9:11 – అప్పుడు మా పెద్దలును మా దేశనివాసు లందరును మాతోమీరు ప్రయాణ ముకొరకు ఆహారముచేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితోమేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.
యెహోషువ 9:12 – మీయొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధ పరచుకొని మా యిండ్లనుండి తెచ్చు కొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.
యెహోషువ 9:13 – ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెనని అతనితో చెప్పిరి.
యెహోషువ 9:14 – ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా
యెహోషువ 9:15 – యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి.
యెహోషువ 9:16 – అయితే వారితో నిబంధన చేసి మూడు దినము లైన తరువాత, వారు తమకు పొరుగు వారు, తమ నడుమను నివసించువారే యని తెలిసికొనిరి.
The Israelites unable to expel, but extracted tribute from
న్యాయాధిపతులు 1:34 – అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.
న్యాయాధిపతులు 1:35 – అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి
Had peace with Israel in the days of Samuel
1సమూయేలు 7:14 – మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగివచ్చెను. ఎక్రోనునుండి గాతువరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.
Brought into bondage by Solomon
1రాజులు 9:20 – అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.
1రాజులు 9:21 – ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.
Ahab followed the abominations of
1రాజులు 21:26 – ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను.
Manasseh exceeded abominations of
2రాజులు 21:11 – యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.
The Jews after the captivity condemned for intermarrying with
ఎజ్రా 9:1 – ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నాయొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరుపరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు,
ఎజ్రా 9:2 – వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులైయుండిరని చెప్పిరి.
Descent from, illustrative of man’s natural state
యెహెజ్కేలు 16:3 – ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశసంబంధమైనవి; నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.